అనుసరిస్తున్నామా లేదా రూపాంతరము పొందుచున్నామా

రోమా 12:1 భౌతికపరమైన, మన శరీరాలతో వ్యవహరిస్తుంది. రోమా 12:2 మన తత్వ విచార సంబంధమైన, మన మనస్సులతో వ్యవహరిస్తుంది.

యూదులు తమ దృష్టినంతటినీ ఒక వ్యక్తి యొక్క నైతిక, బహిరంగ ప్రవర్తనపై కేంద్రీకరించారు, అనేక రకాలుగా చూస్తే యిది మంచిదే. అయితే, యేసు కేవలం బాహ్య, శారీరక విధేయతతో సంతృప్తి చెందలేదు. ఆయన తన అనుచరులకు మొదట పరిశుభ్రమైన హృదయాలను కలిగి ఉండాలని, తరువాత శుభ్రమైన చేతులు కలిగి ఉండాలని పిలుపునిచ్చాడు (మత్తయి 15:17-20; మార్కు 7:14-15). పాపం మరియు నీతి రెండూ మనస్సులో మొదలవుతాయి, అంటే రెండు ప్రత్యామ్నాయాల మధ్య మనకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మనం “ఈ లోక మర్యాదను అనుసరించవచ్చు” లేదా మనం “[మన]మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందవచ్చు” (రోమా 12:2).

“అనుసరించు” అనే పదానికి గ్రీకు పదం సుస్కెమాటిజో మరియు దీని అర్థం “ఒక నమూనా ప్రకారం మలచడం.” ఆంగ్లములో ఇది విభక్తిప్రత్యయము with మరియు మన ఆంగ్ల పదమైన schematic అనే పదం యొక్క సమ్మేళనం.

“రూపాంతరం,” అని అర్థమిచ్చు మెటామార్ఫావో, అంటే “ఒక దాని నుండి మరొకదానికి పూర్ణ పరివర్తనం చెందటం” అని అర్థం. ఈ గ్రీకు పదం మెటామార్ఫోసిస్ అనే ఆంగ్ల పదాన్ని అందించడానికి లిప్యంతరీకరణ చేయబడింది, ఇది సాధారణంగా గొంగళి పురుగు సీతాకోకచిలుకగా రూపాంతరం చెందడాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు.

మన ప్రపంచం మంచిగా సృష్టించబడింది, కాని అప్పటి నుండి అది మానవ పాపంతో భ్రష్టమైపోయింది. దేవుని విశేషగుణమును ప్రతిబింబించేలా క్రీస్తు తిరిగి వచ్చి ప్రపంచాన్ని పునర్నిర్మించే రోజు కోసం మనం ఎదురుచూస్తున్నాము. అప్పటి వరకు, పాడైన ప్రపంచం నుండి వచ్చిన ఆలోచనా విధానాన్ని మనం తిరస్కరించాలి మరియు పడిపోయిన ప్రపంచ వ్యవస్థకు అనుగుణంగా జీవిస్తున్నవారికి భిన్నంగా కనిపించే మారిన జీవితాలను గడపాలి.

Adapted from Charles R. Swindoll, Swindoll’s New Testament Insights: Insights on Romans (Grand Rapids: Zondervan, 2010), 247–48.

Posted in Christian Living-Telugu, Failure-Telugu, Sin-Telugu.

Insight for Living Ministries is committed to excellence in communicating the truths of Scripture and the person of Jesus Christ in an accurate, clear, and practical manner so that people will come to an understanding of God’s plan for their lives, as well as their significant role as authentic Christians in a needy, hostile, and desperate world.

లేఖనములోని సత్యాలను మరియు యేసుక్రీస్తు అను వ్యక్తిని గూర్చి ఖచ్చితమైన, స్పష్టమైన మరియు ఆచరణాత్మక పద్ధతిలో తెలియపరచడంలోను, తద్వారా ప్రజలు తమ జీవితాల కోసం దేవుని ప్రణాళికను, అలాగే లేమిలోవున్న, ప్రతికూలమైన మరియు నిరాశతో కూడిన ప్రపంచంలో ప్రామాణికమైన క్రైస్తవులుగా తమ ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకోవటానికి ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ ఎంతో ఉత్కృష్టతతో రాణించటానికి కట్టుబడి ఉంది.