స్తబ్ధంగా ఉండే పురుషులు (Passive Men), ఉన్మత్తురాళ్లైన స్త్రీలు (Wild Women) అనే మాట నేను సృష్టించింది కాదు. ఇది మనోరోగ వైద్యుడైన పియర్ మోర్నెల్, MD నుండి వచ్చింది, అతను వ్రాసిన పుస్తకానికి శీర్షిక ఇదే. ఇది 1979లో వ్రాయబడిన మంచి పుస్తకం, కానీ ఇది యిప్పటికీ క్రొత్తగానే ఉందని మీరు అనుకుంటారు. డా. మోర్నెల్‌ను వేధించే సమస్య యిప్పటికీ వ్యాపించి ఉన్నది మరియు సమయోచితమైనది. ఇది క్రైస్తవేతర వివాహా బంధాలలో తరచుగా ఉన్నట్లుగా క్రైస్తవ వివాహా బంధాలలోనూ కనిపిస్తుంది. మరీ యిబ్బంది పెడుతున్నానా?
కొన్ని మాటలలో చెప్పాలంటే, ఇది చురుకైన, జాగరూకత కలిగిన స్త్రీని వివాహం చేసుకున్న స్తబ్ధంగా, అన్యమనస్కుడైన వ్యక్తి యొక్క సమస్య. అతను అసమర్థుడుగా మరియు నిస్తేజంగా ఉండాల్సిన అవసరంలేదు. అతను తన పనిలో గొప్ప విజయవంతుడై ఉండవచ్చు. అలాగే ఆమె తిరుగుబాటు మరియు అతి చురుకైనది కాకపోవచ్చు. ఆమె ఆకర్షణీయంగా, మంచి తల్లిగా, తోటివారిచే గౌరవించబడవచ్చు. భర్త అనేక రకాలుగా ఇలా అని ఉంటాడు, “నేను అలసిపోయాను . . . నన్ను ఒంటరిగా వదిలేయ్.” విసుగు చెంది, భార్య ఇలా ఆలోచిస్తుంది, “నాకు నీ నుండి ఇంకా ఎక్కువ కావాలి . . . నేను పొందలేనిది నాకు ఇవ్వు.” ఆమె అభ్యర్థనలు చేస్తుంది; అతను వాటిని పట్టించుకోడు. ఆమె బిగ్గరగా అరుస్తుంది; అతను మరింత వెనక్కి తగ్గుతాడు. ఆమె ఒత్తిడి చేస్తుంది; అతను కోపముతోకూడిన నిశ్శబ్దంలోకి జారుకుంటాడు. అతను చివరికి వెళ్లిపోతాడు; ఆమె నియంత్రించలేనంతగా “రెచ్చిపోతుంది.” ఈ దృశ్యం వివిధ విషయాలలో ప్రపంచంలోని ప్రతి మూలలో విభిన్న పదాలతో పునరావృతమవుతుంది. ఇలాంటి దాంపత్య గొడవలు లేని పరిసరాలు చాలా అరుదుగా ఉంటాయి.
సమస్య పెరుగుతోందని డాక్టర్ మోర్నెల్ నమ్మాడు. తన దగ్గర మనో రోగానికి చికిత్స తీసుకున్న వారి గురించి ఆలోచిస్తూ, అతను ఇలా వ్రాశాడు:
గత కొన్ని సంవత్సరాలుగా నేను నా ఆఫీసులో ఒకే వైఖరిని కలిగియున్న జంటల సంఖ్య పెరగడం చూశాను. పురుషుడు చురుకుగా, స్పష్టంగా వ్యక్తీకరించువానిగా, శక్తివంతంగా మరియు సాధారణంగా తన పనిలో విజయవంతముగా ఉన్నాడు. కానీ అతను ఇంటి వద్ద చురుకుదనంలేనివానిగా, అస్పష్టంగా, బద్ధకంగా మరియు వెనుకంజ వేయువానిగా ఉంటాడు. అతని భార్యతో అతని సంబంధంలో అతను స్తబ్ధముగా ఉంటాడు. మరియు అతని స్తబ్ధత ఆమెకు పిచ్చెక్కిస్తుంది. . . .
థెరపీలో నేను చూసిన భార్యలలో ఎవరూ నిజానికి పిచ్చిగా లేదా అస్తవ్యస్తంగా లేరు, కానీ చాలా మంది ఖచ్చితంగా కోపంగా, విసుగ్గా మరియు గందరగోళంగా ఉన్నారు. వారు చాలా తెలివైనవారు, ప్రతిభావంతులు. అన్ని వయస్సుల్లోని మహిళలు తమ వైవాహిక జీవితంలో అస్సలు సంతోషంగా లేరు. అందుకే నా ఆఫీస్‌లో నేను వారిని చూస్తున్నాను.
భర్తలు కూడా చాలా తెలివైనవారుగా, అందరూ బాగా ఇష్టపడేవారుగా మరియు కనీస ఆర్థిక స్తోమతగలవారుగా ఉన్నారు. వారు తమ వ్యాపార మరియు వృత్తి జీవితంలో కష్టపడి పనిచేస్తారు. వారు అద్భుతముగా సంపాదిస్తున్నారు. (ఆకాశాన్నంటే మన జీవన ప్రమాణాలను నిర్వహించడానికి వారు దాదాపు మంచిగా సంపాదించేవారుగా ఉండాలి.) కానీ, నేను చెప్పినట్లుగా, వారు పనిలో చురుకుగా ఉన్నప్పటికీ-వారు ఇంట్లో చాలా స్తబ్ధంగా కనిపిస్తారు. వారు తమ భార్యలతో నిజంగా మరియు అలంకారికంగా మగతనము లేనివారుగా ఉన్నారు. మరియు వారు ఇంట్లో వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, టెలివిజన్ మరియు మందు వెనుక నిశ్శబ్దంగా వెనుదిరుగుతారు. లేదా వారు బహుశా ఇంటి వెలుపల వ్యవహారాలు, వారపు రాత్రి అపాయింట్‌మెంట్‌లు మరియు వారాంతపు ఏర్పాట్లకు అంత నిశ్శబ్దంగా వెనుకంజ వేయకపోవచ్చు.1
డాక్టర్ మోర్నెల్ యొక్క పరిశీలన నేటికీ నిజం. సరిగ్గా, ఈ భార్యాభర్తల గొడవకు కారణం ఏమిటి? ఇంకా మంచిగా అడగాలంటే, ఈ ఘర్షణకు కారణాలు ఏమిటి? ఇటువంటి ప్రతిష్ఠంభన వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మరియు అవి చాలా క్లిష్టంగా ఉండవచ్చు, చిక్కులను విప్పడానికి ఒక నిపుణుడు అవసరం. సమగ్ర జాబితాను సమర్పించడం అసాధ్యం, కానీ చాలా ముఖ్యమైన కొన్ని వాస్తవాలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది . . . మరియు వీటిల్లో దేనిలోనూ నేను ఏ ఒక్కరి “పక్షం” తీసుకోవాలనుకోవడంలేదు. దానికంటే నా ప్రాణానికే నేను ఎక్కువ విలువ ఇస్తాను.
మొదటిది, పురుషులు మరియు స్త్రీలు భిన్నంగా ఉంటారు-ఒకేలా ఉండరు. పెళ్లయ్యాక ఈ తేడాలు తగ్గవు మరియు మాయమైపోవు. అవి ఊపందుకుంటాయి! మనందరినీ మానవత్వం యొక్క ఒక పెద్ద భూగోళంలోకి చేర్చడానికి వారు కష్టపడి ప్రయత్నించినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి మనము స్త్రీవాద ఉద్యమం యొక్క అంచున ఉన్న అతివాదులను కలిగి ఉన్నాము. హాస్యాస్పదంగా ఉంది కదూ! వారి శరీరంలోని కణాలు మరియు వారి మెదడులోని భావోద్వేగ కేంద్రాల యొక్క ప్రత్యేకమైన అల్లికను బట్టి మగవారు ఆడవారి నుండి భిన్నంగా మరియు ప్రత్యేకంగా ఉంటారు. ఇది మరచిపోయిన భర్త కష్టాలను కోరుకుంటున్నాడు మరియు అతని భార్య ఎక్కువగా తృణీకరించేదానికి అర్హుడైనాడు . . . మరియు దీనిని విస్మరించే భార్య ఆమెకు నిరాశను మాత్రమే పెంచుతుంది. భాగస్వామి యొక్క దృక్కోణంలో తనను తాను చూసుకోవడానికి (చేయడం చాలా కష్టమైన పని) మరియు ఇతరులకు ఉండే అవసరాలు, విరుద్ధమైన దృక్కోణాలు, వ్యతిరేక లింగంలో అంతర్లీనంగా ఉన్న విశిష్టతలను గ్రహించి, ఘనపరచి గౌరవిస్తే ఇది ఎంతో సహాయపడుతుంది. మీరు అలా చేయడంలో విఫలమైతే మీరు ఊహించని స్థలంలో ఉంటారు-సోఫాలో. మరియు బాధ్యతాయుతమైన మార్పులకు ఇష్టపడకుండా శారీరకంగా తప్పించుకోవాలని అనుకునేవారు, వారు తరచుగా వేరొకరి చేతుల్లోకి వెళ్తారు, ఇది ఏమీ పరిష్కరించదు మరియు సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తుంది.
రెండవది, సామరస్యపూర్వకమైన భాగస్వామ్యాలు కృషి యొక్క ఫలితాలు; అవి ఎన్నడూ “ఊరికే జరగవు.” లోతైన, నిజాయితీగల, క్రమమైన సంబంధం కంటే ఎక్కువగా సహాయపడేది ఏదైనా ఉన్నదేమో నాకు తెలియదు. దయచేసి ఆ నాలుగు పదాలను మళ్లీ చదవండి. మాట్లాడడమే కాదు వినడం కూడా. మరియు వినడం మాత్రమే కాదు, ఆలకించడం కూడా. వినడం మాత్రమే కాదు, ప్రశాంతంగా మరియు దయతో స్పందించడం కూడా. వ్యక్తిగతంగా. పరస్పర గౌరవంతో. ఎక్కువ కాలం పాటు. తీసుకున్నంత ఇవ్వడం, మీరు ఆశించే ప్రతిదాన్ని మాదిరిగా చూపడం, ప్రతిఘటించినంత త్వరగా క్షమించడం, వైవాహిక బంధం నుండి మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా వెచ్ఛించడం వంటివి “కఠినమైన పని” క్రిందకు వస్తాయి. అవును, ఎక్కువ కేటాయించాలి. నేను చాలా అరుదుగా వినే ఒక్క మాటలో (ముఖ్యంగా భర్తల నుండి) చెప్పాలంటే, నిస్వార్థంగా ఉండటం.
అందరూ కలిసి కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లడం కంటే స్తబ్ధత-ఉన్మత్తము సిండ్రోమ్‌ను విచ్ఛిన్నం చేయడానికి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. పిల్లలు లేకుండా. బ్రీఫ్కేస్ లేకుండా. టీవీ లేకుండా. ల్యాప్‌టాప్ లేకుండా. మీకు తెలిసిన వారి దగ్గర ఉండాలనే ఆలోచన లేకుండా. అజెండా లేకుండాI,, మాట్లాడటానికి మరియు ఆలోచించడానికి సమయం కేటాయించండి, అప్పుడు మీరు మరో రెండు మూడు నెలల పాటు . . . బహుశా అంతకంటే తక్కువ కాలం మీరు మీ పనిలో నిమగ్నమై ఉండవచ్చు! మీరు స్తబ్ధత-ఉన్మత్తము జంట లేదా దానికి దగ్గరగా ఉన్నట్లైతే–త్వరగా వెళ్లిపోవడం మంచిది. మరియు మీరు వెనక్కి వెళ్ళినప్పుడు, గుర్తుంచుకోండి. . .
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. (ఎఫెసీయులకు 4:31-32)
ఈ మాటలు కూడా నా సొంతవి కావు. కానీ అవి మిమ్మల్ని వివాహ సలహాదారు ప్రదేశం నుండి దూరంగా ఉంచడంలో లేదా మీ స్వంత సోఫా నుండి దూరంగా ఉంచడంలో ఖచ్చితంగా సహాయపడతాయి.
- Pierre Mornell, Passive Men, Wild Women (New York: Ballantine Books, 1979, 1980, 1981), 1–2.
Copyright © 2010 by Charles R. Swindoll, Inc