జాన్ హస్ ఒక అగ్నికణము. మార్టిన్ లూథర్ జ్యోతిని వెలిగించాడు. ఉల్రిచ్ జ్వింగ్లీ మరియు జాన్ కాల్విన్ వంటి పురుషులు ప్రొటెస్టంట్ సంస్కరణ యొక్క జ్వాలలను రాజబెట్టారు, ఈ నెల అది 500 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది! ఇది ఎంత గొప్ప విషయం? సువార్త యొక్క ఈ అద్భుతమైన ఉద్యమం ఐదువందల సంవత్సరాల క్రితం ఐరోపా అంతటా వ్యాపించింది. ఈ మనుష్యులందరూ మీకు తెలియకపోవచ్చు, కాని వారు లేకుండా మన స్వంత భాషలో బైబిల్ చదవడం, కేవలం లేఖనాల మీద ఆధారపడిన ఉపదేశమును వినడం మరియు పాపముచేత తొట్రిల్లిన తరువాత దయ యొక్క మధురమైన సందేశాన్ని స్వీకరించడం వంటి అనేక స్వేచ్ఛలు మీకు తెలియవు.
సంస్కరణకు ముందు, ఆత్మీయ అజ్ఞానం ప్రపంచాన్ని కప్పివేసింది మరియు అవినీతి అనేది స్థిరపడిన సంఘమును అంధకారమయం చేసింది. పుల్పిట్‌కు బంధించబడి, అంతరించిపోయిన లాటిన్ భాషలో వ్రాయబడిన లేఖనాలు ప్రజలకు అందుబాటులో లేవని నిరసన వ్యక్తం చేసి జాన్ విక్లిఫ్ సత్య జ్వాలను వెలిగించాడు.
1382 లో, విక్లిఫ్ లాటిన్ వల్గేట్ లోని లేఖనాలను ఆంగ్లంలోకి అనువదించడం ముగించాడు. ఆక్స్‌ఫర్డ్‌లోని తన పదవినుండి సంఘము విక్లిఫ్‌ను తొలగించిందని, బోధించడాన్ని నిషేధించిందని, మరియు అతని మరణం తరువాత అతని వెలికితీసిన శరీరాన్ని తగలబెట్టిందని జాన్ హస్‌కు తెలిసినప్పటికీ, హస్ సంఘంలో వంచనను బహిర్గతం చేసి, లేఖన సత్యాన్ని ఘనపరచడం ద్వారా విక్లిఫ్ యొక్క జ్వాలను రాజబెట్టడం కొనసాగించాడు. అతను తారు మరియు నూనెలో కప్పబడి నిప్పంటించబడినప్పుడు హస్ మాటలు నిశ్శబ్దం చేయబడ్డాయి. . . కానీ అతని సందేశం ఒక శతాబ్దం తరువాత మార్టిన్ లూథర్ స్వరం ద్వారా మరల జ్వలించింది.
పాపానికి క్షమాపణ పొందగల ఏకైక మార్గం ఏమిటంటే, దానిని ఉచితమైన కృపగా దేవుని నుండి పొందుకోవడమేనని లూథర్ స్వయంగా కనుగొన్నాడు. అతని దినములలోని మతపరమైన వేషధారులు ప్రజలను దోచుకోవడం చూడలేకపోయాడు. కాబట్టి, అక్టోబర్ 31, 1517 న మధ్యాహ్నం, జర్మనీలోని విట్టెన్‌బర్గ్‌లోని గొప్ప సంఘ తలుపుకు పాపపరిహారమనే అంశంపై తన తొంభై-ఐదు సిద్ధాంతాలను మేకులతో కొట్టాడు. ఉల్రిచ్ జ్వింగ్లీ మరియు జాన్ కాల్విన్ వంటి ఇతర ఐరోపా సంస్కర్తలపైన, అలాగే తర్వాత రాబోయే తరాలపైన అతని సాహసోపేతమైన దృఢవిశ్వాసము ఎంత గొప్ప ప్రభావాన్ని చూపుతుందో అతనికి తెలియలేదు.
అటువంటి ఉత్సాహపూరితమైన, విశ్వాస-ఆధారిత నమ్మకాలను అమలు చేయడంలో, సంస్కర్తలు ఐరోపా అంతటా మరియు తరువాత రాబోయే శతాబ్దాల్లో క్రైస్తవ పద్ధతులను మరియు నమ్మకాలను సమూలంగా మార్చివేసే దహించు అగ్నిని ఆరంభించారు.
మన ఆత్మీయ వారసత్వం యొక్క ఈ చిరస్మరణీయ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు, ఈ స్మారక మరియు జీవితాన్ని మార్చే సంస్కరణను తీసుకురావడంలో ఆయనకున్న అపారమైన విశ్వాస్యతకు మనమందరం కలిసి బృందంగా పాడుచూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించుదాం. రాబోయే తరాలన్నింటిలోనికి స్వేచ్ఛా జ్వాలను మోసికొని వెళ్ళులాగున మనం కలిసికట్టుగా ప్రతిజ్ఞ చేద్దాం.
Adapted from Insight for Living 2010 Reformation Tour booklet, Her We Stand, “Why Is the Reformation Important?” p. 23.