దేవుడు

God

ఉన్నవాడను గొప్పవానిని వెంబడించుడి

మీ కారును కొన్ని గంటలు ఎరువుగా పుచ్చుకోవచ్చా అని మీకు అస్సలు పరిచయంలేని వ్యక్తి మిమ్మల్ని అడిగితే, యివ్వలేనని మీరు అంటారు. ఒకవేళ సన్నిహితముగానున్న స్నేహితుడు అదే అభ్యర్థన చేస్తే మీరు ఖచ్చితంగా సరేనని అంటారు. మనకు బాగా తెలిసినవారిపై మాత్రమే మనం పూర్తిగా నమ్మకం ఉంచగలుగుతాము. అందుకే విశ్వాసులు దేవుని లక్షణాలను అధ్యయనం చేయటం చాలా ముఖ్యం. ఆయనను తెలుసుకోవడమంటే ఆయనను విశ్వసించడం. ఆయనను తెలుసుకోవడమంటే ఆయనను ఆరాధించడం.

ఆయన యొక్క ఒక్కొక్క లక్షణాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనం చాలా నేర్చుకోగలిగినప్పటికీ, మీరు ఒక పజిల్‌ను ఒకదానితో ఒకటి కలుపుతున్నట్లుగా అవన్నీ సులభంగా కలిసిపోతాయని ఆశించవద్దు. దేవుని ప్రేమ ఆయన ఉగ్రత ప్రక్కన సులభంగా పొసగుతుందా? ఆయన న్యాయం ఆయన కృపతో చక్కగా ఇముడుతుందా? మన ఉన్నతమైన, శక్తివంతమైన దేవుని గురించి మరింత నేర్చుకోవడాన్ని ఎప్పుడూ మానవద్దు; అన్వేషించలేని మరియు అర్థం చేసుకోలేనటువంటి మర్మమైన పదాలకు చోటివ్వండి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి