ఇటీవల, నేను పురాతన యెరూషలేము నగరం గుండా ఒక పర్యటనను నడిపించాను. ఒక రోజు ఉదయాన్నే, నేను దిఙ్మండలము వైపు చూసి 46 వ కీర్తన చదివాను. మీకు మొదటి వచనం కంఠత వచ్చి ఉండవచ్చు:
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు,
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
శతాబ్దాల అంతులేని యుద్ధాల నుండి తన ప్రజలను రక్షించుకుంటూ, నేను సందర్శించడానికి వచ్చిన స్థలంలో దేవుడు తనను తాను ఎలా బలంగా చూపించుకున్నాడో నేను ఆలోచించాను. ఈ సందర్భము కీర్తనకు క్రొత్త అర్థాన్ని ఇచ్చింది.
బహుశా వారు 46 వ కీర్తన రాసినప్పుడు కోరహు వంశస్థులు మరో ఘోరమైన యుద్ధాన్ని భరించారు. దేవుని గొప్పతనాన్ని గుర్తుంచుకోవడానికి, వారు ఆయనను తమ “ఆశ్రయమును దుర్గమును” అని ప్రకటించడం ద్వారా ఆరంభించారు. తమ ప్రశంసల పరాకాష్ఠతో వారు ముగించారు:
సైన్యములకధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు;
యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమైయున్నాడు. (కీర్తన 46:11)
కోరహు వారసులకు ఏది నిజమో అదే మన విషయంలోను నిజం. దేవుడు మన ఆశ్రయము మరియు దుర్గము, మన సహాయం. దేవుడు మన దుర్గము.
విట్టెన్‌బర్గ్ గ్రామంలో ఉన్న అనాచార సన్యాసి మార్టిన్ లూథర్, మూల హెబ్రీను జర్మన్ భాష “ఐన్ ఫెస్టే బర్గ్ ఇస్ట్ అన్సర్ గాట్” లోకి అనువదించి ఆ సత్యాలను గూర్చి ఆలోచించాడు. మన భాషలో, లూథర్ యొక్క అనువాదం ప్రతి విశ్వాసికి తెలిసిన ఒక పాట అయ్యింది, “మాకర్త గట్టి దుర్గము.” ఆ గొప్ప ఇతివృత్తం యొక్క మొదటి వచనం విజయవంతమైన విశ్వాసముతో మారుమోగుతుంది:
మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు
సంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచు.1
నిబద్ధతకు ఎంత ఉద్వేగభరితమైన బాకా పిలుపు! మీరు ఆ పదాలను ఎలా అనువదించినా, అవి రక్తం మరియు యుద్ధ వాసన కొడుచున్నవి. అవి క్రమశిక్షణతో స్రవించుచున్నవి. తుపాకుల సమాచారము మరియు కత్తుల దాడి మీరు దాదాపు వినవచ్చు. ఇది నిజంగా సంస్కరణ యొక్క యుద్ధ గీతము.
లూథర్ 500 సంవత్సరాల క్రితం, పదహారవ శతాబ్దంలో నివసించాడు- అది మూఢ నమ్మకాలు, అనైతికత మరియు ఆత్మీయ దోపిడీ యొక్క చీకటి యుగం. ఇరవై ఒకటవ శతాబ్దంలో ఆ యుద్ధ గీతాన్ని వినిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, మన కాలాలు ఇంకా చాలా చీకటిగా ఉన్నాయి. అవి లూథర్ రోజులో ప్రకాశించినట్లుగా, ఆ శక్తివంతమైన పదాలు ఈ రోజు మన జీవితాల ఆత్మీయ చీకటిలో ప్రకాశిస్తాయి. దేవుడు అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ మనకు అవసరమైన గట్టి దుర్గముగా ఉన్నాడు.
ఆ సత్యాన్ని స్వీకరించడం వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. 46 వ కీర్తన మూడింటిని పేర్కొన్నది:
- ఆయన మన దుర్గము కాబట్టి మనం భయపడము.
- ఆయన మన దుర్గము కాబట్టి, మనం కదిలించము.
- ఆయన మన దుర్గము కాబట్టి, మనం పోరాడము, ఆందోళన చెందము.
దేవుడు మన ఆశ్రయము మరియు దుర్గము కాబట్టి, మన శాంతికి ఏదీ భంగం కలిగించదు. నేను యెషయా వివరించిన శాంతి గురించి మాట్లాడుతున్నాను:
ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో
వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు.
ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు. (యెషయా 26:3)
మాటకు మాట సరిగ్గా భాషాంతరము చేస్తే, ప్రవక్త మాటలు ఇలా వ్రాయవచ్చు, “ఆయన వానిని షాలోమ్, షాలోమ్ లో ఉంచుతాడు.” హెబ్రీ భాషలో, ఈ ద్విగుణము యొక్క నుడికారం, అతిశయోక్తిని వ్యక్తపరుస్తుంది. “షాలోమ్, షాలోమ్” అంటే వెరసి “పూర్ణ శాంతి,” “సంపూర్ణ శాంతి,” “పరిపూర్ణ శాంతి.” అలాంటి శాంతి ఇతరులు దేవుణ్ణి అంగీకరించడం మీద ఆధారపడి ఉండదు – ఇది చాలా మంచి విషయం.
ఈ గత వసంతకాలంలో, ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వన్ స్ట్రేంజ్ రాక్ అనే పది-భాగాల టెలివిజన్ ధారావాహికను ఏర్పాటు చేసింది. దీనిలో మన గ్రహం గురించి, ప్రతిదీ ఎలా ప్రారంభమైయ్యింది మరియు ఇక్కడ జీవితాన్ని సాధ్యం చేసేది ఏమిటనే దానిగురించే ఉన్నది. ఈ కార్యక్రమం మరియు దానితో కూడిన కథనాలు చక్కగా పరిశోధించబడ్డాయి, జాగ్రత్తగా వ్రాయబడ్డాయి మరియు పాండిత్యముగల, అగ్రశ్రేణి శాస్త్రవేత్తలచే అందంగా నిర్మించబడ్డాయి. అయినప్పటికీ మన సృష్టికర్త దేవుడి గురించి ప్రస్తావించే సూచన కూడా లేదు. అస్సలు లేనే లేదు. సృష్టికర్త అధునాతనమైన వాదనకు సరిపోయేవాడు కాదు. ఆయనకొరకు వాళ్ళ దగ్గర చోటు లేదు. కానీ ఆయన ఉనికి మరియు మనం గృహము అని పిలుచుకుచే ఈ అద్భుతమైన శిలని జాగ్రత్తగా ఆకృతికి తీసుకురావడం లేఖనములో స్పష్టంగా బయలుపరచబడింది: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” (ఆదికాండము 1:1).
మన గొప్ప మరియు శక్తివంతమైన దేవుణ్ణి గుర్తించడంలో మన సంస్కృతి విఫలమైందని విలపించే బదులు, మన పైన సింహాసనాసీనుడైన, మనపై పరిపాలన చేసే ఆయన వైపు మన పూర్తి దృష్టిని మరల్చుదాము. ఎందుకంటే ఆయన మాత్రమే మన షాలోమ్I, షాలోమ్. మంచును భూమికి రప్పించువాడును, ఆకాశం నుండి మెరుపును పిలుచువాడును మరియు జీవితాన్ని నిలబెట్టడానికి మన వాతావరణాన్ని పరిపూర్ణ పదార్థములతో కలుపువాడును అయిన భూమ్యాకాశములకు దేవుడు-ఆయన మాత్రమే సృష్టికర్త. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆయన ఉన్నవాడు.
మార్టిన్ లూథర్ యొక్క ఆత్మలో అదే దేవుడు ఉక్కును కుమ్మరించగా తన తొంభై-ఐదు సిద్ధాంతాలను ఆ విట్టెన్‌బర్గ్ సంఘము తలుపు మీద కొట్టాడు. లూథర్ ముందు నడిచిన అదే దేవుడు ఆయన గొప్ప ఆజ్ఞను అనుసరిస్తున్నప్పుడు మన ముందు నడుస్తాడు. ఆయన మాత్రమే మన చీకటి యుగం యొక్క నీడలకు వెలుగును ఇవ్వగలడు. ఆయన మాత్రమే మన భయాలను తొలగించగలడు మరియు మన బాధతో ఆయన శాంతిని కలపగలడు. ఆయన మాత్రమే భూమిని, దాని నివాసులందరినీ మరియు ప్రతి వ్యక్తి కోసం తన ప్రణాళికను యెరుగును.
ఆయన మాత్రమే మన బలమైన దుర్గము.
- Martin Luther, “A Mighty Fortress Is Our God,” (1526). Translated into Telugu by E. Paul.
Copyright © 2018 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.