ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ గురించి

మా లక్ష్యం

లేఖనములోని సత్యాలను మరియు యేసుక్రీస్తు అను వ్యక్తిని గూర్చి ఖచ్చితమైన, స్పష్టమైన మరియు ఆచరణాత్మక పద్ధతిలో తెలియపరచడంలోను, తద్వారా ప్రజలు తమ జీవితాల కోసం దేవుని ప్రణాళికను, అలాగే లేమిలోవున్న, ప్రతికూలమైన మరియు నిరాశతో కూడిన ప్రపంచంలో ప్రామాణికమైన క్రైస్తవులుగా తమ ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకోవటానికి ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ ఎంతో ఉత్కృష్టతతో రాణించటానికి కట్టుబడి ఉంది.

మా విజన్

దేవుని వాక్యంలో కనిపించే సత్యాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ కోరుకుంటుంది. మా పరిచర్య ఈ అభిరుచినే విజన్ 195—అని పిలుస్తుంది. ప్రపంచంలోని మొత్తం 195 దేశాలలో ఉన్న వ్యక్తులు చక్ స్విన్డాల్ యొక్క బైబిల్ బోధనను విని, చదివి, అర్థం చేసుకోవాలని మరియు వారి మాతృభాషలో పరిచర్య చేయాలని మా ఆశ. క్రీస్తు ద్వారా మాత్రమే రాగల నిజమైన నిరీక్షణ మరియు ప్రోత్సాహాన్ని అందించే సత్యం కోసం అన్ని వర్గాల మరియు భాషల ప్రజలు తీరని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆ అవసరాన్ని తీర్చడానికి, మా పరిచర్య అనేక దేశాలలో వేదాంతపరంగా శిక్షణ పొందిన పాస్టర్లను కలిగి ఉంది. మా మినిస్ట్రీస్ అమెరికాలోని టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని మా అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో డల్లాస్ థియోలాజికల్ సెమినరీ గ్రాడ్యుయేట్లు మరియు ఇంటర్న్‌లను కలిగి ఉంది. ఈ పాస్టర్‌లు మరియు ఇంటర్న్‌లు మా కంటెంట్‌ను ఖచ్చితమైన, స్పష్టమైన మరియు ఆచరణాత్మక పద్ధతిలో అందించేలా పని చేస్తూ, అన్ని సమయాలలో నిరీక్షణ మరియు నిజ జీవిత అనువర్తనాలను ప్రతిచోటా ప్రజల జీవితాలకు అందిస్తున్నారు. మేము ప్రస్తుతం అరబిక్, ఇంగ్లీషు, మాండరిన్, పోలిష్, పోర్చుగీస్, రొమేనియన్, రష్యన్, స్పానిష్ మరియు తెలుగు భాషలలో పరిచర్య చేస్తున్నాము. మా అంతర్జాతీయ భాషా మినిస్ట్రీస్ 1,000 కి పైగా స్టేషన్లు, భాష-నిర్దిష్ట వెబ్ సైట్లు, అలాగే అనేక ముద్రిత ప్రచురణలను ప్రసారం చేస్తున్నాయి.

మన అంతర్జాతీయ మినిస్ట్రీస్ బలాల్లో ఒకటి ఏమిటంటే, ఈ 195 దేశాలలో మన పాస్టర్లు నివసిస్తున్నారు, పనిచేస్తున్నారు మరియు పరిచర్య చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఉపదేశించడానికి, బోధించడానికి మరియు సువార్త యొక్క నిరీక్షణను అందించడానికి చక్ యొక్క హృదయం స్థానికంగా వ్యక్తీకరించబడుతుంది. ఈ పాస్టర్లు స్థానిక సంఘాలను నడిపించడానికి, యువ పాస్టర్లకు మార్గదర్శకం చేయడానికి మరియు ప్రత్యక్షంగా కాపరి సంరక్షణను అందించడానికి ఈ పరిచర్య అనుమతిస్తుంది. కోమల్ సుభధీర్ వేంపాటి తెలుగు భాషలో భారతదేశానికి ఈ సామర్థ్యంలో పరిచర్య చేస్తున్నాడు. ఇన్సైట్ ఫర్ లివింగ్ యొక్క అంతర్జాతీయ మినిస్ట్రీస్ గురించి మరింత సమాచారం కోసం vision195.com ని సందర్శించండి. మీరు మా అంతర్జాతీయ ప్రసారాలలో ఒకదాన్ని వినాలనుకుంటే, insightworld.org ని సందర్శించండి.