ది రోడ్ లెస్ ట్రావెల్డ్ అనే తన పుస్తకాన్ని యమ్. స్కాట్ పెక్ ఈ సత్యంతో ప్రారంభించాడు: “జీవితం కష్టమైనది.”1 ఈ వాస్తవికతను రాయడం లేదా చదవడం ఒక ఎత్తైతే; దానిని అంగీకరించడం మరొక ఎత్తు. మీ పరిస్థితులను మార్చడం మీ కోరికలలో ఒకటి కాదని తెలుసుకొని మీరు ఈ రోజు జీవిత పోరాటాలతో కుస్తీ పడుచున్నారా? మీరు ఒంటరిగా లేరు; జీవితం ఊహించినట్లుగా కాకుండా అది ఎలా ఉందో అలా అంగీకరించడం కష్టం. అందుకే కొంతమంది తక్కువ ప్రయాణించిన దారిని ఎన్నుకున్నారు-జీవితం కళ్ళ యెదుట కనబడుచున్నప్పుడు, సమస్యలనుండి పారిపోకుండా, అది ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్లినా సరే నడవటానికి సిద్ధంగా ఉన్న ప్రదేశమే ఈ తక్కువగా ప్రయాణించే దారి.
మిస్టర్ టోడ్ యొక్క వైల్డ్ రైడ్ అని పిలువబడే ఒక రైడ్ డిస్నీల్యాండ్ పార్కుల్లో ఉంది. మిస్టర్ టోడ్ అనే పాత్ర తప్పు మలుపు తీసుకున్నాడు, ఇది గుంతలు మరియు ఆపదలతో నిండిన ప్రయాణంలో అతనిని పడవేసింది. ఈలలు ఊదుతున్నారు, హార్న్ లు మ్రొగుతున్నాయి, చివరి వరకు కార్లు గిరగిరా తిరుగుచున్నాయి. ఈ రైడ్ నుండి బయటపడటం అద్భుతంగా ఉంటుంది! నిజ జీవితం మిస్టర్ టోడ్ యొక్క వైల్డ్ రైడ్ లాంటిది కాదు. అవును, కొన్నిసార్లు దారి అసాధ్యంగా కనిపిస్తుంది, కానీ ఇది మూడు నిమిషాలకే పరిమితం కాదు! జీవితంలోని విలువైన దారులు సాధారణంగా పొడవుగా ఉంటాయి మరియు వాటికి ఎల్లప్పుడూ దృఢమైన, కఠినమైన నిబద్ధత అవసరం.
గత కొన్ని నెలలుగా మీ దారి ఎంత కఠినంగా ఉంది? మీరు కొన్ని పెద్ద గుంతలను తగులుకున్నారా? పట్టు విడువకుండా ముగించడం అసాధ్యం అనిపిస్తుందా? తన గారాలపట్టీకి జలుబు చేసిందని . . . అందుకే తన గోళ్ళు కత్తిరించుకోవటానికి చేసుకున్న అపాయింట్మెంట్ జారవిడుచుకున్నదని సణిగే స్త్రీకి, “నీకు అసలేమీ తెలియదు!” అని నాలాగా మీకు చెప్పాలనిపించే రోజులు ఎదురైయ్యాయా?దాపరికంలేని ఈ క్రింది ప్రకటనతో మీరు మనస్తాపం చెందవచ్చు, కానీ ఇది నిజం: “బలమైన వ్యక్తులకు మాత్రమే గొప్ప కష్టాలు ఇవ్వబడతాయి” అని వారి నమ్మకాన్ని పేర్కొని నన్ను చూసి పెద్దగా నవ్విన వ్యక్తులను కొట్టాలని నేను అనుకున్నాను. ఎవరు చెప్పారు? పరిశుద్ధ గ్రంథం అలాంటిదేమీ అస్సలు చెప్పలేదు! అసలైతే, అది దీనికి విరుద్ధంగా చెబుతుంది. నా బలమైన స్థితిలోగాక-నేను బలహీనంగా ఉన్నప్పుడు-అటువంటి సమయంలో యేసు క్రీస్తు నా ఆత్మను రూపాంతరమొందించాడు మరియు జీవిత పరిస్థితులతో సంబంధం లేకుండా నాకు స్వేచ్ఛ మరియు విశ్రాంతిని ఇచ్చాడు (1 కొరింథీయులకు 1:27).
ఇతరుల స్పష్టమైన తేలికైన జీవితాలను చూసి కోపం తెచ్చుకోవచ్చు, లేదా నేను వెళ్తున్న మార్గంలో దేవుడు నన్ను మార్చడానికి అనుమతించవచ్చు. తక్కువగా ప్రయాణించే దారికి కట్టుబడి ఉండటమంటే వేరొకరి దారితోగాని లేదా వాళ్ళు ఏమి చేస్తున్నారో అనేదానితోగాని సంబంధం లేదు. దేవుడు నేను ప్రయాణించడానికి అనుమతించినది తప్ప నేను మరి ఏ దారిలోనూ ప్రయాణించను.
తక్కువగా ప్రయాణించే దారికి కట్టుబడి ఉండటమంటే మంచి లేదా చెడు పరిస్థితులను, సమస్యలను జీవితం నా త్రోవలో పెట్టడంతో ఎటువంటి సంబంధం లేదు. దీనికి నా పరిస్థితులతో, నా భావాలతో, నా మానవ బలహీనత లేదా బలాలు, నా స్నేహితులు లేదా నా సంఘ అనుభవాలతో సంబంధం లేదు. దేవుడు తాను ఏమైయున్నాడని చెప్పాడో ఆయన అదియైయున్నాడు-అనగా సంపూర్ణమైన మంచితనము గలవాడు మరియు అనంతమైన జ్ఞానముగల సృష్టి అధిపతి మరియు నా జీవితానికి ప్రభువు అని నమ్మడమే ఈ దారికి కట్టుబడి ఉండటం.
చాలా సంవత్సరాల పోరాటం తరువాత, ఎల్లప్పుడూ ముందుకు వెళ్లలేని స్థితిలో నిష్క్రమణ కోసం వెతుకుతూ మరియు ఇతర దారులను కోరుకుంటూ ఉన్నప్పుడు, నా తండ్రి అయిన దేవుని మార్గమును అనుసరించడానికి నేను కట్టుబడి ఉన్నాను. నా పరిస్థితులు ఇంకా కష్టంగా ఉండవచ్చు, కానీ ప్రయాణం కొరకు ఈ నియమాలకు కట్టుబడి ఉండడం నేర్చుకున్నందున ఆయన నాయకత్వాన్ని అనుసరించడం సులభం అయ్యింది:
- దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని మరియు నన్ను క్రీస్తు స్వరూపమునకు మార్చడం కోసం ఇబ్బందులను అనుభవించడానికి నన్ను అనుమతిస్తున్నాడని నమ్మండి (హెబ్రీయులకు 12:11). . . కాబట్టి, ఆయనను నమ్మండి.
- దేవుని మార్గాలు మరియు తలంపులు నా వాటికన్నా ఉన్నతమైనవని నమ్మండి (యెషయా 55:8-10). . . అందువల్ల, ఆయనకు లోబడండి.
- దేవుడు వాగ్దానం చేసిన వాటిని నెరవేర్చడానికి నమ్మదగినవాడని నమ్మండి (ఫిలిప్పీయులకు 1:6). . . అందువల్ల, ఆయనలో విశ్రాంతి తీసుకోండి.
- దేవుని సత్యం సంపూర్ణమైనదని, లోపం లేకుండా, కలకాలం ఉండేదని నమ్మండి (2 తిమోతికి 3:16). . . కాబట్టి, ఆయనకు విధేయులై ఉండండి.
ప్రియమైన మిత్రమా, వేరొక దారి కోరుకుంటూ లేదా నిష్క్రమణ కోసం ఎదురుచూస్తూ, నేను ఒకప్పుడు ఉన్నలాగున నువ్వు ఉన్నావా? దేవునికి బాగా తెలిసిన మరియు నీకు మార్గనిర్దేశం చేస్తానని వాగ్దానం చేసిన, తక్కువగా ప్రయాణించిన దారివైపు తిరిగి దానికి కట్టుబడి ఉండటానికి నువ్వు ఇప్పుడు కోరుకుంటావా? మీ సంకల్పాన్ని-మీ జీవితమంతా-ఆయనకు విడిచిపెడతావా? ఒకవేళ కాకపోతే, ఎందుకు కాదు? నీ మాటలను దయచేసి నన్ను విననివ్వు! కానీ నువ్వు వ్రాసే ముందు, ఈ ప్రశ్నలను నిన్ను నీవే ప్రశ్నించుకో:
- నేను దేనికి భయపడుతున్నాను?
- వీటన్నిటి గురించి నేను ఏమి నమ్ముతాను?
- నేను లోబడటానికి ఇష్టపడనిది ఏమిటి?
- విధేయత చూపకుండా ఉండటానికి నా కారణాలు ఏమిటి?
తక్కువగా ప్రయాణించే దారికి కట్టుబడి ఉండటమంటే చిరునవ్వు చిందించటం లేదా అన్నింటినీ సిద్ధపరచడం లేదా నిర్భయంగా ఉండటం కాదు. మీరు కోపంతో పండ్లు కొరికి, “మొత్తానికి, నేను ఇక్కడ ఇరుక్కున్నాననుకుంట” అని చెప్పడం కాదు. దీని అర్థం మీరు మార్చలేని పరిస్థితులను అంగీకరించడం మరియు ఆయన మిమ్మల్ని వాటిగుండా నడిపిస్తాడని దేవుణ్ణి నమ్మడమే. దేవుని పట్ల మీకు ఉన్న కఠినతను, సందేహాన్ని మరియు కోపాన్ని వదిలేయడమే దీని అర్థం. మీరు గుంతలను సరిచేయలేరని లేదా పదునైన మలుపులను ఊహించలేమని లేదా మీకు మీరే ఏమీ సాధించలేరని ఆయనకు (మరియు మీకు మీరే) ఒప్పుకోవటమే దీని అర్థం . . . ఆపై మీ మార్గమంతటిలో మిమ్మల్ని నడిపించటానికి ఆయనను నమ్మడమే.
సర్వశక్తిమంతుడైన ప్రభువా, జీవిత మార్గంలో మీ చిత్తం యొక్క మర్మాలు మరియు మా జీవితంలోకి రావడానికి అనుమతించబడినవి అర్థం చేసుకోవడం మరియు వ్యవహరించడం కష్టముగా ఉండవచ్చు. మేము భరించే పరిస్థితులతో సంబంధం లేకుండా మీ పరిశుద్ధాత్మ మా జీవితములలో బలముగా పనిచేయుగాక. తండ్రీ, మిమ్ములను విశ్వసించి, మీకు లోబడి, విశ్రాంతి తీసుకొని, విధేయత కలిగియుండటం నేర్చుకుంటున్నప్పుడు, ఈ రోజు మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్.
- M. Scott Peck, The Road Less Traveled: A New Psychology of Love, Traditional Values and Spiritual Growth (New York: Simon and Schuster, 1978), 15.