మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు కాకుండా కొద్దిమందికే దేవుని కృప గురించి లోతైన అవగాహన ఉంది. కఠినమైన, క్రియలకు ప్రాధాన్యతనిచ్చే పరిసయ్యుడిగా క్రూరమైన దుర్మార్గపు జీవితం నుండి విమోచింపబడి, ఈ వ్యక్తి పురోగమనం చెంది, మారుమనస్సు పొందాడు, అలాగే క్రీస్తు యొక్క అధికారం ద్వారా కృప మరియు నిశ్చయత కలిగిన సున్నితమైన ఆత్మగా తయారయ్యాడు. అర్థం చేసుకున్నాడు. క్షమించాడు. సమీపించదగినవాడు. అతను అన్యజనులకు నిరీక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉండటమేగాక, వారిమధ్య నివసించేంత స్థాయికి వెళ్లాడు. అంతేగాక, స్వచ్ఛమైన యూదు రక్తాన్ని తనంతట తానే చిందిస్తాడు.
క్రీస్తు యొక్క మంచి సైనికునివలె పౌలు పడినన్ని కష్టాల మోతాదు నాకు తెలిసిన ఎవరూ భరించలేదు. అతన్ని మరింత ఆశ్చర్యపరిచేవానిగా చేసింది ఏమిటంటే: బలిష్ఠుడైన రోమా సైనికునితో బంధించబడటం లేదా అటువంటి ఇరుకైన ప్రదేశానికి పరిమితమయ్యి అసౌకర్యానికి గురికావడం గురించి అతను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఈ మనిషి సణగడు. దేవుని కృప వలన, అతను వీటన్నిటినీ అధిగమించి జీవించాడు. నేను మరలా చెబుతున్నాను, అతను సంతృప్తి యొక్క రహస్యాన్ని నేర్చుకున్నాడు.
ఎక్కడైతే నిరాశావాదం మీ దృక్పథాన్ని వర్గీకరిస్తుందో,అక్కడ మిమ్మల్ని కారుమబ్బు క్రింద నివసించే వ్యక్తిగా మార్చడానికి-అది మిమ్మల్ని కలవరపెట్టడానికి అనుమతించడమే భయంకరమైన శోధన. జీవితం కష్టమైనది. మీరు గృహ నిర్బంధాన్ని పోలిన పరిస్థితిలో నివసిస్తున్నారు. నిర్బంధ పరిస్థితుల నుండి తప్పించుకోలేక, మీ గతానికి బంధించబడినట్లుగా మీరు భావిస్తున్నారు. మీరు ఈ విధంగా ఎక్కువ కాలం జీవించి ఉండటం చేత ప్రతికూల ఆలోచన అలవాటుగా మారి ఉండవచ్చు. మీరు వేరే విధంగా ఆలోచిస్తారని ఊహించలేరు.
నా దగ్గర అద్భుతమైన సమాచారం ఉంది: మీ పరిస్థితులకు మించిన నిరీక్షణ మీకు ఉన్నది. మీరు వాటిని అధిగమించి జీవించవచ్చు. పౌలు అనే వ్యక్తి తన నమ్మశక్యముకాని కష్టమైన పరిస్థితులను అధిగమించి జీవించగలిగితే, మీరు కూడా అలా చేయవచ్చు. కానీ క్రీస్తు మీ ప్రధానమైన దృష్టిగా మారాలి. ఆయన, ఒక్కడే, మిమ్మల్ని శక్తివంతం చేయగలడు మరియు ప్రతికూలత యొక్క చెరను అధిగమించి జీవించమని నేర్పిస్తాడు. మీ బాహ్య పరిస్థితులు మారకపోవచ్చు, కానీ నిజంగా, మీరు మారతారు. మీ ఆలోచనలలో క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వబడినందున, మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులు మీ జీవిత భాగస్వామికి, మీ పిల్లలకు, మీ స్నేహితులకు మరియు మీ సహోద్యోగులకు స్పష్టంగా కనిపిస్తాయి. మిమ్మల్ని మీరు బాధితులుగా చూడటానికి బదులుగా, మీ స్వంతం కాని బలాన్ని మీరు గ్రహించడం ప్రారంభిస్తారు. దీని ఫలితం? ఒకప్పుడు మిమ్మల్ని ఓడించిన పరిస్థితులకు మీరు స్పందించే విధానం వల్ల మీరు ఒక వైవిధ్యం చూపుతారు. మీకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు, మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీ సంతృప్తి వీరోచితంగా ఉంటుంది.
నిరీక్షణను పట్టుకొని ఉండండి! మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించండి.
Taken from Charles R. Swindoll, “Despite Your Circumstances,” in Great Days with the Great Lives (Nashville: W Publishing, 2005), 335. Copyright © 2005 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.