దీనిని ఎవరైనా ఎప్పుడైనా ఊహించి ఉంటారా?
ఉన్నట్టుండి ఈ అల్పుడు ఊడిపడ్డాడు. అతను నగరంలోని రద్దీ వీధుల నుండి దూరంగా, నిశ్శబ్దంగా ఆరుబయట తన తండ్రి కోసం ఎంతో కఠినంగా పనిచేస్తూ తన సంవత్సరాలు గడిపాడు. అతని గురించి ఎవరైనా ఎప్పుడైనా విన్నారా అని ఎవరైనా అడిగితే, తెల్లమొహం వేసుకొని చూస్తూ వెంటనే “ఎవరు?” అనే సమాధానం ఉండేది.
అప్పుడు అకస్మాత్తుగా, అతను దేశంలో అత్యంత ప్రసిద్ధ యువకుడు అయ్యాడు . . . అతని పేరు అందరికీ తెలుసు. వారు అతని గురించి ఒక పాట కూడా రాశారు, ఇది అందరికీ ఎప్పుడో తెలుసు. నిజంగా అతనిది అత్యంత వేగంగా దూసుకెళ్లిన విజయగాథ. ఇది ఆ బాలుడిని ఎంతో ఆకర్షించి ఉంటుంది.
అది ఒకవేళ జరిగివుంటే, అది ఎవరికీ తెలియదు. జీవితం సరళంగా, అస్తవ్యస్తంగా లేని కొండలకు తిరిగి వెళ్ళడానికి అతను ఉత్తేజితుడైయ్యేవాడు కాదు.
లోయలో యుద్ధం యొక్క భయపెట్టే సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టు మానసికంగా దాన్ని అలరించడంతో ఆ మొదటి రాత్రి నక్షత్రాల క్రింద విరామం లేకుండా ఉండి ఉండాలి. భయంకరుని స్వరం యొక్క భయపెట్టే శబ్దం లోయ అంతటను ప్రతిధ్వనించింది. అతని నరాల్లో దేశభక్తి ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఆ నున్నటి రాళ్లను తీసుకోవడం . . . రాయి నుదుటిని తాకినప్పుడు నిస్తేజపరచు దబ్బుమనే శబ్దము రావటం . . . జయకేతనాలు . . . పొడవైన ఇశ్రాయేలు రాజు నుండి ఆశ్చర్యంతో కూడిన ప్రశంసలు. కానీ, ఇప్పుడు నక్షత్రాలను తేరిచూస్తున్న వానికి వినబడేదంతా నిశ్శబ్దమే. ఆతను ఏ ప్రదేశానికి చెందినవాడో అక్కడికి వచ్చేశాడు . . . తాను ఉండటానికి ఇష్టపడే చోటికి అతను వచ్చేశాడు. మత్తెక్కించే ప్రజల ధ్యాసకు దూరంగా వచ్చేశాడు.
గొర్రెలు తన చుట్టూ పడుకోవడంతో అతను చిరునవ్వుతో నిద్రలోకి జారుకున్నాడు.
రాబోయే నెలల్లో అతను ఎదుర్కొనే పాపిష్టి పీడకల గురించి చిన్నవాడైన దావీదుకు తెలియదు. కానీ అతనిలో నిద్రపోతున్న తీగలు ఉన్నాయి, జీవిత శ్రమలు మాత్రమే వాటిని కంపింపజేయగలవు. దేవుని మార్గం అతడెన్నడూ ఊహించని చీకటి లోయల్లోకి అతన్ని నడిపిస్తుంది.
ఆ నిశ్శబ్ద రాత్రి యొక్క నిద్ర తరువాత జరిగిన సంఘటనలు తర్కాన్ని ధిక్కరించాయి. దావీదు తాను వినయం, విధేయత మరియు చిత్తశుద్ధితో నడచినప్పటికీ, అతను ఎవరి ముఖాన్ని కాపాడాడో ఆ వ్యక్తే అతనికి వ్యతిరేకమయ్యాడు. సౌలు రాజు నిజంగా పిచ్చివాడైపోయాడు. తనది కాని ప్రజాదరణతో అసంతృప్తి చెంది, ప్రజల్లో తనమీద ఉన్న గౌరవం తగ్గిపోతుందేమోననే అభద్రతాభావము కలిగి, కోపానికి మరియు హత్యకు మధ్య ఉన్న దెయ్యాల ఆలోచనలతో, సౌలు క్రూరమైన మానవునిగా మారిపోయాడు. అనుమానం మరియు అసూయతో నడిపించబడిన రాజు, ఒకేఒక్క వెంటాడే వెర్రి కోపంతో జీవించాడు-దావీదు యొక్క మరణం.
వారి సంబంధంలో ఈ విషాద మలుపు ఉన్నప్పటికీ, దావీదు అభివృద్ధి చెందాడు. అతని జీవిత చరిత్రలో మూడుసార్లు మనము ఆ వాస్తవాన్ని చదువుతాము (1 సమూయేలు 18:5, 14-15). అదనంగా, దావీదు “బహు వివేకము గలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటె అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను” (18:30). ఇది మరింత ప్రజాదరణకు దారితీసింది, సౌలు యొక్క అంతర్గత వ్యక్తుల దృష్టిలో దయపొందాడు, సైనిక విజయాలు మరియు ప్రజల నుండి అపారమైన ప్రశంసలు వచ్చాయి. దావీదు గర్వంగా లేడు, కానీ ప్రశంసలు వరదలా పొర్లిపారి ఎలా వచ్చాయంటే, అతను కీర్తి ప్రతిష్ఠల నుండి తప్పించుకోలేకపోయాడు.
ప్రజల ప్రశంసలు మరియు వ్యక్తిగత భయము మధ్య నొక్కుకుపోయి, దావీదు తనను తాను క్లిష్టమైన మనుష్యులగుంపులో ఉన్నట్లు కనుగొన్నాడు. సౌలు యొక్క పదునైన ఈటె ఎప్పుడూ దూరంగా లేదు. పన్నెండు సంవత్సరాలకు పైగా, దావీదు తన ప్రాణాల కోసం పరుగెత్తవలసి వచ్చింది. అలాగే పలాయితుడుగా జీవించవలసి వచ్చింది.
ఎవరో ఇలా అన్నారు: “శ్రేయస్సును నిర్వహించగల ప్రతి వ్యక్తి కొరకు, ప్రతికూలతను ఎదుర్కోగల వంద మంది ఉన్నారు.” అయితే, ఎప్పుడో, ప్రతికూలత దావీదు యొక్క స్థిరమైన తోడుగా మారింది. సౌలు యొక్క బెదిరించే నీడ నుండి అతను ఎప్పుడైనా విముక్తి పొందుతాడా అని అతను ఆశ్చర్యపడి ఉంటాడు.
శ్రమ యొక్క గర్భం నుండి రెండు అద్భుతమైన మరియు శాశ్వతమైన ప్రయోజనాలు పుట్టాయని మరచిపోవటం చాలా సులభం: మొదటిది, దావీదు యొక్క స్వభావం అత్యున్నత స్థానానికి చేరుకోవటం మరియు రెండవది, అనేకమైన దావీదు కీర్తనలను రచించడం. దావీదు అరణ్యంలో జంతువులా వేటాడబడి జీవించేటప్పుడు మనం అనుకరించుటకు యోగ్యమైన గుర్తుంచుకునే మరియు ఆరాధించే లక్షణాలు రూపించబడి, సానబెట్టబడి మరియు మెరుగుపరచబడ్డాయి. గొప్ప వ్యక్తిత్వం, భారీ వేరుల మాదిరిగా, నీరు తక్కువగా ఉన్నప్పుడు మరియు గాలులు బలంగా ఉన్నప్పుడు లోతుగా పెరుగుతుంది. ఆదరణ కొరకు మనం ఇప్పుడు మళ్ళు కీర్తనలు చాలా తరచుగా కన్నీరు ఆగక మరియు ప్రశ్నలకు సమాధానం లేననప్పుడు దావీదు యొక్క విరిగిన హృదయం నుండి ఉద్భవించినవే. భారీ నదుల మాదిరిగా గొప్ప సంగీతం ప్రవహించాలంటే కుండపోత వర్షాల నుండి రావాలి, ఇది మహాసముద్రం లాంటి లోతుల యొక్క వైభవం మరియు విస్తారతకు నడిపిస్తుంది.
మరియు ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నారు? ఇటీవల భంగపాటు జరిగిందా? నమ్మకత ఇక లేదా? స్నేహితుడు ఇక దగ్గర లేడా? ఒక కల ఇక స్పష్టంగా లేదా? భవిష్యత్తు ఉజ్వలంగా లేదా? ఒకప్పుడు నవ్వు మరియు సాంగత్యం ఉన్న చోట ఇప్పుడు భయమున్నదా? సహాయం, ధృవీకరణ మరియు మెప్పుకు బదులుగా ఇప్పుడు అపార్థం ఉన్నదా? ఒక సౌలు మీ అడుగులను చాటుగా వెంబడిస్తూ, తన ఈటెను పదునుపెట్టి, బలవంతంగా పొడుచుటకు సరైన క్షణం కోసం ఎదురుచూస్తున్నాడా?
ధైర్యము తెచ్చుకోండి! ఈ ఖచ్చితమైన మూసలోనే దేవుడు తన ఉత్తమమైన పనిని చేయగలడు (మరియు తరచూ చేస్తాడు)!
దావీదు మాదిరిగానే మీ వంతు కూడా తర్కాన్ని ధిక్కరించవచ్చు. కానీ మీ జీవితంలో కొన్ని అద్భుతమైన లక్షణాలు మరియు మీ అత్యుత్తమ సేవలు కొన్ని మీ జీవితంలో ఈ చాలా బాధాకరమైన కాలం నుండి ఉద్భవిస్తాయి.
దావీదును అడగండి . . . అతడెన్నడూ దీనిని ఊహించి ఉండడు.