నిర్లక్ష్యముగల వంచకుడు

యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధపర్వతముమీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. (కీర్తన 15:1-2) 1 రాజులు 11:1-6 చదవండి. మార్క్ ట్వైన్ ఇలా అన్నాడు, “ప్రతిఒక్కరూ చంద్రుడిలాగే ఉంటారు ఎందుకంటే ఎవరికీ ఎప్పటికీ చూపించని చీకటి కోణాన్ని అతను కలిగి ఉంటాడు.”1 వంచనతోకూడిన జీవితం మీ ఇంట్లో, లేదా నా ఇంట్లో లేదా ఏ ఇంట్లోనైనా జరగవచ్చు . . . వైట్ హౌస్‌లో […]

Read More

మార్గదర్శకుని యొక్క శాశ్వతమైన విలువ

ఆరుగురి సమూహమైన మేము అక్కడ కూర్చున్నాము. మా బల్ల మధ్యలో ఒక నారింజ రంగు కొవ్వొత్తి వెలుగుతుండగా, మా ముఖాల మీద నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకరు మాట్లాడుతున్నారు; ఐదుగురు వింటున్నారు. ప్రతి ప్రశ్న ఎంతో సౌమ్యతతో, ఎంతో నెమ్మదిగా నిర్వహించబడింది-ప్రతి సమాధానం లోతైన వివేకం నుండి తీయబడింది, కఠినమైన నిర్ణయాల ద్వారా రూపం ఏర్పరచబడింది, కాలముచేత బోధించబడింది. అలాగే బాధ. అలాగే తప్పులు మరియు నిందలు. పరీక్షలు, సంకటములు, హృదయవిదారకము‌లు మరియు వైఫల్యాల ద్వారా మెరుగుపరచబడ్డాయి. అతి […]

Read More

గొప్పతనం యొక్క చీకటి కోణం

“ప్రపంచం చూసిన మనుషుల్లో అత్యంత పరిపూర్ణమైన పాలకుడు అక్కడ ఉన్నాడు . . . [మరియు] ఇప్పుడు అతను వేరే లోకానికి చెందినవాడు.” ఇది ఎవరి గురించి చెప్పబడింది? కైసరుల గురించా? కాదు. నెపోలియన్? కాదు. అలెగ్జాండర్ ది గ్రేట్? కాదు. ఐసెన్‌హోవర్? పాటన్? మాక్‌ఆర్థర్. . . లేదా గ్రాంట్ లేదా లీ లేదా పెర్షింగ్ వంటి మునుపటి సైనిక వ్యూహకర్తా? కాదు, వీళ్లెవరూ కాదు. రాక్నే లేదా లోంబార్డి గురించా? కాదు. లేక లూథర్? […]

Read More

ఆత్మీయ నాయకత్వం

నాయకత్వం ప్రభావితం చేస్తుంది. మనం ఇతరులను ప్రభావితం చేసేంత మేరకు వారిని నడిపిస్తాం. లార్డ్ మోంట్‌గోమెరీ దీనిని సూచిస్తూ ఈ విధంగా వ్రాశాడు . . . నాయకత్వం అనేది పురుషులు మరియు స్త్రీలను ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం సమీకరించే సామర్థ్యం మరియు సంకల్పం అలాగే విశ్వాసాన్ని ప్రేరేపించే స్వభావం కలిగియుండటం. ఈ విధంగా చేసిన చాలా మంది గొప్ప వ్యక్తులను, అనగా సైనిక సిబ్బంది, అథ్లెటిక్ కోచ్‌లు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వర్తకులు లేదా […]

Read More

మీకు వర్తించే ఏడు నాయకత్వపు పాఠాలు

చాలా మంది వ్యక్తులు నాయకుడు అనే పదాన్ని విన్నప్పుడు వారు అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, పాస్టర్లు, ఉపాధ్యాయులు మరియు CEO లను గురించి ఆలోచిస్తారు. కానీ చాలా తక్కువ మంది తమ గురించి ఆలోచిస్తారు. అయితే, ఇది నిజం. నువ్వు ఒక నాయకుడవే. క్రైస్తవునిగా, నువ్వు క్రీస్తు కొరకు ప్రభావశీలునిగా, ప్రభువు కొరకు రాయబారిగా మరియు దేవుని కృపాసువార్త కొరకు మార్పు-ప్రతినిధిగా ఉన్నావు. నిజానికి, నెహెమ్యా గ్రంథంలో మీకు వర్తించే నాయకత్వానికి సంబంధించిన ఏడు సూత్రాలను నేను […]

Read More

మనందరికీ అవసరమైన ఒక వ్యక్తి (మరియు మనం ఆ వ్యక్తిలా ఉండాలి)

“చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, సూచనలను చదవండి.” ఆ చిన్న, ఐదు పదాల హెచ్చరిక ప్రతి ఎలక్ట్రిక్ రైలు సెట్‌మీద, ప్రతి ప్లాస్టిక్ మోడల్‌ మీద, రెండు-టన్నుల ప్యాకేజీలో అమర్చబడిన ప్రతి ఉయ్యాల మీద, ప్రతి హైటెక్ పరికరం మీద-విడదీయబడిన లేదా విద్యుత్ అవసరమయ్యే దేనిమీదనైనా కనిపిస్తుంది. ఇది మీకు వర్తించదని నటించే ప్రయత్నం చేయవద్దు! నాలాగే, మీరు కూడా ప్రమాదకరముకాని కిట్‌ని చూసి, కాసింత ఇంగితజ్ఞానం ఉంటే సరిపోతుందని అనుకొని, సూచనల పుస్తకా‌న్ని పక్కన పడేశారనడంలో నాకు […]

Read More

వినూత్న ప్రణాళిక

ఆదికాండము 47:1-26 చదవండి. యోసేపు దగ్గర ఒక వినూత్న ప్రణాళిక ఉంది, అది ఇంతకుమునుపెన్నడూ అమలు చేయనిది. “భూమి ఫలించాలంటే, మనం ఈ భూమిపై విస్తరించాలి,” అని అతను చెప్పాడు. దీనికి ముందు వారు కొన్ని బాగా జనాభా ఉన్న ప్రాంతాలలో మాత్రమే స్థిరపడ్డారు. ఆ స్థలాలు వారి గృహాలు, వారి పని, వారి పొలాలు మరియు వారి పరిసరాలను సూచించాయి. వాటన్నింటినీ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు కొంత అమ్మవలసి వచ్చింది–చాలామట్టుకు ఒప్పించాల్సి వచ్చింది. కానీ […]

Read More

తప్పిపోయిన పరిశుద్ధులను ఎలా దారిలోనికి తీసుకురావాలి

మీరు ఎప్పుడైనా మునిగిపోతున్న వ్యక్తిని రక్షించారా? అలా అయితే, అదుపు తప్పిన ఆ భయానక క్షణంలో బాధితులు తమను రక్షించువారితో తరచుగా ఎలా పోరాడతారో మీకు తెలుసు. తమ విశ్వాసపు నావ బద్దలైపోయి ఆత్మీయంగా తల్లడిల్లుతున్న వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అదే తరచుగా జరుగుతుంది. ప్రభువు నుండి దూరమయ్యి, చివరకు తనను నిజంగా ప్రేమించిన స్నేహితుడి సహాయంతో తిరిగి దారిలోకి తీసుకురాబడ్డ ఒక యువకుడి కథను రచయిత మరియు ఉపాధ్యాయుడైన హోవార్డ్ హెండ్రిక్స్ చెప్పారు. […]

Read More

సువార్త ప్రకటనకు ఫిలిప్పు యొక్క విధానము

మీకు ఈ అనుభవం ఉంది. మీకు తెలుసు-మీరు సువార్తను ప్రకటించాల్సిన సందర్భం, కానీ, ఏ కారణం చేతనో, మీరు ఆ పని చేయలేదు. మీ నోటనుండి మాట రాకపోవడం, మీ మెదడులోనున్న కంఠత వాక్యములు గుర్తుకు రాకపోవడం, సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోవడం, మరియు ఈ సంభాషణ నుండి బయటపడటానికి ఏమి సాకు చెప్పాలా ఆలోచిస్తూ ఉండటం వంటి ఇబ్బందికరమైన క్షణాలు అవి. మనలో చాలామంది యేసుక్రీస్తు గురించి సాక్ష్యమివ్వడానికి ఇష్టపడని అనేక కారణాలున్నాయి. ఒకటి అజ్ఞాన భావన. […]

Read More

ముంచుకొస్తున్న ముప్పు

పరిచయం యేసు నిజానికి శాంతముగలవాడు మరియు దయగలవాడు అయినప్పటికీ, ఆయన పాపానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడ్డాడు. నిజానికి, మతం యొక్క ముసుగుతోనున్న చెడును ఎదుర్కొన్నప్పుడు, ఆయన భీకర కోపం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇశ్రాయేలు‌లోని మత పెద్దలు తమ ప్రత్యేక స్థానాన్ని ధనము మరియు అధికారాన్ని పొందేందుకు అవకాశంగా మార్చుకున్నందుకు ఆయన తీవ్రంగా మందలించాడు. మరియు సరైనది చేసినందుకు మనం ప్రజాదరణను కోల్పోయి హింసను అనుభవిస్తున్నప్పటికీ, సత్యం కోసం ఎలా నిలబడాలో యేసు యొక్క […]

Read More