ఆత్మ ఫలము

Fruit of the Spirit

మీ వెలుగును ప్రకాశింపనియ్యుడి

మనం నిజంగా మన ఆత్మీయ నడకలో పురోగతి సాధిస్తున్నామో లేదో ఎలా తెలుసుకోవచ్చు? పరిణతి చెందిన విశ్వాసులుగా మనం “విజయం చేరుకున్నామని” నిరూపించడానికి నిర్దేశిత పనులను చేయాలని పరిశుద్ధ గ్రంథము ప్రతిపాదించదు. అయితే, గలతీయులకు 5: 22-23 లో పౌలు అందించిన జాబితా మనకి, మన చుట్టూ ఉన్నవారికి మనలో నివసించే దేవుని ఆత్మ మన ఆలోచనలను మరియు క్రియలను నియంత్రిస్తాడని రుజువుపరుస్తుంది.

మనమెంత చిత్తశుద్ధితో ప్రయత్నించినా సరే అలాంటి ఫలములను మన స్వంతంగా ఫలించలేము. మనము ఈ ఫలమునకు నకిలీ తయారు చేయలేము. ఆత్మ ఫలము పరిశుద్ధాత్మకు లోబడుటవలన కలిగే దైవికమైన ఫలితం. మనము ఆత్మ యొక్క స్వచ్ఛమైన, పవిత్రమైన ఫలాలను కనుపరచటం మొదలుపెట్టినప్పుడు, 19-21 వచనాలలోనున్న పౌలు యొక్క వేరే జాబితాలో చూసినట్లు, ఆత్మతో నిండినవారికి మరియు శరీర క్రియలను పాటించేవారికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా ఉంటుంది! మనము ఆత్మ ఫలమును కనుపరచినప్పుడు, దేవునికే సమస్త మహిమ చెందుతుంది.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి