నేను పెద్దవుతున్న కొద్దీ, సిద్ధాంతం పట్ల నేను తక్కువ ఉత్సాహం కలిగి ఉన్నాను . . . అయితే నేను వాస్తవికత పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాను. నా కలం నుండి ప్రవహించే అంశాలు మేధస్సును ఉత్తేజపరిచి, తత్వశాస్త్ర సిద్ధాంతముతో జనాలకు మేత ఇచ్చినంత మాత్రాన ఎవరు పట్టించుకుంటారు? ఈ పదాలు చెవులకు గిలిగింతలు పెట్టి, ఎవరూ అడగని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే ఏమంటారు? తగినంత సృజనాత్మకతతో రెచ్చగొట్టే, పొంతనగల, సమస్య-సంబంధిత రచనలు మరియు పాఠకులను చదివేలా చేసే నిజాయితీ నాకు ఆసక్తిని కలిగిస్తుంది . . . అంతేగానీ యింకేమీ కాదు. కాబట్టి ఒక్కోసారి నేను ముఖం చిట్లించి, మెల్లగా చూస్తూ, నిష్పక్షపాతంగా ఒక పేజీని చూస్తూ, కఠినమైన ప్రశ్నలు అడుగుతాను: నేను టచ్‌లో ఉన్నానా? ఇది ప్రస్తావించదగినదేనా? ఏదోయొకటి చేయాలనే ఆశను ఇది తీరుస్తుందా? ఇది ఏమైనా వ్యత్యాసాన్ని తీసుకువస్తుందా?
నేను ఒక “వ్యవహారం” పై ప్రత్యేక రచన రాసిన తర్వాత అలా చేశాను. వాస్తవాలను ఎదుర్కోవాలని, సూటిగా చెప్పాలని మరియు చమత్కారముగా కాకుండా ధైర్యంగా ఉండేందుకు రిస్క్ తీసుకోవడానికి నిర్ణయించుకున్నాను. మరొక ప్రమాదం ఏమంటే అత్యుత్సాహం మరియు కోపం పుట్టించేవారముగా ఉండటం. తప్పనిసరిగా సూటిగా ఉండటం మరియు అనవసరంగా నిర్మొహమాటముగా ఉండటం మధ్య నిగూఢమైన తేడా ఉంది. శరీరము యొక్క పాపములతో ఎన్నడూ రాజీపడని యేసు, యోహాను 8 ప్రకారం, పాపుల గౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి ఒక అద్భుతమైన మార్గం కలిగి ఉన్నాడు. ఆయన మాదిరిగా చూపించిన వాటన్నిటిలాగే ఇది కూడా ఆయన గురించి నేను బాగా ఇష్టపడతాను.
ఏమైనప్పటికీ, వీటన్నింటికీ ఫలితం ఏమిటంటే, నా “వ్యవహారం” ప్రత్యేక రచనకు ప్రతిస్పందనగా నాకు వచ్చిన లేఖ. దీన్ని వ్రాసిన వ్యక్తి నా మాటలు నిజంగా సంధించబడతాయనే మరియు తెలియజెప్పుతాయనే నా ఆశను బలపరిచాడు. ఇక్కడ కొన్ని సారాంశాలు ఉన్నాయి.
నేను ఇలాంటి ఉత్తరాలు చాలా అరుదుగా వ్రాస్తాను! కానీ మీరు వ్రాసిన దాని గురించి నేను చాలా గట్టిగా భావిస్తున్నాను. . . . నేను వివాహంలో నమ్మకద్రోహం చేసిన భాగస్వామిని. ఇది చాలా సంవత్సరాల క్రితం అయినప్పటికీ, ఇది ఇప్పటికీ బాధాకరమైన జ్ఞాపకమే. నేను ప్రభువును తెలుసుకోకముందే ఇది జరిగింది, అయితే ఆయన కృపయే మా వివాహాన్ని బాగుచేసి, నిలబెట్టింది. చాలా కష్టమైన ఈ విషయాలను ప్రస్తావించడం కొనసాగించమని మిమ్మల్ని అభినందించడం మరియు ప్రోత్సహించడం కొరకే నేను దీన్ని వ్రాయడం వెనుక ఉద్దేశ్యం. ఒక అభిప్రాయానికి రావాలి మరియు చాలా మంది ప్రతిఘటన నుండి తప్పించుకుంటారు. . . . మీ నమ్మకాలకు మరియు వాటిపై మాట్లాడే మీ ధైర్యానికి ధన్యవాదాలు.
కనుక ఇది అక్కడ ఉన్న మీలో ఎవరితోనైనా మాట్లాడుచున్నదేమోనను మళ్ళీ అడగడానికి నేను దీన్ని ఇక్కడ చేర్చాను. బహుశా మీరు ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేకపోతున్నారేమో. ఇప్పటికీ అక్రమ సంబంధాన్ని తెంచుకుని, మీ అసలైన నిబద్ధతకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నారేమో. మీకు ధైర్యం ఉందా అని ఆలోచిస్తున్నారా. మీరు చేయగలరా అని ఆలోచిస్తున్నారా. అది అంత విలువైనదేనా అని ఆలోచిస్తున్నారా.
మీరు కూడా అలాగే చేయండి. మీ చెలికాని బాహువుల్లోకి తిరిగి వెళ్ళండి మరియు మళ్లీ దూరంగా నడవకండి.
యేసు చెప్పినట్లు, “నీవు వెళ్లి ఇక పాపము చేయకుము.”
ప్రేమతో నిజం చెప్పడం వలన పాపము విషయమైన అబద్ధాన్ని వెలికి తీయవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ స్వంత జీవితాన్ని పరిశీలించుకోండి.
Taken from Charles R. Swindoll, Day by Day with Charles Swindoll (Nashville: W Publishing Group, 2000), 191. All rights reserved. Used by permission.