దేవుడు ఏదైనా అసాధారణమైనదాన్ని చేస్తున్నప్పుడు—అసామాన్యమైనదేదో చేస్తున్నప్పుడు—మీరు అందులో భాగమై ఉండాలి!
జ్ఞానులు నక్షత్రాన్ని చూసినప్పుడు, వారు దానిని అనుసరించవలసి వచ్చింది. సమాధి ఖాళీగా ఉందని పేతురు, యోహాను వినినప్పుడు, వారు దానిని చూడడానికి పరిగెత్తారు. పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ శిష్యులకు శక్తినిచ్చినప్పుడు, వారు ప్రపంచాన్ని తలక్రిందులుగా చేసారు.
దేవుడు ఈరోజు ఏదో అద్భుతం చేస్తున్నాడా? ఆయన చేయబోవుచున్నాడని నేను నమ్ముతున్నాను-అంతేగాక ఇది ఆయన యోషీయా రాజు కాలంలో చేసినట్లే చేయబోవుచున్నాడు.
యోషీయా తాత మనష్షే, పిల్లలను బలి ఇవ్వడంతోపాటు క్షుద్ర పద్ధతుల్లో ప్రజలను ముంచివేసాడు. నమ్మశక్యం కాని విధంగా, యోషీయా తండ్రి ఆమోను “అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను” (2 దినవృత్తాంతములు 33:23). ఈ మురుగు కాలువ నుండి, యోషీయా ఎనిమిదేళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్టించాడు.
కానీ యోషీయా “…యెహోవా దృష్టికి యథార్థముగా నడిచెను” (2 రాజులు 22:1-2)! అతని తల్లి, యెదీదా, అతనికి దైవభక్తిలో మార్గనిర్దేశం చేసి ఉండాలి. ఇంకెవరు చేయగలరు? బహుశా యెదీదా అతనికి పఠించిన కంఠస్థం చేసిన లేఖనాలే యోషీయా యొక్క ఆత్మీయ సంకేతాలై ఉండవచ్చు-అద్భుతమైన పెంపకానికి విశేష ఉదాహరణ!
16 సంవత్సరాల వయస్సులో, “తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొన్నాడు” (2 దినవృత్తాంతములు 34:3). దేవుడు యోషీయా హృదయాన్ని ప్రేరేపించాడు మరియు 20 సంవత్సరాల వయస్సులో, ధైర్యవంతుడైన రాజు దేశంలో దేవుని నడిపింపులో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాడు. యెరూషలేములో మొదలుపెట్టి, యోషీయా దేశాన్ని శుద్ధి చేయడానికి బయలుదేరాడు:
అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి . . . . దేవతాస్తంభములను చెక్కినవిగ్రహములను పోతవిగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణముచేసి, వాటికి బలులు అర్పించినవారి సమాధులమీద చల్లి వేసిరి. (2 దినవృత్తాంతములు 34:4)
అప్పుడు అతను దేశంలోని మిగిలిన ప్రాంతాలను చుట్టుముట్టాడు:
బలిపీఠములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కినవిగ్రహములను చూర్ణముచేసెను. (2 దినవృత్తాంతములు 34:7)
అతడు విగ్రహాలను చూర్ణము చేశాడు. ధూళి తప్ప మరేమీ మిగులలేదు-ఇప్పుడు ఇది పరిపూర్ణంగా అద్భుతమైనది!
తరువాత, యోషీయా తన “మంత్రివర్గం”లో తన అభిరుచిని ఆకర్షించిన వ్యక్తులను, అతను మార్గదర్శకత్వం వహించిన మద్దతుదారులను నియమించాడు. సమిష్టి దృష్టితో, వారు ఆలయాన్ని పునరుద్ధరించారు-అద్భుతమైన జట్టు నిర్మాణం!
ఈ ప్రక్రియలో, యాజకుడైన హిల్కీయా దుమ్ముకొట్టుకుపోయిన ఒక గ్రంథపు చుట్టను కనుగొన్నాడు: “యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగల గ్రంథము” (2 దినవృత్తాంతములు 34:14). బహుశా మిగిలి ఉన్న ఏకైక నకలు-అద్భుతమైన ఆవిష్కరణ!
గుర్తుంచుకోండి, యోషీయా, లూథర్ మరియు కాల్విన్‌ల వలె, తన సంస్కరణను సమీకరించడానికి మొదట్లో ఎటువంటి లేఖనాలను కలిగిలేడు. కానీ అదిగో, అది అక్కడే ఉంది! దేవుని సత్యం యొక్క శ్రావ్యత ఎంత విలువైనదిగా వినబడి ఉంటుంది! యోషీయా అందులోనిది చదువబడిన దానిని విన్నప్పుడు, తన దేశం దేవుని ఆజ్ఞలను ఎలా నిర్లక్ష్యం చేసిందనే దాని గురించి పశ్చాత్తాపంతో తన బట్టలు చించుకొని ఏడ్చాడు.
బైబిల్ మిమ్మల్ని ప్రభావితం చేసిన మొదటి సందర్భం మీకు గుర్తుందా? మీ హృదయం కీర్తించి, మీ కళ్ళలోంచి కన్నీళ్ళు ప్రవహించాయా? మొత్తానికి, మీకు సత్యం తెలిసింది! మీరు ఆధారపడదగినది, తర్వాత ఏమి చేయాలో తెలుసుకోవడానికి మీకు సహాయపడేది.
యోషీయాకు ఖచ్చితంగా తెలుసు. అతను దేశాన్ని సమకూర్చి, “నిబంధన గ్రంథపు మాటలన్నియు” వినిపింపజేసాడు (2 దినవృత్తాంతములు 34:30). అతను “యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదు నని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను” మరియు ప్రతి ఒక్కరిని అట్టి నిబంధనకు ఒప్పుకొనజేసెను (2 దినవృత్తాంతములు 34:31-32I). అప్పుడు యోషీయా దేశం ఎన్నడూ అనుభవించని ఘనమైన పస్కాపండుగను నిర్వహించాడు. ఎంత అద్భుతమైన విధేయత!
ప్రపంచం మొత్తం దేవుణ్ణి ఆరాధించడం మరియు గొర్రెపిల్లను కీర్తించడం మీరు ఊహించగలరా? మీరు చాలా అసాధారణమైన దానిలో భాగమైయ్యేందుకు మీకు ఆరాటం లేదా?
మీరు ఆరాటపడవచ్చు!
యోషీయా బైబిల్‌పరంగా ఆలోచించి పనిచేయడానికి నిర్ణయించుకోకపోతే యూదా సంస్కరణను చూసుండేవాడుకాదు. అలాగే యెదీదా తన కుమారునికి దైవిక సత్యాన్ని బోధించకపోతే అతను ఈ విధంగా చేసి ఉండేవాడు కాదు.
మన రోజువారీ విశ్వాసం ద్వారా మన ఆలోచనలను దేవునితో సమలేఖనం చేయడం-బైబిల్ ప్రకారం పనిచేయడానికి బైబిల్‌పరంగా ఆలోచించడం . . . దేవుని ప్రణాళికల్లో మన పాత్రను నెరవేర్చడం ద్వారా అద్భుతం జరుగుతుంది!
ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్‌లో, మేము దేవుని ఆదేశాలను పాటించడం పట్ల మక్కువ చూపుతాము. అందుకే మేము విజన్ 195ని అభివృద్ధి చేసాము—మొత్తం 195 దేశాలకు వెళ్లి “సమస్త జనులను శిష్యులనుగా” చేయాలనేదే మా ప్రణాళిక (మత్తయి 28:19). ఇంటర్న్‌షిప్‌లు, శిక్షణా కేంద్రాలు మరియు అనువాద వనరులు మరియు ప్రసారాలతో, మేము ప్రతి దేశంలోని వ్యక్తులను వారి సంఘాల్లో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి, బోధించడానికి మరియు జీవించడానికి సన్నద్ధం చేస్తున్నాము. ఫలితం? ప్రపంచవ్యాప్త ఆరాధన!
ఖచ్చితంగా అసాధారణమైనది!
దీన్ని మేము ఒంటరిగా చేయలేము. మాతో బైబిల్‌పరంగా ఆలోచించి, ప్రవర్తించే విశ్వాసుల నమ్మకమైన “బృందం” మాకు అవసరం. ఈ నెలలో ప్రత్యేకించి, గొప్ప ఆజ్ఞ యొక్క చర్చించలేని ఆదేశాలను అమలు చేయడానికి అవసరమైన ఆర్థిక వనరులను కలిగి ఉండటానికి మరియు సహాయం చేయడానికి మాకు మద్దతుదారులు అవసరం.
మీరు మాతో కలుస్తారా? ఖచ్చితంగా అసాధారణమైనది ఏదో జరుగుతోంది మరియు మీరు దానిలో భాగం కావచ్చు.