మీలో ఎంతమంది నిరాశ గురించి మాట్లాడటానికి యిష్టపడతారు? ఇంకా, వేరొకరు నిరాశకు గురి అయ్యే బలహీనత ఉన్నప్పుడు మీరు మీ నమ్మకాలను పంచుకుంటారా?
ప్రత్యేక అవసరాల పిల్లలను పెంచే తల్లిదండ్రులకు నిరాశ తీవ్రమైన పోరాటమని చెప్పడం ద్వారా నన్ను ప్రారంభించనివ్వండి. నిరాశ అనేది వర్ణించలేనిదిగా, దుఃఖకరమైనదిగా మరియు బలహీనపరిచేదిగా ఉండవచ్చు. దీని గురించి మాట్లాడటం అంత సులభం కాదు! నాకు తెలుసు ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలు నిరాశతో పోరాడాను. జీవితం అసలు విలువైనదేనా అని నేను ప్రశ్నించాను మరియు చీకటిలో ఉంటూ జీవితం యొక్క అర్థాన్ని అనుమానించాను. మీరు బాధపడుతున్నట్లైతే, నా హృదయం మీ కోసం పగిలిపోతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరమంతా, దేవుడు తన దయను సమృద్ధిగా మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను.
సెలవుదినాల్లో, అనేక ప్రత్యేక అవసరాల కుటుంబాలు అధిక యిబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు, నిరాశ మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బహుమతులు కొనడం మరియు ఈవెంట్‌లకు వెళ్లడం వంటి “సాధారణ” విషయాలు కూడా-దైనందిన కార్యక్రమాలను క్రమంగా విశ్లేషించడం కూడా-ఈ కాలమంతా చాలా నిరుత్సాహపరుస్తాయి. నా కొడుకు జాన్‌కు 6 సంవత్సరాల వయసులో, అతని క్రిస్మస్ జాబితాలో ఇవి ఉన్నాయి: వాషింగ్ మెషీన్, అన్ని ఆకారాలు మరియు పరిమాణాల ఫ్యానులు, వాక్యూమ్ క్లీనర్ మరియు అతని గదిలో ఒక జలపాతం. సెలవుల యొక్క ప్రత్యేక ఆకర్షణలు ఇలానే ఉంటాయి! ఇది ఇప్పుడు నాకు హాస్యాస్పదంగా ఉంది, కానీ అతను 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అలా అనిపించలేదు. అలాగే నేను ఊహించినట్లుగా ఇతర తల్లిదండ్రులు తమ పిల్లలకు బహుమతులు ఇచ్చినట్లుగా నేను కూడా ఇవ్వాలని ఎంతో ఆశపడ్డాను. దానికంటే, ఏ మానవుడూ ఇవ్వలేనిది వాడికి ఇవ్వాలన్న నా కోరిక మాత్రం యింకా పెరిగింది.
కాబట్టి, ముఖ్యంగా సెలవుదినాల్లో, నిరాశ యొక్క యిబ్బంది ఏమిటో నాకు తెలుసు. నాకు తెలుసు అలాగే ఈ సీజన్ మీకు గొప్పదిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను చేసిన కొన్ని పనులు నా వైఖరిని మరియు దృక్పథాన్ని సానుకూలంగా ప్రభావితం చేసాయి. అవి యిక్కడ ఉన్నాయి. ఈ సంవత్సరం సంతోషకరమైన సెలవుదినాన్ని ఆస్వాదించడంలో మీకు సహాయపడటానికి ఈ ఆలోచనలలో కొన్నింటిని ఎంచుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
- మీ భావోద్వేగాలు మరియు నిజమైన నిజాయితీగల పోరాటాల గురించి జర్నల్ లో వ్రాయండి. మీ జీవితానికి భావోద్వేగాలు అవసరం. . . కానీ వాటిని అన్వేషించడానికి మరియు వ్యక్తీకరించడానికి ఆరోగ్యకరమైన బయటకు పోయే మార్గము ఉండాలి. తద్వారా అవి మీ జీవితాన్ని స్వాధీనం చేసుకోవు అలాగే మీ దిశను దెబ్బతీయవు.
- మీరు దేనిగుండా వెళుతున్నారో చాలా కొద్దిమంది నమ్మదగిన స్నేహితులకు తెలియజేసి, వారు మీకు సహాయము చేయుటకు వారిని అనుమతించండి. మీరు ఒంటరిగా ఉన్నారని అనిపించడం మీకు తేలికేగాని మీరు ఒంటరిగా లేరు. మీరు సహాయం కోసం అడగండి మరియు మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తులు మీకు సహాయం చేయనివ్వండి.
- వెళ్ళండి అలాగే మరొకరికి సహాయం చేయండి. మీ ఇంట్లో ఒక గదిని సిద్ధపరచండి మరియు కోలాహలాన్ని తొలగించండి. మీకు ఇకపై అవసరం లేని వస్తువులను వాటి అవసరమున్న కుటుంబానికి ఇవ్వండి.
- మీ జీవితంలోని వ్యక్తులను గూర్చి ఆలోచనచేసి వారికి కృతజ్ఞతలు చెప్పండి. మీరు గౌరవించే వారికి ఒక ఉత్తరం రాయండి, వారితో మీరు గడిపిన సమయం నుండి మీరు సేకరించిన జ్ఞానాన్ని గూర్చి వ్రాయండి.
- దేవుని దృష్టిలో మీ విలువను మరియు మీ పోరాటాల ద్వారా ఆయన మీకు ఇచ్చిన బహుమతులను మీరే గుర్తు చేసుకోండి. క్రీస్తులో మీ గుర్తింపును మరియు మీ జీవితంలో ఆయన శక్తిని కొనియాడే ఒక పుస్తకాన్ని మీ కోసం తయారు చేసుకోండి. మీరు పేజీలను తిప్పినప్పుడు, ఆయన ఇప్పటివరకు ఏమి చేసాడో అలాగే ఇకముందు ఆయన ఏమి చేస్తానని వాగ్దానం చేసాడో వాటిని మీరు చాలా స్పష్టంగా చూడగలుగుతారు.
మీ పుస్తకాన్ని ఎలా సమకూర్చుకోవాలో ఇక్కడ కొన్ని ఆలోచనలు ఉన్నాయి:
- మీ పూర్తి పేరు మరియు పుట్టినరోజును మొదటి పేజీలో వ్రాయండి.
- మీ విలువ, మీ జీవితం మరియు మీ పట్ల దేవుని ప్రేమను గురించి లేఖనము చెప్పేదాన్ని అనుసరించండి. మీరు కనుగొన్న వాటిని ప్రారంభ పేజీలలో వ్రాయండి.
- “వాగ్దానాలు” అనే పేజీని చేర్చండి. ప్రజలందరికీ దేవుడిచ్చిన కొన్ని వాగ్దానాలను జాబితా చేయండి. మీ జీవితంలో ఇప్పటికే నెరవేరిన ఈ వాగ్దానాలు ఎలా నెరవేరాయో వ్రాయండి.
- “వాక్యభాగాలు” అనే పేజీని చేర్చండి. ఇటువంటి సమయాల్లో మీకు సహాయం చేసిన మీ జీవితంలోని ముఖ్యమైన సమయములను మరియు లేఖనములోని భాగాలను జాబితా చేయండి.
- “బలం” పేరుతో ఒక పేజీని జోడించండి. పోరాటాల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచిన విధానాలను మరియు మీరు పట్టుదల కలిగియుండటం వలన మీ స్వభావం ఎలా అభివృద్ధి చెందిందో గుర్తించండి. క్రీస్తు పోలికగా రూపాంతరం చెందడం గురించిన లేఖనాలను చేర్చండి.
- చివరలో, “ఆరాధన” పేజీని చేయండి. మిమ్మల్ని కాచిన ప్రభువును స్తుతించండి, ఘనపరచండి. పాటలు, స్నేహితులు, ప్రకృతి, లేఖనం, చిన్నపిల్ల యొక్క చిరునవ్వు కూడా ఆరాధనలోని రకాలు కావచ్చు.
ఈ సంవత్సరం నిరాశ నుండి మీ హృదయాన్ని కాపాడటానికి ఈ ఆలోచనలు సహాయపడతాయని అలాగే ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు యొక్క సమాధానము మరియు సన్నిధి ఇప్పుడు, ఎల్లప్పుడు మీకు సహాయపడాలని నేను ప్రార్థిస్తున్నాను.