యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు?
నీ పరిశుద్ధపర్వతముమీద నివసింపదగిన వాడెవడు?
యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు
హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. (కీర్తన 15:1-2)
1 రాజులు 11:1-6 చదవండి.
మార్క్ ట్వైన్ ఇలా అన్నాడు, “ప్రతిఒక్కరూ చంద్రుడిలాగే ఉంటారు ఎందుకంటే ఎవరికీ ఎప్పటికీ చూపించని చీకటి కోణాన్ని అతను కలిగి ఉంటాడు.”1 వంచనతోకూడిన జీవితం మీ ఇంట్లో, లేదా నా ఇంట్లో లేదా ఏ ఇంట్లోనైనా జరగవచ్చు . . . వైట్ హౌస్‌లో కూడా జరుగవచ్చు. ఒక టెలివిజన్ షో జరిగే సెట్ లాగా,తెర వెనుక, కెమెరా వెళ్లని చోట, జీవితం ప్లాస్టిక్, లోహము మరియు కలపతో కూడిన గజిబిజి యంత్రాంగంగా ఉంటుంది-మోసపుచ్చే పనికిమాలిన రూపము-చౌకైన వస్తువులతో కలిసి ఉంటుంది.
మొదటి రాజులు 11వ అధ్యాయం రాజైన సొలొమోను పతనానికి సంబంధించిన కథను చెబుతుంది, దేవుడు అతనిపై జ్ఞానం, విజయం మరియు అద్భుతమైన సంపదను కురిపించాడు. అతను ధనవంతుడైనప్పటికీ, అతను ప్రభువుతో తన సంబంధాన్ని జారవిడుచుకున్నాడు మరియు అతను ఒక పాపాత్ముని వలె జీవించడం ప్రారంభించాడు.
విజయం మనిషిని నాశనం చేస్తుందని చాలామంది అంటారు. ఆ వ్యక్తి ఎవరనేది విజయం వెల్లడిస్తుందని నేను చెప్తున్నాను. విజయం వ్యక్తిత్వాన్ని నాశనం చేయదు; అది వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తుంది.
సొలొమోను నలభై సంవత్సరాల పాలనలో, దేశం యొక్క సంపద పెరుగుతూనే ఉంది.
దావీదు దూకుడైన సైనిక చర్యతో శాంతిని సాధించాడు మరియు బెదిరింపులకు వ్యతిరేకంగా దేశంలోని పన్నెండు తెగలు ఐక్యంగా ఉన్నాయి. దావీదు యొక్క సైనిక శక్తి మరియు సొలొమోను యొక్క తెలివైన దౌత్యం కారణంగా చుట్టుపక్కల రాజ్యాలు ఇశ్రాయేలును ఎంతో గౌరవించాయి.
సొలొమోను రాజ్యానికి ముప్పు లోపల నుండే వచ్చిందనటంలో ఆశ్చర్యమేమీ లేదు. తన తండ్రి దావీదు లాగా, సొలొమోను ఒకటి కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఆ భార్యలు చివరికి అబద్ధ దేవుళ్లకు ఆరాధనా స్థలాలు నిర్మించేలా అతన్ని నడిపించారు, ఆపై వారితో కలిసి విగ్రహారాధనలో పాల్గొనేలా ప్రలోభపెట్టారు.
చుట్టుపక్కల ఉన్న అన్య దేశాలకు సాక్షిగా దావీదు రాజవంశాన్ని దేవుడు స్థాపించాడు, అయినప్పటికీ అతని మనవడు రెహబాము సింహాసనాన్ని అధిష్టించే సమయానికి, వాగ్దాన భూమి విభజించబడిన రాజ్యంగా మారింది.
ప్రజల మనిషి, రెహబాము—ఒక టెలివిజన్ వేదిక వలె, ప్రేక్షకుల యెదుట—యథార్థంగా కనిపించాడు. తెరవెనుక చూస్తే నిర్లక్ష్యపు వంచన బయటపడింది. అర్థం చేసుకోండి, రెహబాము ముందునుంచి ఆ విధంగానే ఉన్నాడు. మిల్కోము మరియు మోలెకుల ఆరాధకునిగా, విగ్రహారాధకునిగా ఉండటానికి, “అమ్మోనీయురాలైన” అతని తల్లి నయమా చేత అతను పెంచబడ్డాడు. అతని తండ్రి, సొలొమోను, నిజమునకు దేవుళ్లు కానివారికి దేవాలయాలను నిర్మించడం ద్వారా విగ్రహారాధనను అంగీకరించాడు.
2 దినవృత్తాంతములు 11:18-23లో, మనకు మరో కోణం కనిపిస్తుంది. తెరవెనుక, రెహబాము తన తండ్రి మరియు తాత చేసినట్లే చేసాడు, అంతఃపురాన్ని నిర్మించాడు, అతను దేవుని పట్ల స్థిరమైన భక్తిని కలిగి ఉన్నాడని ప్రజల అభిప్రాయాన్ని కొనసాగించాడు. అతను తన కుమారులకు చీకటి వారసత్వాన్ని అందిస్తూనే అతను ప్రజల్లో మంచిపేరు సంపాదించుకున్నాడు. రెహబాము తన దేశీయ విధానాన్ని రూపొందించేటప్పుడు తెలివైన ఆలోచనను వెతుకుతున్నట్లు కనిపించడంతో తన పేరును మెరుగుపరచుకున్నాడు. అయితే అతను సురక్షితంగా ఉన్నాడని భావించిన వెంటనే, నిజమైన రెహబాము బయటపడ్డాడు. రెహబాము తన తోటివారి ఆలోచనకు అనుకూలంగా పెద్దల ఆలోచనను తిరస్కరించాడు. అతను ఆలోచన కోరలేదు; అతను వాదమును కోరాడు.
అతని జీవితపు చివరి దశలో, ప్రజల్లో తనకున్న మంచిపేరుకు ఆసరాగా ఉన్న కపటత్వాన్ని బహిర్గతం చేయడంతో రెహబాము యొక్క మోసపూరితమైన రూపం బద్దలైపోయింది. తన మతభ్రష్టత్వం కారణంగా రాజ్యం యొక్క సంపదను ఐగుప్తు దేశం దొంగిలించినప్పుడు, రెహబాము బంగారు కవచాలను కాంస్యంతో భర్తీ చేశాడు, బంగారంలా మెరిసేలా మెరుగుపెట్టాడు, కానీ పోల్చిచూస్తే ఏమాత్రం విలువ లేదు. మంచిపేరు కోసం ప్రాకులాడే రాజు ఎవరికీ నిజం తెలియకూడదని వాటిని రహస్యంగా దాచిపెట్టాడు–ఎంతో మూర్ఖంగా ప్రవర్తించిన తర్వాత నీఛమైన ప్రత్యామ్నాయం చేసాడు.
పాత నిబంధన అంతటా మనం చూస్తాము, “ఏమి విత్తితే అదే కోస్తాము”- ఇంద్రియలోలుపతకు సంబంధించిన ఆశ అనేది తమ హృదయాలలో కామం కలిగిన పిల్లలను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఒకటి లేదా రెండు తరములలో, రాజీ యొక్క చిన్న విత్తనం పూర్తిగా వికసించిన సిగ్గులేని తిరుగుబాటుగా పెరిగింది. నేను దానిని డొమినో ప్రభావం అని పిలుస్తాను. దావీదు యొక్క రాజీ సొలొమోను బలహీనపరిచింది. సొలొమోను పాపం రెహబామును ప్రభావితం చేసింది. చివరికి అమ్మ ప్రేమించి నాన్న అనుమతించిన పాపం కుమారుని చిక్కుల్లో పడేసింది. సత్యం పట్ల ప్రేమ కంటే వేషధారణే రెహబాము జీవితాన్ని నిర్వచించింది.
ఇప్పుడు ఇక్కడ కఠినమైన ప్రశ్న ఉంది: మీ కుటుంబం ఏమి చూస్తుంది? పాపం యొక్క పరిణామాలను మీరు నిర్వహించగలరని ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? మీరు ప్రభావితం చేసే వ్యక్తులపై-ముఖ్యంగా మీ పిల్లలపై మీ పాపం యొక్క ప్రభావాన్ని మీరు పరిగణించారా? మేము మీ జీవితంలోని తెర వెనుక జరిగేదాన్ని కెమెరాల్లో చూపిస్తే, మేము ఏమి చూస్తాము?
- Mark Twain, Following the Equator, A Journey Around the World, Vol. 2 (New York: P. F. Collier & Son, 1899), 237.
Adapted from Charles R. Swindoll, Fascinating Stories of Forgotten Lives (Nashville: W Publishing Group, 2005), 169-185. Used by permission.