ముప్పై ఏళ్ల అనుభవజ్ఞుడైన మిషనరీ యొక్క పర్సులో బాగా పాతగిలిన కాగితంపై దండాన్వయము చేయబడిన మాటలను ఎవరో యెత్తి వ్రాసారు. తన భర్తతో కలిసి, ఆమె సుడాన్‌లోని ఖార్టూమ్‌లో పని విషయమై ఇంకో పర్యటనకు వెళుతోంది. దీన్ని ఎవరు రచించారో ఎవరికీ తెలియదు, కానీ ప్రేమపై ఇప్పటివరకు వ్రాయబడిన గొప్ప వ్యాసం యొక్క సారాంశాన్ని సంగ్రహించారు.
నాకు భాష చాలా బాగా వచ్చి పండితుడిలా మాట్లాడినా, హృదయాన్ని ఒడిసిపట్టుకునే ప్రేమ లేకపోతే, నేను వ్యర్థుడను. నాకు అలంకారాలు మరియు డిప్లొమాలు మరియు నవీనమైన పద్ధతులలో ప్రావీణ్యం కలిగివున్నా సరే, కొంచెం కూడా ప్రేమను అర్థం చేసుకోకపోతే, నేను వ్యర్థుడను.
నేను నా ప్రత్యర్థులను మూర్ఖులను చేసేలా వాదనలో హీనపరచగలిగి, ప్రీతిగా మాట్లాడకపోతే, నేను వ్యర్థుడను. నాకు విశ్వాసము మరియు గొప్ప ఆదర్శాలు మరియు అద్భుతమైన ప్రణాళికలు మరియు అద్భుతమైన దర్శనాలు ఉండి, చెమటోడ్చి రక్తము చిందించి, కన్నీరుకారుస్తూ ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఉండే ప్రేమ లేకపోతే, నేను వ్యర్థుడను.
నేను అన్ని అవకాశాలను వదులుకుని, ఇల్లు మరియు స్నేహితులను మరియు సౌకర్యాలను విడిచిపెట్టి, మిషనరీ సేవ నిమిత్తం త్యాగం చేసినట్లుగా నన్ను నేను చూపించుకొని, మిషనరీ జీవితంలో రోజువారీ చికాకులు మరియు వ్యక్తిగత చికాకుల మధ్య చిరాకుగా మరియు స్వార్థంగా మారిపోయి, భారతదేశం యొక్క ఎండ మరియు చెమట మరియు దుమ్ముధూళిలో నా శరీరం క్షయించిపోవడానికి అప్పగించినప్పటికీ, దాని హక్కులను, అది కోరుకునే విశ్రాంతిని, దాని ప్రియమైన ప్రణాళికలను ఒప్పుకోకపోతే, నేను వ్యర్థుడను, వ్యర్థుడను. సత్ప్రవర్తన నాలోనుండి బయలువెళ్లడం ఆగిపోయింది.
నేను అన్ని రకాల జబ్బులు మరియు వ్యాధులను నయం చేయగలిగినా, దయతో కూడిన ప్రేమ కోసం నేను హృదయాలను గాయపరచి, భావాలను కించపరిస్తే, నేను వ్యర్థుడను. ప్రపంచాన్ని అగాపే ప్రేమచేత గెలవగలిగే పుస్తకాలను నేను వ్రాసి, కథనాలను ప్రచురించినా, ప్రేమ భాషలో సిలువ మాటను లిప్యంతరీకరించడంలో విఫలమైతే, నేను వ్యర్థుడను. ఘోరంగా, నేను సమర్ధుడనుగా, బిజీగా, తొందరపడుచూ, సమయస్ఫూర్తి కలిగి ఉండవచ్చు, మరియు బాగా సన్నద్ధం కావచ్చు, కానీ లవొదికయలోని సంఘంలాగా—క్రీస్తుకు అసహ్యం పుట్టించేవాడినవుతాను.
వ్యర్థంగా కాకుండా . . . ఏదోయొకటి సాధించే విధంగా . . . మీరు మరియు నేను ఇలాంటి జీవితానికి కట్టుబడి ఉందాము.
దేవుడు మనకిచ్చే ప్రతి క్రొత్తదినము ఒక క్రొత్త అవకాశమే.
Adapted from Charles R. Swindoll, “The Final Priority,” in Growing Strong in the Seasons of Life (Portland, Ore.: Multnomah, 1983), 310-11. Copyright © 1983 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.