పాస్టర్ చక్ స్విన్డాల్

చార్లెస్ ఆర్. స్విన్డాల్ తన జీవితాన్ని దేవుని వాక్యం మరియు ఆయన కృప యొక్క ఖచ్చితమైన, ఆచరణాత్మక బోధన మరియు అనువర్తనానికి అంకితం చేశారు. పాస్టరుగా ఉండటం ఆయనకెంతో ఇష్టం. చక్ టెక్సాస్, మసాచుసెట్స్ మరియు కాలిఫోర్నియాలోని సమూహాలకు సీనియర్ పాస్టరుగా పనిచేశారు. 1998 నుండి, ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపకునిగా మరియు సీనియర్ పాస్టర్-ఉపాధ్యాయునిగా పనిచేశారు. అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ సంస్థను దాటి విస్తరించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసారంలో ఒక ప్రముఖ కార్యక్రమంగా, ఇన్సైట్ ఫర్ లివింగ్ ప్రపంచంలోని ప్రధాన క్రైస్తవ రేడియో మార్కెట్లలో ప్రసారం అవుతుంది, వారు అర్థం చేసుకోగలిగే భాషలలో జన సమూహాలకు చేరుకుంటుంది. చక్ యొక్క విస్తృతమైన రచనా పరిచర్య ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు శరీరానికి సేవ చేసింది మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీ అధ్యక్షుడిగా పనిచేసి, ఇప్పుడు ఛాన్సలర్‌గా ఆయన నాయకత్వం పరిచర్య కోసం కొత్త తరాన్ని తయారు చేయడానికి మరియు సిద్ధం చేయడానికి సహాయపడింది.జీవితం మరియు పరిచర్యలో ఆయన భాగస్వామియైన సింథియా మరియు చక్ కు నలుగురు పిల్లలు, పదిమంది మనవళ్ళు మరియు ఏడుగురు మునుమనవళ్లను కలిగి ఉన్నారు.

పరిచర్యకు పిలుపు

యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్లో తన విధి నిర్వహణలో ఒకినావా ద్వీపంలో ఉన్నప్పుడు, తన జీవితాన్ని సువార్త పరిచర్యకు అంకితం చేయమని ప్రభువు పిలుస్తున్నట్లు చక్ గుర్తించాడు. యాభై ఒక్క సంవత్సరాలకు పైగా జీవితంలో తన భాగస్వామి అయిన సింథియాతో కలిసి చక్ దేవుని దయతో ఆచరణాత్మక, బైబిల్ సత్యాన్ని మరియు దాని అనువర్తనాన్ని తెలియచేయటం ఒక సవాలుగా తీసుకొని తనను తాను అంకితం చేసుకున్నాడు.

చదువు

మెరైన్ కార్ప్స్ నుండి గౌరవప్రదంగా విడుదల చేయబడిన తరువాత, చక్ డల్లాస్ థియోలాజికల్ సెమినరీ [DTS] లో చేరాడు. DTS లో చక్ యొక్క ప్రయాణం మరియు ఆయన అక్కడ కలుసుకున్న జీవితకాల సలహాదారులు ఆయన జీవితాన్ని మరియు ఆయన పరిచర్య యొక్క గమనముపై శాశ్వత ముద్రవేశారు.

చక్ 1963 లో డల్లాస్ థియోలాజికల్ సెమినరీ నుండి మూడు ప్రధాన గౌరవాలతో మాగ్నా కమ్ లాడ్ పట్టభద్రుడయ్యాడు:

  • ఎక్స్పోజిటరీ బోధనకు హ్యారీ ఎ. ఐరన్‌సైడ్ అవార్డు
  • తన అకాడెమిక్ మేజర్ రంగంలో గొప్ప ఘనత సాధించినందుకు క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అవార్డు
  • అధ్యాపకుల అభిప్రాయం ప్రకారం అత్యుత్తమ గ్రాడ్యుయేట్ కోసం ఫ్యాకల్టీ అవార్డు

పరిచర్యకు చేసిన కృషికి గుర్తింపుగా చక్ నాలుగు గౌరవ డాక్టరేట్ డిగ్రీలను కూడా అందుకున్నాడు:

  • డాక్టర్ ఆఫ్ డివినిటీ, టాల్బోట్ థియోలాజికల్ సెమినరీ, 1977
  • డాక్టర్ ఆఫ్ హ్యూమన్ లెటర్స్, టేలర్ యూనివర్శిటీ, 1986
  • డాక్టర్ ఆఫ్ లాస్, పెప్పర్డిన్ విశ్వవిద్యాలయం, 1990
  • డాక్టర్ ఆఫ్ లిటరేచర్, డల్లాస్ బాప్టిస్ట్ విశ్వవిద్యాలయం, 1997

కాపరిగా పరిచర్య

నలభై సంవత్సరాలకు పైగా, చక్ యొక్క పుల్పిట్ పరిచర్య ఆచరణాత్మక, బైబిల్ సత్యం మరియు దాని అనువర్తనానికి రాజీలేని నిబద్ధతతో పాటు దేవుని దయను నొక్కి చెప్పింది. ఆయన కాపరిగా తన పరిచర్యలో ఈ క్రింది సమూహాలకు సేవ చేశాడు:

  • గ్రేస్ బైబిల్ చర్చి, డల్లాస్, టెక్సాస్, అసిస్టెంట్ పాస్టర్, 1963-1965
  • వాల్థం ఎవాంజెలికల్ ఫ్రీ చర్చి, వాల్థం, మసాచుసెట్స్, 1965-1967
  • ఇర్వింగ్ బైబిల్ చర్చి, ఇర్వింగ్, టెక్సాస్, 1967-1971
  • మొదటి ఎవాంజెలికల్ ఫ్రీ చర్చి, ఫుల్లెర్టన్, కాలిఫోర్నియా, 1971-1994
  • స్టోన్‌బ్రియర్ కమ్యూనిటీ చర్చి, ఫ్రిస్కో, టెక్సాస్. అక్టోబర్ 1998 లో, చక్ స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చిని స్థాపించాడు, అక్కడ ఆయన సీనియర్ పాస్టర్‌గా కొనసాగుతున్నారు.

పాస్టరుగా, చక్ ఈ క్రింది అవార్డులను అందుకున్నాడు:

  • క్లెర్జీమాన్ ఆఫ్ ది ఇయర్, రెలిజియస్ హెరిటేజ్ ఆఫ్ అమెరికా, 1988
  • బేలర్ విశ్వవిద్యాలయం మరియు జార్జ్ డబ్ల్యూ. ట్రూట్ థియోలాజికల్ సెమినరీ, 1997 యొక్క ఎఫెక్టివ్ ప్రీచర్స్ ప్రోగ్రాం ద్వారా దేశంలోని మొదటి పన్నెండు మంది బోధకులలో ఒకరుగా పేర్కొనబడ్డారు
  • 2009 లో ఒక సర్వేలో , తమను బాగా ప్రభావితం చేసిన సజీవ క్రైస్తవ బోధకుల పేర్లను చెప్పమన్నప్పుడు 800 మంది ప్రొటెస్టంట్ పాస్టర్లు రెవరెండ్ బిల్లీ గ్రాహం తరువాత రెండవ స్థానంలో చక్ నిలిచారు (లైఫ్ వే రీసెర్చ్ నిర్వహించిన సర్వే).

ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్

చక్ యొక్క సమూహం స్థానిక సంఘ సంస్థకు మించినది. ఇన్సైట్ ఫర్ లివింగ్ ప్రసారం ద్వారా, చక్ యొక్క బోధన ప్రపంచవ్యాప్తంగా అనేక విదేశీ భాషలలోని 2,100 కంటే ఎక్కువ అవుట్లెట్ల ద్వారా ప్రసారం అవుతోంది. మరియు విస్తరిస్తున్న వెబ్‌కాస్ట్ మరియు పోడ్‌కాస్ట్ ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉంది. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ యుఎస్ఎ బోర్డు ఛైర్మన్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య సింథియా ఇన్‌సైట్ ఫర్ లివింగ్ యుఎస్‌ఎ అధ్యక్షురాలిగా మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. క్రైస్తవ ప్రసారంలో ప్రముఖ రేడియో కార్యక్రమాలలో ఒకటిగా మారడానికి వారు దాని విస్తరణకు దిశానిర్దేశం చేశారు. వారి నాయకత్వం చక్ సందేశాలను ప్రపంచ జనాభాలో ఎక్కువ మందికి అందుబాటులో ఉంచింది. టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ప్రధాన కార్యాలయం ఉన్న ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ ఇప్పుడు 90 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. మేము ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, గ్వాటెమాల, మిడిల్ ఈస్ట్, పోలాండ్, రొమేనియా, రష్యా మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లో కార్యాలయాలను నిర్వహిస్తున్నాము.

ఇన్సైట్ ఫర్ లివింగ్ లో ఉపాధ్యాయుడిగా, చక్ ఈ క్రింది అవార్డులను అందుకున్నారు:

  • ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇయర్, నేషనల్ రిలిజియస్ బ్రాడ్‌కాస్టర్స్, 1994
  • రెలిజియస్ బ్రాడ్‌కాస్టర్ ఆఫ్ ది ఇయర్, నేషనల్ రిలిజియస్ బ్రాడ్‌కాస్టర్స్, 1999
  • హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు, నేషనల్ రిలిజియస్ బ్రాడ్‌కాస్టర్స్, 2000

గ్రంథకర్తృత్వం

చక్ యొక్క ఫలవంతమైన రచనా పరిచర్య ముప్పై సంవత్సరాలుగా క్రీస్తు శరీరాన్ని ఆశీర్వదించింది. 1977 లో యు అండ్ యువర్ చైల్డ్ తో ప్రారంభించి, చక్ ప్రపంచవ్యాప్తంగా చదువరులకు 70 కి పైగా శీర్షికలను అందించారు. క్రిస్టియన్ బుక్ సెల్లర్స్ అసోసియేషన్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆయన పుస్తకాలు:

  • స్ట్రెన్థెనింగ్ యువర్ గ్రిప్
  • ఇంప్రూవింగ్ యువర్ సర్వ్
  • డ్రాపింగ్ యువర్ గార్డ్
  • లివింగ్ ఆన్ ద రాగ్డ్ ఎడ్జ్‌
  • లివింగ్ అబవ్ ద లెవెల్ ఆఫ్ మిడియాక్రిటి
  • ద గ్రేస్ అవేకెనింగ్
  • సింపిల్ ఫేయిత్
  • లాఫ్ అగేయిన్
  • ద ఫినిషింగ్ టచ్
  • ఇంటిమసీ విత్ ది ఆల్మైటీ
  • సడన్లీ వన్ మార్నింగ్
  • ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ విల్
  • విస్డమ్ ఫర్ ద వే
  • ద డార్క్నెస్ అండ్ ద డాన్
  • ఎ లైఫ్ వెల్ లివ్డ్
  • గ్రేట్ లైవ్స్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ సిరీస్, ఇందులో జోసెఫ్, డేవిడ్, ఎస్తేర్, మోజెస్, ఎలైజా, పాల్, జోబ్ , మరియు జీసస్: ద గ్రేటెస్ట్ లైఫ్ ఆఫ్ ఆల్..

రచయితగా, చక్ ఈ క్రింది అవార్డులను అందుకున్నారు:

  • గోల్డ్ మెడల్లియన్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, ఎవాంజెలికల్ ప్రెస్ అసోసియేషన్, 1997
  • పన్నెండు గోల్డ్ మెడల్లియన్ అవార్డులు
  • క్రిస్టియన్ బుక్ అవార్డు బైబిల్ ఆఫ్ ది ఇయర్, 2018

డల్లాస్ థియోలాజికల్ సెమినరీ

ఏడు సంవత్సరాలు (1994-2001) డల్లాస్ థియోలాజికల్ సెమినరీ యొక్క నాల్గవ అధ్యక్షుడిగా పనిచేసిన తరువాత, చక్ 2001 లో సెమినరీ ఛాన్సలర్‌ అయ్యారు. ప్రపంచంలో ఆరవ అతిపెద్ద సెమినరీగా, దేవుని వాక్యం ప్రకటింపబడటం కోసం మరియు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు శరీరాన్ని నిర్మించడం కోసం దైవిక సేవ-నాయకులను సన్నద్ధం చేయడమే DTS యొక్క ప్రాధమిక లక్ష్యం. ఈ లక్ష్యం విషయమై చక్ తన జీవితంలో మరియు బోధనలో హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చారు. ఆయన డల్లాస్ థియోలాజికల్ సెమినరీలో, ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ వద్ద మరియు స్టోన్బ్రయర్ కమ్యూనిటీ చర్చిలో నాయకత్వంలో పనిచేస్తున్నందున, “వాక్యమును ప్రకటించుము” అనే పాఠశాల నినాదాన్ని సమర్థిస్తూనే ఉన్నారు.