పరిశుద్ధ గ్రంథము

Bible

లేఖనముపై మీ అవగాహన పెంచుకోండి

పౌలు తిమోతికి రాసిన రెండవ లేఖలో, “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది”(2 తిమోతి 3:16–17) అని వ్రాశాడు. అపొస్తలుల నుండి ఇప్పటివరకు ఉన్న క్రైస్తవులు, పౌలు మాదిరిగా, సంఘము యొక్క జీవమునకు మరియు ఎదుగుదలకు లేఖనాన్ని కేంద్రంగా భావించారు.

మన జీవితాలకు దాని ప్రాముఖ్యత మనకు తెలిసినప్పటికీ, చాలా తరచుగా లేఖనమును గూర్చిన మన జ్ఞానం మరియు అనువర్తనం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు? బహుశా పరిశుద్ధ గ్రంథమును ధ్యానించటానికి కూర్చోవడం భయపెట్టేదిగా అనిపించవచ్చు లేదా కొంత ఆరాధనా సమయాన్ని ఏర్పరచుకోవడం కష్టముగా ఉండవచ్చు. మీకు పరిశుద్ధ గ్రంథమును గూర్చి ప్రశ్నలు ఉండవచ్చు, కానీ సమాధానాల కొరకు ఎక్కడ చూడాలో మీకు తెలియకపోవచ్చు.

ఈ సాధనాలు, వ్యాసాలు, ఆడియో ఉపన్యాసాలు మరియు వనరులు మీ జీవితంలో లేఖనాలను మరింత పూర్తిగా పొందుపరచడంలో మీకు సహాయపడతాయి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి