పూర్వకాలపు ప్రవక్తయైన హబక్కూకు తన ప్రవచనంలోని మొదటి అధ్యాయంలో దీనిని వ్రాసినప్పుడు యుక్తమైన సత్య వాక్యములను వ్రాసాడు:
ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి,
జగడమును కలహమును రేగుచున్నవి.
అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను,
న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను,
భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు,
న్యాయము చెడిపోవుచున్నది. (హబక్కూకు 1:3-4)
ఈ మాటలను వ్రాసినవాడు శతాబ్దాల క్రితం చనిపోయాడు, కానీ ఓహ్, అతని మాటలు ఎలా సజీవంగా ఉన్నాయో చూడండి! మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదాని గురించి మీకు కాస్త అవగాహన ఉంటే, అతని మాటలు నిజంగా ప్రస్తుత కాలానికి కూడా ఎంతగా పనికొస్తాయో మీకు తెలుస్తుంది.
చట్టాలు ఏ విధంగా వక్రీకరించబడి మార్చబడుచున్నాయో చూచి మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? న్యాయం ఇంత వికృతంగా తయారవ్వటం గత దశాబ్దంలో మీరు ఎప్పుడైనా చూశారా?
నేరస్థుడు ఇప్పుడు హీరో అయ్యాడు, పాపం తప్పుగా అర్థం చేసుకోబడుచున్నాడు మరియు దుర్వినియోగపరచబడుచున్నాడు. బాధితుడు స్వార్థపూరితమైన శాడిస్ట్, అందుకే మూర్ఖపు పట్టుదల గలవానిగా, దుడుకైనవానిగా లేదా కలవరపడ్డవానిగా ఉన్నందున అతను ఆరోపణలు చేయాలని నిర్ణయించుకుంటాడు. చమత్కారమైన, కఠినమైన వాస్తవాలు వివేక రాజకీయ పావుల భాషా ప్రావీణ్యముతో సరళంగాను మరియు పక్షపాతముగాను చేయబడ్డాయి. న్యాయస్థానం ఇప్పుడు లా అండ్ ఆర్డర్ యొక్క గౌరవప్రదమైన ఛాంబర్ కాకుండా, నటించే పాత్రల కోసం పోటీపడే నటుల వేదికను పోలి ఉంది. న్యాయమనే ప్రెషర్ కుక్కర్‌లో తగిన సమయం ఇచ్చినట్లైతే న్యాయవాదులను మరియు న్యాయ సహాయకబృందాలను కొనుగోలు చేయవచ్చు, లంచం ఇవ్వవచ్చు, ఆడించవచ్చు లేదా ఆకర్షించవచ్చు. న్యాయముగా మరియు నిష్పాక్షికతతో అనామకంగా మరియు ఎవరికీ కనబడకుండా ఉండాల్సిన జ్యూరీ సభ్యులు ఇప్పుడు టాక్ షోలలో కనిపిస్తున్నారు.
లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అనే ప్రియమైన చిన్ననాటి కథ గుర్తుందా? సరే, ఆ దృశ్యం ఈరోజు జరిగితే, బహుశా ఈ క్రింది విధంగా జరుగుతుంది.
అప్పటికే ఆమె అమ్మమ్మను తిని, ఆపై లిటిల్ రెడ్‌ను చంపడానికి ప్రయత్నించిన తోడేలును కట్టెలు నరుకు వీరుడు చంపడం ద్వారా లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్‌ను రక్షించిన తరువాత, న్యాయ విచారణ జరుగుతుంది. ఈ సమయంలో, కొన్ని “వాస్తవాలు” బయటపడతాయి. మొదటిగా, తోడేలుకు, తన మరణశిక్షకు ముందు, తన హక్కుల గురించి సలహా ఇవ్వబడలేదు. అప్పుడు, ఒక పౌర హక్కుల సంస్థ చిత్రంలోకి ప్రవేశిస్తుంది, “వృద్ధురాలిని చంపి తినడం చెడు అభిరుచిని కలిగి ఉన్నప్పటికీ,” నిజానికి ఆకలితో మరియు అవసరతలో ఉన్న తోడేలు కేవలం “తన పని తాను చేసాడు” గనుక అతను మరణానికి యోగ్యుడు కాదు.
దీని ఆధారంగా న్యాయవాది తోడేలుపై ఆరోపణలకు చెల్లుబాటు అయ్యే చట్టపరమైన ఆధారం లేదని నిర్ణయిస్తారు; అందువలన, చెక్కలు కొట్టేవాడు ఒక ఘోరమైన ఆయుధంతో తీవ్రమైన దాడికి పాల్పడి అపరాధి అయ్యాడు. అప్పుడు అతను అరెస్టు చేయబడతాడు, విచారించబడతాడు, దోషిగా నిర్ధారించబడతాడు, మరియు 99 సంవత్సరాల శిక్ష విధించబడుతుంది.
అమ్మమ్మ ఇంటివద్ద సంఘటన జరిగిన తర్వాత సరిగ్గా సంవత్సరానికి, ఆమె కుటీరం రక్తం చిందించి మరణించిన తోడేలు కోసం పుణ్యక్షేత్రంగా అంకితం చేయబడుతుంది. ధైర్యవంతుడైన, అమరవీరుడైన తోడేలు జ్ఞాపకార్థం దండలు అక్కడ ఉంచబడతాయి-లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కూడా దండ వేస్తుంది, చెక్కలు కొట్టేవాని జోక్యానికి ఆమె కృతజ్ఞతతో ఉన్నప్పటికీ, పునరాలోచించగా అతను అతిగా స్పందించినట్లు ఆమె గ్రహించిందని వివరించింది. అడవి మొత్తంలో కన్నీటితో చెమ్మగిల్లని కన్ను ఒక్కటి కూడా ఉండదు.
ఇది చాలా విషాదకరమైన మరియు నిజమైన చిత్రం కాకపోతే, అది వినోదభరితంగా ఉంటుంది. కానీ స్పష్టంగా చెబుతున్నా, నేను నవ్వడం లేదు. అన్యాయం ఎప్పటికీ వినోదభరితం కాదు.