ప్రార్థన

prayer

దేవునితో మీ సంభాషణను మరింత వృద్ధిచేసుకోండి

ప్రార్థనచేయటం మీకు కష్టముగా ఉన్నదా? మన పరలోకపు తండ్రి మన ప్రార్థనలకు శక్తితోను, దయతోను స్పందించునని మనకు తెలుసు. కానీ మన ఆత్మ యొక్క లోతైన కోరికలను లోకనాథునికి తెలియజేయడానికి ప్రయత్నించుచుండగా కొన్నిసార్లు మనం అవాక్కైపోతాము.

తన అనుచరులు దేవునితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు యిబ్బందిపడతారని యేసుకు తెలుసు. కాబట్టి, ప్రభువు ప్రార్థనలో, ప్రార్థన ఎలా చేయాలో యేసు మనకు ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఆయన మాటలను ఉన్నవి ఉన్నట్లుగా వల్లించడంకంటే, యేసు మాదిరిగా చెప్పిన ప్రార్థననుండి మనం ప్రార్థన చేయటం నేర్చుకోవచ్చు. ఆయన ప్రార్థనలో ఇవి ఉన్నాయి: ఆరాధన, కృతజ్ఞత, విశ్వాసమును బయలుపరచుట, పాపమును ఒప్పుకొనుట మరియు విజ్ఞాపన. మన హృదయాలు దేవునికి ఏమి చెప్పడానికి యెదురుచూస్తున్నాయో ఆ మాటలు వ్యక్తీకరించటానికి మన ప్రభువు యొక్క ఉదాహరణ మనకు సహాయపడుతుంది.

మీ ప్రార్థన జీవితంలో మీకు అభివృద్ధి కావాలా? అప్పుడు ప్రార్థనను గూర్చిన ఈ వనరులను మీరు ప్రేమిస్తారు. ప్రభువుతో మీ స్వంత సహవాసమును మరింతగా పెంచుకోవడానికి అవి మీకు సహాయం చేస్తాయి. గుర్తుంచుకోండి- సర్వలోకనాథుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మరియు ఆయన చెవి మీ వైపు ఒరిగి ఉన్నది!

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి