నేను అప్పుడప్పుడు వాషింగ్టన్, డి.సి. లో ఉన్నతమైన సైనిక అధికారులకు పరిచారకునిగా ఉండే గౌరవాన్ని పొందాను మరియు దాని కారణంగానే నేను మంచి వ్యక్తిగా ఉన్నాను. ఇంకా బాగా చెప్పమంటారా? ఈ నాయకులు బలమైన క్రైస్తవ నిబద్ధతకు నమూనాలు, తరచుగా తమ విశ్వాసాన్ని పణంగా పెట్టుచున్నారు. ఇది వారి ఉన్నతాధికారుల దృష్టిలో జయము కలుగదు, అయినప్పటికీ వారు ధైర్యంగా నిలబడతారు.
ఒకానొక చర్చ సమయంలో, నైతిక స్వచ్ఛత విషయం బయటకు వచ్చింది. ఇది మమ్మల్ని వ్యక్తిత్వం గురించిన ముఖ్యమైన చర్చకు దారి తీసింది. వారి ర్యాంకుల్లో, వ్యక్తిత్వ లక్షణాలలో వైఫల్యం అంత ముఖ్యమైనదా అని నేను అడిగాను. వెంటనే వారు, “తప్పకుండా!” అని ప్రతిస్పందించారు. వ్యక్తిగత చిత్తశుద్ధికి వారి పరస్పర నిబద్ధత నన్ను ఆకట్టుకుంది ఎందుకంటే ఇది ఆకస్మికంగా మరియు నిజాయితీగా వ్యక్తీకరించబడింది. వారు గొప్ప పాస్టర్లు అవుతారని నేను వారికి చెప్పాను.
అకస్మాత్తుగా ఆ గుంపు నిశ్శబ్దమైపోయారు. చివరకు వారిలో ఒకరు నోరు తెరిచారు. చాలా మంది అధికారులు ఒకే సంఘానికి వెళ్లేవారు గనుక ఈ సంభాషణ వారినందరినీ కలవరపెట్టింది . . . “బలమైన, బైబిల్ బోధన, అద్భుతమైన సహవాసం మరియు సమాజంలో ఆరోగ్యకరమైన సాక్ష్యం కలిగిన సంఘము, ఎప్పటివరకంటే . . . ”
నాకు కడుపులో త్రిప్పేసినట్లైంది. నేను ఊహించగలిగినప్పటికీ, అతను తరువాత ఏమి చెప్పబోవుచున్నాడో నేను ఊహించదలచుకోలేదు. అతను కొనసాగించాడు, “. . . మా పాస్టర్ ఒక మహిళతో అక్రమసంబంధం కలిగి ఉండి, వారిద్దరూ తమ సహచరులను మరియు పిల్లలను విడిచిపెట్టే వరకు. వారు ఇప్పుడు కలిసి జీవిస్తున్నారు, మేము పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి ప్రయత్నించుచున్నాము.” కన్నీళ్లు, కలవరపెట్టు చూపులు, మరియు నెమ్మదిగా తలలూచటం వారి విస్మయాన్ని మరియు తీవ్ర నిరాశను వెల్లడించింది. వారి భారం నన్ను చాలా బాధించింది. నేను, కూడా, ఇబ్బందిపడ్డాను.
ఈ సంఘము గ్రేటర్ వాషింగ్టన్, డి.సి., ప్రాంతంలో ముఖ్యమైన సువార్తికుల సాక్షిగా ఉండేది – “ఎప్పటివరకంటే. . . . “ సైనిక అధికారులలో ఉన్నత నైతిక వ్యక్తిత్వం యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనదని, కానీ మతాధికారుల శ్రేణిలో-నా సహచరులలో-అపరిశుద్ధమైన మహమ్మారి ఉధృతంగా మండుచున్నదని ఆలోచించటానికే నేను అవమానంగా భావించాను. ఈ విషయాన్ని క్లిష్టతరం చేయడానికి, కొందరు క్షమాపణ మరియు దయను కోరుతూ పరిచర్యలోనికి మరలా అడుగుపెడతారు.
కృప-ఆధారిత పరిచర్యకు క్షమాపణ కేంద్రంగా ఉన్నప్పటికీ, పరిశుద్ధత మరియు నైతిక స్వచ్ఛతకు నిబద్ధత ఖచ్చితంగా చాలా ముఖ్యమైనది. దీని విషయమై మనం స్పష్టంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. క్షమాపణ చూపకపోవడం ప్రధాన సమస్య కాదు. . . క్షమాపణ అనేది అన్ని హక్కులు మరియు అధికారాలను తిరిగి ఇవ్వడానికి పర్యాయపదం అని చాలా మంది క్రైస్తవుల తప్పుడు ఆలోచనే ప్రధాన సమస్య. పాపం చేసిన నష్టాన్ని అధిగమించడానికి మనము చాలా త్వరపడుచున్నామేమోనని నేను భయపడుచున్నాను. పాపం యొక్క పరిణామాలను క్రమంగా తగ్గించుచూ, మనము క్షమాపణ ప్రక్రియను శీఘ్రతరం చేస్తాము.
భరించలేకపోతున్నారా? అయితే D.C. ప్రాంతంలోని బాధితులైన మందను లేదా డజన్ల కొద్దీ ఇతర సంఘాలలోని మందను, ఎవరైతే ఈ గత నెలలో లేదా ఆ సమయంలో, తోడేలు లాంటి కామానికి లొంగిన మధురమైన గొర్రెల కాపరి వదిలిన దానిని చక్కబెట్టవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్నవారిని అడగండి.
నా మిత్రులారా, ఇది మాయమాటలు చెప్పడానికి సమయంగానీ లేదా అంశంగానీ కాదు. మన విశ్వాసమునందు సద్గుణమును అమర్చుకొనుటకు మన మట్టుకు మనం పూర్ణజాగ్రత్తగలవారమై ఉండాలన్న పేతురు కోరికతో నేను ఏకీభవిస్తాను (2 పేతురు 1:5). మీరు ఎక్కడ సేవ చేసినా, నమ్మకంగా ఉండడం పట్ల శ్రద్ధ వహించండి. సైన్యంలో ఉన్నా, పరిచర్యలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా లేదా ఇంటిలో ఉన్నా, నమ్మకంగా ఉండండి.
Adapted from Charles R. Swindoll, “Whatever Happened to Fidelity?” Insights (August, 2001): 1-2. Copyright © 2001 by Charles R. Swindoll. All rights reserved worldwide.