ప్రేమ

love

క్రీస్తు మనలను ప్రేమించినట్లు ప్రేమించుడి

“నేను మిమ్మును ప్రేమించినట్టే” (యోహాను 13: 34) ఒకరినొకరు ప్రేమించుకోవాలని యేసు తన శిష్యులతో చెప్పాడు. యేసు చూపించిన ప్రేమ ఒక చెక్ రాసివ్వటమో లేక నెలకొకసారి ఫోన్లో మాట్లాడేటువంటి ప్రేమైతే అది అంత కష్టమేమీ కాదు. కానీ యేసు ప్రమాణాలను కొలువ శక్యముకాని విధముగా పెంచేశాడు. యేసు వంటి ప్రేమ కుష్ఠురోగి యొక్క చర్మాన్ని తాకింది, త్వరలో ద్రోహం చేయువాని పాదాలను కడిగింది. ఇతరులందరూ అసహ్యించుకున్న వ్యక్తి యొక్క అవసరాలు ఆయనకు అంతరాయం కలిగించినా, ఆయన ఏమీ అనుకోలేదు. అక్కడ లోతైన అవసరాన్ని చూడటానికి ఒక వ్యక్తి యొక్క ఆత్మను సూటిగా చూసే అసాధారణ సామర్థ్యం యేసుకు ఉంది.

అనుసరించడానికి ఇది అసాధ్యమైన ఉదాహరణనా? ఇది ముమ్మాటికీ నిజం! అందుకే దేవుడు మనలో నివసించడానికి మరియు తన దివ్యమైన ప్రేమతో మనలను శక్తివంతం చేయడానికి పరిశుద్ధాత్మను పంపాడు. ఆ శక్తికి “అనుసంధానం” చేయబడినప్పుడు మాత్రమే ఆయనను వెంబడించువారు ఇతరులకు మరియు ఒకరినొకరు పరిచర్య చేయడంలో ముఖ్యమైనవారుగా ఉంటారు. అప్పుడు ప్రజలు గమనించి, “ఓరి, వారు ఒకరినొకరు ఎలా ప్రేమించుకుంటున్నారు!” అని అంటారు. ఈ వనరులు మిమ్మల్ని రక్షకుని ప్రేమతో ప్రేమించే మార్గంలో స్థిరపరచనివ్వండి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి