నిజానికి యిది చాలా సంవత్సరాల క్రితం జరిగింది.
ఇది 1968 లో న్యూయార్క్ వెళ్లే విమానంలో జరిగింది-ఇది మామూలుగానైతే చాలా బోరుకొట్టే విమానం. కానీ ఈసారి ఇది మరోలా రుజువైంది.
వారు క్రిందకు వచ్చే క్రమంలో, ల్యాండింగ్ గేర్ సరిగా పనిచేయటంలేదని పైలట్ గ్రహించాడు. అతడు నియంత్రణలతో కుస్తీ పడ్డాడు, గేర్‌ను లాక్ చేయడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు . . . కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడు అతడు గ్రౌండ్ కంట్రోల్‌ని సూచనల కోసం అడిగాడు. విమానం ల్యాండింగ్ ఫీల్డ్‌ని చక్కర్లు కొడుతుండగా, అత్యవసర సిబ్బంది రన్‌వేపై నురుగు పూత పూశారు మరియు అగ్నిమాపక ట్రక్కులు మరియు ఇతర అత్యవసర వాహనాలు వాటివాటి స్థానంలోకి వచ్చేశాయి.
ఇంతలో, ప్రయాణీకులకు ప్రశాంతమైన, భావోద్వేగరహిత వాయిస్‌తో పైలట్లు చాలా బాగా చెప్పే కదలికలను గురించి చెప్పబడింది. ఫ్లైట్ సిబ్బంది చాలా నెమ్మదిగా క్యాబిన్‌లో తిరుగుచున్నారు. ప్రయాణీకులు మోకాళ్ల మధ్య తమ తలలను పెట్టుకుని, విమానం నేలను తాకే సమయంలో చీలమండలను దగ్గరకు లాగిపట్టుకోవాలని చెప్పారు. కన్నీళ్లు మరియు కొన్ని నిరాశతో కూడిన ఏడుపులు సంభవించాయి. “ఇది నాకు జరుగుతోందంటే నేను నమ్మలేకపోతున్నాను” అనే అనుభవాలలో ఇది ఒకటి.
ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల దూరంలో ఉండగా, పైలట్ అకస్మాత్తుగా ఇంటర్‌కామ్ ద్వారా ఇలా ప్రకటించాడు: “మనము మన చివరి అవరోహణను ప్రారంభిస్తున్నాము. ఈ సమయంలో, జెనీవాలో స్థాపించబడిన అంతర్జాతీయ విమానయాన కోడ్‌ల ప్రకారం, మీరు దేవుని విశ్వసిస్తే మీరు ప్రార్థనను ప్రారంభించాలని మీకు తెలియజేయడం నా బాధ్యత.” నన్ను నమ్మండి నిజం చెబుతున్నాను . . . అతడు సరిగ్గా ఇదే చెప్పాడు!
క్రాష్ ల్యాండింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిందని నివేదించడానికి నేను సంతోషంగా ఉన్నాను. ఎవరూ గాయపడలేదు మరియు విమానానికి జరిగిన కొంత నష్టాన్ని ప్రక్కన పెడితే, విమానయాన సంస్థ ఈ సంఘటనను అసలు గుర్తుంచుకోలేదు. వాస్తవానికి, ప్రయాణీకులలో ఒకరి బంధువు మరుసటి రోజు ఎయిర్‌లైన్‌కు ఫోన్ చేసి, పైలట్ చెప్పిన ప్రార్థన నియమం గురించి అడిగారు. సమాధానం బాగుంది, సంచితముగా ఉన్నది “నో కామెంట్.”
అద్భుతం. లోతైన “రహస్య నియమాన్ని” బహిరంగంగా తెచ్చినది మాత్రం సంక్షోభమే. అంచులమట్టుకు త్రోయబడి, కష్టలలో ఉన్నప్పుడు, ఆఖరి క్షణాల్లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు, తప్పించుకోవడానికి అన్ని మార్గాలు మూసివేయబడినప్పుడు . . . అప్పుడు మాత్రమే మన సమాజం దేవుడు అక్కడ ఉండవచ్చని గుర్తిస్తారు అలాగే -“మీరు విశ్వసిస్తే . . . మీరు ప్రార్థన మొదలుపెట్టాలి.”
సెయింట్ హెలెన్స్ పర్వతం విస్ఫోటనం అయిన కొద్దిసేపటి తర్వాత టీవీలో నేను విన్న ఒక డైలాగ్ నాకు గుర్తుకొస్తుంది. ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తి ఒక రిపోర్టర్, అతడు అగ్నిపర్వతం నుండి “సజీవంగా తిరిగి వచ్చాడు” తన స్వంత వ్యక్తిగత పీడకల యొక్క చిత్రాలతో మరియు సౌండ్ ట్రాక్‌తో వచ్చాడు. అది బద్దలైనప్పుడు అతడు ఆ పర్వతము యొక్క కొన దగ్గరనే ఉన్నాడు, మరియు అతడు నిజంగా ప్రాణాల కోసం పరుగెత్తాడు . . . కెమెరా రోల్ అవుతూనే ఉంది మరియు మైక్ ఆన్‌లో ఉంది. ఫొటోలు అస్పష్టంగా మరియు చీకటిగా ఉన్నాయి, కానీ అతని స్వరం మాత్రం వేరే రకంగా ఉంది.
అది వింతగా భయానకంగా ఉంది, బహిర్గతం చేయడానికి వీలులేకుండా ఉన్నది. అతడు లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు, ఏడ్చాడు, ఊపిరి సలపలేకపోయాడు మరియు దేవునితో నేరుగా మాట్లాడాడు. సంప్రదాయం లేదు, సామెతలు లేవు-సంక్షోభంలో ఉన్న జీవి యొక్క నిరాశపరిచే కేకలు మాత్రమే వినబడుచున్నవి.
“ఓహ్, దేవుడా, ఓహ్, నా దేవుడా . . . సహాయం చెయ్యి! సహాయం చెయ్యి!” వంటివి వినబడ్డాయి. మరింత ఉక్కిరిబిక్కిరి అయిపోవడం, వేగంగా శ్వాస తీసుకోవడం, ఉమ్మివేయడం, గగ్గోలు పెట్టడం, దగ్గడం, మూలగటం. “ఇక్కడ చాలా వేడిగా ఉంది, చాలా చీకటిగా ఉంది. . . దేవుడా కాపాడు! దయచేసి, దయచేసి, దయచేసి, దయచేసి . . . . ”
ఆత్మ యొక్క దాగి ఉన్న సత్యాన్ని బహిర్గతం చేయడానికి సంక్షోభం వంటిది మరేదీ లేదు. ఏ ఆత్మకైనా సరే.
మనము దానిని మరుగుపరచవచ్చు, విస్మరించవచ్చు, ఆడంబరం మరియు మేధో నిరాకరణతో దాన్ని దాటవేయవచ్చు . . . కానీ సుఖాన్ని కలిగించేదాన్ని తీసివేయండి, భద్రతా కవచాన్ని తీసివేయండి, భయాందోళనలకు గురయ్యే క్షణంలో మనుష్యులెవ్వరూ లేకుండా మరణం యొక్క ముప్పును ఎదుర్కొన్నప్పుడు, ఖచ్చితంగా మానవత్వం యొక్క శ్రేణులలో “ప్రార్థన ప్రారంభమవుతుంది.”
సంక్షోభం నలగగొట్టుతుంది. అలాగే నలగగొట్టబడటం ద్వారా, అది మెరుగుపరుస్తుంది మరియు శుద్ధి చేస్తుంది. దీనికి విరుద్ధమైనది నమ్మాలని నేను చనిపోతున్న చాలా మంది ప్రక్కన నిలబడ్డాను, విపత్తు బాధితులకు చాలా మందికి సేవ చేశాను, విరిగిపోయిన మరియు దెబ్బతిన్న చాలా మంది బాధలను విన్నాను.
దురదృష్టవశాత్తు, కఠినమైన హృదయాలను మృదువుగా మరియు చొచ్చుకుపోవడానికి వీలుగా చేయడానికి సాధారణంగా అలాంటి క్రూరమైన బాధలు సంభవిస్తాయి.
అలెగ్జాండర్ సోల్జెనిట్జిన్ యొక్క ఒప్పుకోలు గుర్తుందా?
“నేను జైలులో కుళ్ళిపోయిన గడ్డిపై పడుకున్నప్పుడు మాత్రమే నాలో మంచితనం మొదచిసారి ప్రేరేపించబడినట్లు నేను గ్రహించాను . . . . కాబట్టి నా జీవితంలో ఉన్నందుకు, నీవు ఆశీర్వదించబడినదానవు, జైలూ.”
ఆ మాటలు కీర్తనకారుడి సూచనల యొక్క ఖచ్చితమైన దృష్టాంతాన్ని అందిస్తాయి:
శ్రమకలుగకమునుపు నేను త్రోవ విడిచితిని
ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను . . . .
నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు
శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.
(కీర్తన 119:67, 71)
సంక్షోభం నలగగొట్టిన తర్వాత, దేవుడు ఓదార్చడానికి మరియు బోధించడానికి అడుగుపెడతాడు.
ఇది నిజంగా ప్రతిరోజూ మన ప్రపంచంలో ఎక్కడో ఒకచోట జరుగుతుంది.
Taken from Charles R. Swindoll, “Commence Prayer,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 550-52.