ఈ రోజు మీరు ఏ యుద్ధాలు చేస్తున్నారు? మనం వార్తల్లో చదివి వినే వాటి గురించి నేను ప్రస్తావించటం లేదు. అంటే నా ఉద్దేశం మీలో రేగుచున్న యుద్ధాల మాటలాడుచున్నాను-ఈ రోజు మీరు దేనితో పోరాడుతున్నారు? నేను పోరాడేవి కొన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి: కోపాన్ని ఉంచుకోవటం, నిరాశ నన్ను ముంచెత్తడానికి అనుమతించడం, ఏదోయొకటి తేలికైనదాన్ని కోరుకోవడం, శోధనలు ఎందుకు కొనసాగుతున్నాయో అని ఆశ్చర్యపోవటం మరియు నా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవటం.
బాధాకరమైన లేదా అణచివేసే పరిస్థితులు మన అంతర్గత యుద్ధాలను త్వరగా బయలుపరుస్తాయి. ఈ పోరాటాలు సాధారణంగా మంచీ చెడు, తప్పొప్పుల మధ్య కాదు, కానీ మన కోరికలు మరియు దేవుని చిత్తం మధ్య ఉంటాయి. అంగీకరించడానికి ఎంత కష్టమైనప్పటికీ, లోలోపల చెలరేగే యుద్ధాలు తరచుగా మన మొండితనము వల్లనే జరుగుతాయి. దేవుడు మన కోసం అనుమతించినవి తరచూ మన హృదయం యొక్క కోరికతో విభేదిస్తాయి.
కాబట్టి, నన్ను మళ్ళీ మిమ్మల్ని అడగనివ్వండి: ఈ రోజు మీరు ఏ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు? మీరు మరొకరి విశాలమైన షెడ్యూల్ గురించి అసూయపడుతున్నారా, ఒకరి ఆర్థిక విజయానికి అసూయపడుతున్నారా లేదా తప్పుగా అర్ధం చేసుకోబడి, తీర్పు తీర్చబడ్డారని భయపడుచున్నారా? మీరు ఎటువంటి సంఘర్షణను ఎదుర్కొన్నప్పటికీ, మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, క్రీస్తు సార్వభౌముడని మరియు మంచివాడని మరియు నమ్మదగినవాడని విశ్వసించండి. మీ ఇష్టాన్ని వదులుకోవాలనేదే దీని అర్థం గనుక ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. కానీ ఇది విశ్వాసం యొక్క కోరిక ఎందుకంటే అది ఇలా చెబుతున్నది: “దుఃఖం మిగిలి ఉన్నప్పటికీ, నా జీవితం కోసం దేవుని ప్రణాళిక పరిపూర్ణమైనది మరియు సరైనదని నేను నమ్ముతున్నాను.”
చిత్తం యొక్క తన స్వంత బాధాకరమైన యుద్ధంతో యోబు నిజాయితీగా ఉన్నాడు. ఆలకించండి మరియు మీరు అతని జీవితంలో చెలరేగుచున్న యుద్ధాన్ని వినవచ్చు,
నేటివరకు నేను మొరలిడుచు తిరుగుబాటుచేయుచున్నాను
నా వ్యాధి నా మూలుగుకంటె భారముగా నున్నది
ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా
ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.
ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను
వాదములతో నా నోరు నింపుకొనెదను.
యోబు 23:2–4
యోబు యొక్క బాధ చాలా భయంకరంగా ఉంది; సామాన్య మానవుని వలెనే అతని చూపు ఉన్నది. యోబు ఈ యుద్ధంలో ఎంతకాలం పోరాడాల్సి వచ్చిందో నాకు తెలియదు, కాని ఈ వచనాలకు మరియు 10 వ వచనంలో ఉన్న వాటికి మధ్య, యోబు సమాధానమును కనుగొన్నాడు: “నేను నడచుమార్గము ఆయనకు తెలియును; / ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును” (23:10).
మీరు సమాధానమును కనుగొని “సువరణమువలె కనబడాలనుకుంటున్నారా?” అలా అయితే, మీ యుద్ధాలు చెలరేగినప్పుడు, ఈ ప్రోత్సాహకాలను హృదయపూర్వకంగా తీసుకోండి:
- మీ యుద్ధానికి నిజంగా పేరు పెట్టడం ద్వారా మీ ఆత్మను పరిశీలించుకోండి
- మీ యుద్ధాలను నిరంతరం దేవునికి తెలియజేయండి
- మీ జీవితానికి దేవుని నమ్మకమైన మరియు సార్వభౌమ చిత్తానికి మీ చిత్తాన్ని అప్పగించండి
నేను నా ఆత్మను పరిశీలించుకొని, నా చిరాకులను మరియు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, జీవితమంతా ఆయన యొక్క ఆదేశాన్ని అంగీకరించునట్లుగా దేవుడు తన సమాధానముతో మరియు తన శక్తితో నన్ను నింపాడు.
Copyright © 2014 by Insight for Living. All rights reserved worldwide.