పేర్లు వింతగా అనిపించినప్పటికీ, ఈ క్రింది పట్టణాల యొక్క దేశాన్ని ఊహించడానికి రోడ్స్ స్కాలర్ అవసరంలేదు:
ఆఫెన్‌బాక్ | వర్జ్‌బర్గ్ |
డార్మ్‌స్టాట్ | బాడ్ కిస్సింగెన్ |
మ్యాన్‌హాయమ్ | అషాఫెన్‌బర్గ్ |
హైడెల్బర్గ్ | ష్వైన్‌ఫర్ట్ |
వార్మ్స్ | బిషాఫ్స్ హాయమ్ |
లుడ్విగ్షాఫెన్ | కోబర్గ్ |
బీర్ స్టెయిన్స్, సౌర్‌క్రాట్, లివర్‌వర్స్ట్ మరియు బ్లాక్ బ్రెడ్ యొక్క భూమి; నిండిన పూల పెట్టెలు; కోకిల గడియారాలు; వెడల్పైన, వంకలు వంకలుగా పోయే నదులు; దట్టమైన ఆకుపచ్చ అడవులు; పలకరాయిు పైకప్పులతో బూడిద-రాతి ఇళ్ళు; కొండప్రాంతాల్లో ఆకట్టుకునే కోటలు; అత్యున్నత కాంస్య స్మారక చిహ్నాలు; నిశ్శబ్ద మరియు సమర్థవంతమైన రైళ్లు; వృద్ధ మహిళలు తలలకు కండువాలు కప్పుకొని కాళ్ళకు ముదురురంగు గల, మందపాటి మేజోళ్ళు తొడుగుకొని చిన్న గ్రామాల్లో కూరగాయల తోటలు పెంచడం; మరియు ఖచ్చితంగా ఎప్పటికీ నిలిచిపోయేలా రచించబడిన గొప్ప సంగీతం. బాచ్, మెండెల్సొహ్న్, హేడ్న్, హాండెల్, బీతొవెన్, వాగ్నెర్ మరియు అరడజను ఇతర మేధావులు మాతృభూమి యొక్క ప్రియులు. వీరి ఉత్తమ రచనలు శతాబ్దాలుగా జీవించి ఉన్నాయి. 1940 లలో ఒక పిచ్చివాడు దీనిని ప్రేమించి, ఆపై అత్యాచారం చేసి, శత్రురాజ్యాల బాంబులతో నాశనం చేయబడిన సుందరమైన మరియు మనోహరమైన దేశం ఇప్పటికీ ఒక మూగ జ్ఞాపకముగా నిలిచి, ఇది ఒక బంజర భూమిగా ఉండిపోయి మరచిపోబడాలని దేవుడు కోరుకోలేదు. సంరక్షించబడాలని ఆయన కోరుకునేది ఏదో అక్కడ ఉండాలి.
ఒరెగాన్ రాష్ట్రం కంటే పెద్దదేమీకాని ఒక భూభాగమైన జర్మనీ, గతకాలము యొక్క దుమ్ముపట్టిన అవశేషమేమీ కాదు. వాస్తవం దీనికి పూర్తి భిన్నముగా ఉంది. ఆధునిక, సమర్థవంతమైన, కంప్యూటరైజ్డ్ మరియు ఐరోపా ఉమ్మడి మార్కెట్లో ఆమె ఎదురులేని నాయకురాలు. ఆమె నగరాలు పురోగతి సాధిస్తున్న వ్యక్తులతో, ఆ పాత పట్టువదలని సంకల్పంతో స్పృశించాయి. ఆమె ఆకాశహర్మ్యాలను ఒకసారి చూస్తే మీకు సెయింట్ లూయిస్ లేదా డల్లాస్, అట్లాంటా లేదా సియాటెల్ ను గుర్తుకు తెస్తాయి. ఆమె వెనుకబడినది కాదు. దివాళా తీయడానికి కొద్దిగా కూడా అవకాశం లేదు. గోడ కూలినందుకు ధన్యవాదాలు, ఆమె మళ్ళీ ఏకీకృతమై స్వాభిమానముతో ఉంది.
ఉన్నతమైన సాంకేతిక ఉనికి యొక్క దృఢ నిశ్చయంగల గృహములో, అక్కడే ప్రొటెస్టాంటిజం యొక్క తల్లివేరుకు సంబంధించిన ప్రధాన విభాగం దాని మూలాన్ని కనుగొందని తరచుగా గుర్తుకు రాదు. అక్కడే విశ్వాసం కోసం పోరాడి చాలా తీవ్రమైన, ఆవశ్యకమైన యుద్ధాలు జరిగాయి. అక్కడే ఆత్మీయంగా చనిపోయిన మతం యొక్క పుల్పిట్లను అలంకరించిన బైబిలును బంధించిన గొలుసు విరిగింది. అక్కడే దాని సత్యాలు అవినీతి మతాధికారుల రహస్య భాష నుండి విముక్తి పొంది సామాన్య ప్రజల చేతుల్లో పెట్టబడ్డాయి. అదే వ్యక్తులకు మొదట ఒక భక్తికీర్తనల పుస్తకము ఇవ్వబడింది, దాని నుండి వారు తమ విశ్వాసాన్ని పాడగలుగుతారు. ఆలోచించండి. . . ఎప్పటికీ వెలుగులోకి తీసుకురాలేని బైబిల్ అజ్ఞానం మరియు బానిసత్వ వ్యవస్థ స్థానంలో, జర్మన్ విశ్వాసులకు వారి భాషలో బైబిల్ అందించబడింది, దాని గొప్ప ఇతివృత్తాలు సంగీత సమకూర్పు చేయబడ్డాయి. పదేపదే వల్లించిన ప్రార్థనలు చేయకుండా, భయంతో మునిగిపోయే బదులు, వారు దేవుని సింహాసనాన్ని విశ్వాసంతో చేరుకోవచ్చు మరియు వ్యక్తిగతంగా ఆయనను తమ కేడెముగాను మరియు తమ విమోచకుడిగాను స్తుతించగలరు. వాటిలో ఉత్తమమైనది: ఐన్ ఫెస్టే బర్గ్ ఇట్ అన్సెర్ గాట్, “మా కర్త గట్టి దుర్గము.” వారి సందేహాలు మాయమవడంతో వారి ధైర్యం పెరిగింది, ఎందుకంటే పదహారవ శతాబ్దపు జర్మన్ సన్యాసి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా తన వైఖరిని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవును, అన్ని అసమానతలకు . . . ఎప్పుడూ సందేహించకండి.
ఎర్ఫర్ట్‌లోని అగస్టీనియన్ కాన్వెంట్‌లోని తన చిన్న, సామాన్యమైన గదిలో, దేవుని వాక్యం యొక్క లాటిన్ కాపీతో ఒంటరిగా, మార్టిన్ లూథర్ దేవుణ్ణి విశ్వసించాలని నిర్ణయించుకున్నాడు. అలాగే పరిణామాలతో సంబంధం లేకుండా, లేఖనం చెప్పేదాన్ని అర్ధం చేసుకోవడానికి, ఆపై దానిమీద గట్టిగా నిలబడటానికి అనుమతించాడు. ఆ చివరి భాగాన్నే మనం తగ్గించడానికి మొగ్గు చూపుతాము. అధికారికంగా ఒక మతవిరోధిగా ముద్రవేయబడటం అతన్ని సంశయమునకు గురిచేయలేదు. బహిరంగంగా నిరాకరించబడటం, మందలించబడటం మరియు బహిష్కరించబడటం అతని అగ్నికి ఆజ్యం పోశాయి. అపరిమిత శక్తితో మరియు అనియంత్రిత కోపంతో, అతను ఒక మానవ పిట్ బుల్ లాగా సంఘములోకి దూసుకొనిపోయాడు మరియు వదిలేయటానికి నిరాకరించాడు. ఆ తొంభై-ఐదు సిద్ధాంతాలను అతను విట్టెన్‌బర్గ్ చర్చి తలుపు మీద కొట్టినప్పటినుండి, వార్మ్స్ యెదుట నిలువబడి తన జీవితకాలంలో ఎన్నడూ పోగవనంతమంది సంఘ మతాచార్యులు మరియు రాజకీయ అధికారుల యొక్క అత్యంత ఆకర్షణీయమైన శ్రేణి ముందుకు వచ్చిన దినము వరకు, ఈ మనిషి ప్రామాణిక ధైర్యం యొక్క మూర్తిగా మిగిలిపోయాడు. ఆ సమయంలో ఆయన వయసు 37 మాత్రమే. తరచూ వ్యూహాత్మకంగా కాకపోయినా, ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో, ఒక వస్త్రములో చుట్టబడిన ఉల్క వలె మతపరమైన తప్పులపై విరుచుకుపడేవాడు. శారీరకంగా బలమైన వ్యక్తి కాదు, అయినప్పటికీ, లూథర్ తన మిగిలిన రోజుల్లో బోధించడం, ప్రచురించడం మరియు వ్రాతలు చల్లటం వంటి శిక్షించే షెడ్యూల్‌ను కొనసాగించాడు. అతను తన కారణాన్ని ఒక్క, క్లుప్తమైన వాక్యంలో సంక్షిప్తీకరించాడు: “ఇక్కడ నేను నిలబడ్డాను: నేను వేరే ఏమీ చేయలేను.” అతని జీవితం, రైన్ కంటే ఎక్కువ మలుపులు మరియు గందరగోళాలతో, స్థిరమైన గమనమును కొనసాగించింది. అతను వెలిగించిన నిప్పు ఉవ్వెత్తున ఎగసిన సంస్కరణ జ్వాలకు కారణమైంది.
అతను నిలబడిన చోట నేను నడిచాను. ఇకపై ఎగతాళి లేదు కానీ స్మారక చిహ్నాలు, ఫలకాలు మరియు పెయింటింగ్స్ ఇప్పుడు అతని ప్రయాణమునకు ఆనవాలుగా ఉన్నాయి. మతవిరోధిగా అవమానించబడటానికి బదులుగా, ఇప్పుడు అతను హీరోగా గౌరవించబడ్డాడు. తప్పు దృక్పథాలను సరిదిద్దడానికి కాలమునకు ప్రతిభ ఉన్నది. అక్కడ నా సందర్శనలో, అతను ఒకప్పుడు కోబర్గ్‌లోని కోట గదిలో కూర్చుని వ్రాసిన ప్రదేశములో నేనూ కూర్చుని ఆలోచించాను. హైడెల్బర్గ్లో అతను ఒకప్పుడు చూసిన అవే నిర్మాణాలను, గోడలను మరియు కొండ ప్రాంతాలను నేనూ చూశాను. వార్మ్స్ వద్ద అతను ఒకప్పుడు కలిగి ఉన్న కొన్ని భావాలను నేను తిరిగి జీవించాను. నేను నా ఆత్మలో కదిలించబడ్డాను, దాని వల్ల నేను మంచి వ్యక్తిని అయ్యాను. అతని సాక్సన్ మాతృభూమికి ఆ సందర్శన నాకు అవసరం. అతను ఒకప్పుడు మాట్లాడినప్పుడు వచ్చిన ఆ కంఠ్యమైన శబ్దాలను వినడం మరియు అతను ఒకప్పుడు తాకిన రాళ్లను తాకడం నాకు అవసరం. స్టెయిన్స్ మరియు సౌర్‌క్రాట్, ఆకాశహర్మ్యాలు మరియు కూరగాయల తోటలు వంటి తాత్కాలిక అంశాలకు మించి నేను చూశాను. చెక్క పనిలో లూథర్ గొంతు విన్నాను, కాంస్య మరియు ఇనుములో అతని అగ్నిని నేను అనుభవించాను. ఇది నా పదబంధాలు వర్ణించగల దానికంటే చాలా శక్తివంతమైనది. పరిశుద్ధ గ్రంథం నుండి “అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు” (హెబ్రీయులకు 11:4) అను వాగ్ధాటిగల పదాలను మళ్ళీ నేను అభినందించునట్లుగా చేసాయి.
కాబట్టి మన దృష్టినుండి వెళ్లిన నీతియొక్క అన్ని నమూనాలు ఇలానే ఉన్నాయి. నిశ్శబ్ద నీడల మాదిరిగా, ఈ వీరులు మన ప్రక్కన ప్రయాణించి, పైకి వెళ్లే మార్గమును మనకు చూపించి, ధైర్యపు మాటలను చెవిలో చెబుతున్నారు. మనము వారి భుజాలపై నిలబడి, వ్యూహాత్మక అనుకూలస్థానమును పొందుకుంటాము. వారి ఉదాహరణ యొక్క జ్ఞాపకము మన ఆత్మలో అవసరమైన ఉక్కును ఉంచుతుంది. ముందుకు, ఎల్లప్పుడూ ముందుకు సాగమని ప్రేరేపిస్తుంది. వారి శక్తివంతమైన ఉనికి మరియు చొచ్చుకుపోయే పేజీల వారసత్వం మన లోతులేని అస్తిత్వానికి లోతును పెంచుతుంది. వారి నమ్మకాలు నిస్సారమైన ఆలోచనను సవాలు చేసే పదాలలో జీవించి ఉంటాయి గనుక, ఇప్పుడున్న స్థితిలోనే ఉండే ధైర్యం మనం చేయకూడదు- మనం చేయకూడదు.
Copyright © 2010 by Charles R. Swindoll, Inc