కోమల్ సుభధీర్ వేంపాటి గురించి

కోమల్ సుభధీర్ వేంపాటి భారతదేశంలో తెలుగు భాషా పాస్టరుగా మా పరిచర్యలో చేరారు. సుభధీర్ 2018 మేలో డల్లాస్ థియోలాజికల్ సెమినరీ నుండి ThM డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఈయన భారతదేశంలో జీవాంతర్దృష్టి పరిచర్యకు (ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్) మొదటి పాస్టర్. సంవత్సరాల క్రితం భారతదేశంలో పరిచర్యకు అనువాద కార్యము జరిగినప్పటికీ, మన ఐఎఫ్ఎల్ కోసం భారతదేశంలో నేరుగా పనిచేసే మొదటి పాస్టర్ సుభధీర్. ఈయన ప్రస్తుతం భారతీయ వెబ్‌సైట్ కోసం కథనాలను అనువదిస్తున్నాడు మరియు పాస్టర్ చక్ యొక్క ఉపదేశములను అనువదించడానికి మరియు రికార్డ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు. అతను ఆంధ్ర బైబిల్ చాపెల్‌లో అసిస్టెంట్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. తన తల్లిదండ్రులతో కలిసి సుభధీర్ మరియు అతని భార్య ఉష ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో నివసిస్తున్నారు. అతను తన తండ్రి యొక్క పరిచర్యయైన “గ్రేస్ గెలాక్సీ మ్యూజిక్ మినిస్ట్రీస్”కు నిర్వాహకుడు. ఇది సంగీత వేదిక ద్వారా సువార్త సందేశంతో ప్రజలను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అతను అప్పుడప్పుడు తన నగరంలోని వివిధ సంఘాలలో వాక్యోపదేశము చేస్తుంటాడు.

“నా దేశంలోని ప్రజలు చాలా భక్తిగలవారు. అందుకే ప్రతిదానిలో దేవుణ్ణి వెతుక్కుంటారు. అయితే వారు మానవ నిర్మిత సంప్రదాయాలు మరియు ఆచారాలలో చిక్కుకుపోయారు. చాలామంది పరలోకానికి వెళ్ళుటకు తమ శరీరాలను నలుగగొట్టుకుంటున్నారు, కాని శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నారు. యేసుక్రీస్తు మాత్రమే మానవాళి కోరుకుంటున్న శాంతిని సమాధానమును అనుగ్రహిస్తాడు. ఆయనే మార్గం, సత్యం మరియు జీవమైయున్నాడు. తమ జీవితాల్లో అర్ధం కోసం ఎదురుచూసేవారికి ఈ నిరీక్షణ మరియు కృప యొక్క సందేశాన్ని తీసుకెళ్లడం మరియు లేఖనాలను శోధించడం ద్వారా మన రక్షకుడికి సంబంధించిన జ్ఞానాన్ని వారికి ఇవ్వడమే ఇన్సైట్ ఫర్ లివింగ్ వద్ద మా లక్ష్యం.” – కోమల్ సుభధీర్ వేంపాటి గురించి