క్రీస్తు రాకడను గురించి బైబిల్ ప్రవచనం నుండి వచ్చిన ఈ వాస్తవాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు:
- బైబిల్లోని ప్రతి 30 వచనాలలో ఒకటి క్రీస్తు రాకడ లేదా అంత్యకాలము విషయం గురించి ప్రస్తావించింది.
- క్రొత్త నిబంధనలోని 216 అధ్యాయాలలో, క్రీస్తు రాకడను గూర్చి 300 కి పైగా సూచనలు ఉన్నాయి.
- 27 క్రొత్త నిబంధన పుస్తకాలలో 23 క్రీస్తు రాకడను గూర్చి పేర్కొన్నాయి.
- పాత నిబంధనలో, యోబు, మోషే, దావీదు, యెషయా, యిర్మీయా, దానియేలు వంటి ప్రసిద్ధ మరియు నమ్మకమైన దేవుని జనులు మరియు చాలా మంది చిన్న ప్రవక్తలు తమ రచనలలో క్రీస్తు రాకడను గూర్చి ప్రస్తావించారు.
- క్రీస్తు తరచూ భూమిమీదకు తాను స్వయంగా తిరిగి రాబోవుచున్న సంగతిని గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.
- శతాబ్దాలుగా, క్రీస్తు శిష్యులు మరియు అనుచరులు క్రీస్తు ఏదో ఒక రోజు భూమి మీదకు తిరిగి వస్తారని మొండిగా విశ్వసించారు, దానిగూర్చి వ్రాశారు మరియు బోధించారు.
దీనిని పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. ప్రభువైన యేసు దాని సత్యములపై నిలబడి ఉన్నాడు. అపొస్తలులు దానిని ప్రకటించి దాని గురించి రాశారు. విశ్వాస ప్రమాణాలు దానిని కలిగి ఉంటాయి మరియు ధృవీకరిస్తాయి.
ఆయన రెండవ రాకడ శతాబ్దాలుగా ఒక నిరర్థకమైన అంశముగా పరిగణించబడలేదని మనకు స్పష్టమవుతుంది. కానీ విచిత్రం ఏమిటంటే, ఈ తరంలో చాలా మంది క్రైస్తవులు దీనిని విస్మరిస్తున్నారు లేదా ఏదో ఒకవిధంగా గందరగోళానికి గురవుతున్నారు. అది మంచిది కాదు. ఇది ఒక అద్భుతమైన సత్యం.
Adapted from Growing Deep in the Christian Life: Essential Truths for Becoming Strong in the Faith (Grand Rapids: Zondervan, 1995), 266267. Used by permission.