క్రైస్తవ జీవనము

Christian Living

మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనుడి

ఖచ్చితంగా క్రైస్తవ జీవితం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, కాదా? మన స్వార్థాన్ని విడిచిపెట్టి, యేసుక్రీస్తుకు మనల్ని మనం సమర్పించుకొని యితరులకు పరిచర్య చేయాలని దేవుడు మనలను ఆజ్ఞాపించుచున్నాడు. ఈ ప్రయాణానికి స్పష్టమైన ఆరంభం మరియు మరింత స్పష్టమైన ముగింపు ఉంది, కానీ దాని మార్గం ప్రమాదకరమైన అవరోధాలు మరియు అపాయకరమైన వంపులతో నిండి ఉంది. సంతోషించదగ్గ విషయమేమంటే, దాని గమ్యం నిత్యమైన, శాశ్వతమైన బహుమానములను అందిస్తుంది.

ప్రయాణంలో దారి తప్పిపోయే క్లిష్ట పరిస్థితులను మీరు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. మనమందరం తప్పిపోవుటకు, నిజమైన క్రైస్తవ జీవనము యొక్క మూలాల నుండి వైదొలగి మనం కోరుకునే తక్షణ నెరవేర్పుల వైపు వెళ్ళుటకు శోధింపబడుచున్నాము. అయితే దేవుడు మనలను లేఖనాలను అధ్యయనం చేయడానికి, ప్రార్థనకు, మరియు చాలా ముఖ్యమైనది, క్రీస్తును తెలుసుకోవటానికి సమర్పించుకున్న జీవితానికి పిలుస్తున్నాడు.

మన పరలోకపు గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యం కాదుగాని, మనము అక్కడికి వెళుతున్నప్పుడు యేసుతో సన్నిహితంగా నడవాలని ఈ వ్యాసాలు, ఆడియో ఉపదేశములు మరియు వనరులు మీకు గుర్తు చేయనివ్వండి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి