1991లో జేమ్స్ ప్యాటర్సన్ మరియు పీటర్ కిమ్ ది డే అమెరికా టోల్డ్ ది ట్రూత్‌ను విడుదల చేశారు, ఇది ఒక విస్తృతమైన అభిప్రాయ సర్వేపై ఆధారపడిన ఒక అధ్యయనం, దానిలో పాల్గొనేవారి సమాచారాన్ని గోప్యంగా ఉంచబడుతుందని హామీ ఇచ్చారు. ఇందులోని వాస్తవం ఆశ్చర్యపర్యాన్ని కలిగించింది! వారి అన్వేషణల యొక్క సంక్షిప్త నమూనాను మీకు ఇస్తాను: కేవలం 13% మంది అమెరికన్లు మాత్రమే పది ఆజ్ఞలన్నీ తిరుగులేనివిగా మరియు అనువర్తింపదగినవిగా చూస్తారు; 91% మంది పని వద్ద మరియు వారి ఇళ్లలో క్రమం తప్పకుండా అబద్ధాలాడతారు; చాలా మంది అమెరికన్ కార్మికులు వారానికి సగటున ఏడు గంటలపాటు—దాదాపు ఒక రోజు మొత్తం—కాలయాపన చేస్తున్నట్లు ఒప్పుకున్నారు; మరియు మన ఉద్యోగస్థుల్లో సగం మంది తాము సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాసరే క్రమం తప్పకుండా అనారోగ్యంతో ఉన్నట్లు ఫోన్ చేసి మరీ చెబుతున్నామని అంగీకరించారు.
సర్వేలో ఒక ప్రత్యేకమైన ప్రశ్న నన్ను నిజంగా ఆకర్షించింది: “మీరు 10 మిలియన్ డాలర్లకు ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నారు?” (మీరు కూర్చున్నారా?) ఇరవై ఐదు శాతం మంది తమ కుటుంబాలను విడిచిపెడతారు; 23% మంది ఒక వారం పాటు వేశ్యగా మారతారు; 7% మంది అపరిచితుడిని హత్య చేస్తారు!
ఇప్పుడు, ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. కొన్నిసార్లు క్రైస్తవులు కొంచెం ఉప్పొంగిపోయినట్లుగా ప్రవర్తించడం చాలా తేలిక–ఇతరులను తక్కువగా ఎంచి నిట్టూర్పు విడిచి పరిసయ్యుల వలె ఇలా అంటారు, “నేను క్రైస్తవుడిని. నేను ఎప్పటికీ అలా చేయను.” అంత తొందరెందుకు, మిత్రమా. మీరు దీన్ని వినాలని అనుకోవడం లేదు, కానీ “మనకి” మరియు “వారికి” మధ్య పెద్ద తేడా ఏమీ లేదు.
ఇద్దరు వేరే రచయితలు, ఇద్దరూ క్రైస్తవులు, వారు స్వంతంగా జనాభా నమూనాలను రూపొందించారు మరియు కఠినమైన సాక్ష్యాల ఆధారంగా వారి స్వంత ఇబ్బందికరమైన వ్యాజ్యమును నిర్మించారు. కీపింగ్ యువర్ ఎథికల్ ఎడ్జ్ షార్ప్, అనే వారి పుస్తకం ప్రకారం, డౌగ్ షెర్మాన్ మరియు విలియం హెండ్రిక్స్ ఈ విధంగా నిశ్చయించుకున్నారు, “క్రైస్తవుల సాధారణ నైతిక ప్రవర్తన క్రైస్తవేతరుల నుండి కొద్దిగా మాత్రమే మారుతూ ఉంటుంది” (కొన్ని గొప్ప మినహాయింపులు ఉంటాయిగా ఎందులోనైనా). తమ ఆదాయపు పన్ను రిటర్నులను గూర్చి తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం, ఉద్యోగ కార్యాలయంలో దొంగిలించడం మరియు కొన్ని చట్టాలకు మాత్రమే లోబడటం వంటి వాటిని దాదాపుగా అవిశ్వాసులు చేసినట్లే విశ్వాసులు కూడా చేస్తున్నారని వారు చెప్పారు.
దాని గురించి ఎటువంటి సందేహం లేదు, క్రైస్తవేతరులు మరియు క్రైస్తవులలో కూడా భ్రష్టత్వం ఇంకా సజీవంగానే ఉన్నది. ఎందుకు? ఎందుకంటే “విశ్వసనీయత లేకపోవడం” అనేది 1990ల కళారూపంగా మారింది.
సవాలు చేస్తారా? దేవుడు మీకు సహాయం చేయులాగున, సత్యాన్ని మాదిరిగా చూపించడం మొదలుపెట్టండి . . . సంపూర్ణ సత్యాన్ని, సత్యాన్ని తప్ప మరొకదాన్ని కాదు. సత్యమును ఆలోచించండి. సత్యమును ఒప్పుకోండి. సత్యాన్ని ఎదుర్కోండి. సత్యాన్ని ప్రేమించండి. సత్యాన్ని అనుసరించండి. సత్యంగా నడుచుకోండి. సత్యమునే మాట్లాడండి. అబ్బా, ఆ చివరిది! ఇదే మొదలుపెట్టడానికి మంచి ప్రదేశం. ఈ రోజు నుండి, ఉద్దేశపూర్వకంగా, బుద్ధిపూర్వకముగా మరియు న్యాయముగా సత్యమునే మాట్లాడండి. సహజసిద్దమైన విశ్వసనీయతను సాధన చేయడం ప్రారంభించండి.
నిజాయితీగా మీ స్వంతంగా ఆత్మ శోధన చేసుకోండి. 10 మిలియన్ డాలర్ల కోసం మీరు ఏమి చేస్తారు?
Excerpted from Day by Day with Charles Swindoll. Copyright © 2000 by Charles R. Swindoll, Inc. (Thomas Nelson Publishers). All rights are reserved worldwide. Used by permission.