ఇది అంత బాగోదు, కాని ఇది ఎక్కువకాలం నిలిచియుంటుంది. ఇది ప్రతి జీవితంలో మరియు సంవత్సరంలోని ప్రతి కాలంలో సంభవిస్తుంది. నేను దానిని “అనుదిన శ్రమ” అని అంటాను.
ఎప్పుడూ ఉండే పిల్లలతో మరియు అంతులేని బాధ్యతలతో కూడిన శ్రమను గృహిణులు రోజుకు పద్నాలుగు గంటలు ఎదుర్కొంటారు. విద్యార్థులు అసైన్‌మెంట్‌లు, తరగతులు, గడువులు మరియు పరీక్షల కష్టాలను భరిస్తున్నారు. విక్రయదారులు అందుకోవలసిన కోటాలు ఉన్నాయి. సంగీతకారులు నిరంతరం సాధన చేయాలి. మనస్తత్వవేత్తలు ఒకదాని తర్వాత మరొకటి దుఃఖముతో నిండిన ఆత్మ నుండి తప్పించుకోలేరు. భర్తలకు ప్రతి వారాంతంలో కోయడానికి గడ్డి అలాగే సరిచేయాల్సిన పనులు ఉన్నాయి. బోధకులు వర్తమానములకు సిద్ధపడే శ్రమను నిరంతరము ఎదుర్కొంటారు.
వాస్తవం ఏమిటంటే-మనం ఒప్పుకోవాలి-శ్రమపడాల్సిందే! దాని గురించి రచ్చ చేయడానికి బదులు లేదా దాని గురించి భయపడే బదులు, మనం దానిని అధిగమించి జీవించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి. ఎలా?
పాటలు! అయితే ఏవో పాటలు కాదు.
నా మనసులో నిజంగా పాత పాటల పుస్తకం ఉంది. నిజానికి, ఇది మన సృష్టికర్త-దేవుని ప్రేరణతో కూర్చబడిన మొట్టమొదటి పాటల పుస్తకాలలో ఒకటి. దాని కాలాతీతమైన పాటలు మనం దైనందిన జీవిత శ్రమను అధిగమించి జీవించడానికి ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. అవును, అధిగమించి జీవించడానికే. మరియింక ఎందుకు దేవుడు కీర్తనలు అని పిలవబడే పురాతన కూర్పులను ప్రేరేపించాడు? అవి ప్రతి తరంలో కమ్మని ఫలాలను అందించిన కలకాలం నిలిచిపోయే పాటలు. ఖచ్చితంగా, ఆయన ప్రతి సంగీత కళాఖండం యొక్క శాశ్వత విలువను గ్రహించాడు గనుక మనం ఓర్పుతో ఉండులాగున సహాయం చేయడానికి వాటిని భద్రపరిచాడు. మనం శ్రమను అధిగమించి జీవించడానికి వీలు కల్పిస్తూ అవి మహిమ తైలములొలుకుచున్నవి. నా ఉద్దేశ్యం ఇక్కడ ఉంది:
- భయపడినప్పుడు, “యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు” అని ఎవరు ఆదరించబడలేదు? అది 23వ కీర్తన.
- అపరాధభావనతో ఉక్కిరిబిక్కిరి అయ్యి, “నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నన్ను బాగుగా కడుగుము . . . నన్ను పవిత్రపరచుము” అని ఉపశమనాన్ని పొందనివారు ఎవరుంటారు? అది 51వ కీర్తన.
- అలాగే మనం మరచిపోబడినట్లు భావించిన దినాల్లో, “మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు” అని ధైర్యాన్ని పొందనివారు ఎవరుంటారు? అది అమర్త్యమైన 91వ కీర్తన.
శ్రమ ఎప్పుడో ఒకప్పుడు సెలవు తీసుకుంటుందని అనుకోకండి. అది ఎప్పుడూ ఉంటుంది. కానీ, మార్పు కోసం, దానిని అధిగమించి జీవిద్దాం.
మీ వ్యక్తిగత అధ్యయన సమయంలో చేర్చుకోవడానికి కొన్ని కీర్తనలను ఎంచుకోండి. అవి అతుక్కుపోయేలా చేయడంలో సహాయపడులాగున, ఒకేసారి ఇంత గొప్ప భోజనాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నించవద్దు. నెమ్మదిగా ఆస్వాదించడానికి ఈ పాటలను ఖరాదైన ఆహారంగా పరిగణించండి. చాలా వేగంగా ఉంటే అది ప్రతికూలంగా ఉంటుంది. మీ సమయాన్ని వెచ్చించమని, మీరు ఎంచుకున్న ప్రతి కీర్తనను జాగ్రత్తగా చదవాలని, ప్రతి ఒక్కటిని నెమ్మదిగా జీర్ణించుకోవడానికి మీ మనస్సుకు సమయం ఇవ్వాలని మరియు దాని ఆచరణాత్మకమైన అన్వయానికి అర్థవంతంగా ప్రవేశించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. సమయముచే పరీక్షించబడిన ఈ సాహిత్యం ఈ కీర్తనల సత్యాలను మనం జీవించేలా చేయడానికి మన బ్రతుకు దినములకు తగినంత పోషణను జోడిస్తుందని నేను నమ్ముతున్నాను. లేకపోతే, మన సుదీర్ఘ దినములు ఎప్పటికీ ముగియవు మరియు మన ముందు ఉన్న అలసటతో కూడిన మార్గము ఎప్పటికీ తొలగిపోదు. ప్రేరేపించబడిన ఈ పాటలకు నేను ఎంత కృతజ్ఞుడనో!
దేవుని ప్రజలు ఆయన పాటలను తరచుగా పాడాలి. . . మరియు సమయముచే పరీక్షించబడిన వాటి సాహిత్యం మన ఆత్మలను పోషించడానికి అనుమతించాలి. మనము అలా చేసినప్పుడు, మనము శ్రమను అధిగమించి జీవించడం ప్రారంభిస్తాము.