Wమీరు శోధన గుండా వెళుతున్న వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు, మీరు ఇలా ఆలోచిస్తున్నారా: నేను నిజంగా కష్టపడుతున్న ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నాను, కానీ వారికి ఎక్కువగా ఏమి కావాలి? మానవులుగా, మన కష్ట సమయాల్లో మనకు సహాయం చేయడానికి మన జీవితంలో ఈ క్రింది లక్షణాలు మనందరికీ అవసరం. నమ్మకం: మన ప్రవర్తనలు, భావాలు, ప్రతిచర్యలు, భావోద్వేగాల ప్రదర్శనలు మరియు పనితీరులో కొరత వంటి వాటిపై ఒక అభిప్రాయానికి వచ్చేయకుండా ఇతరుల నుండి అంగీకారం మరియు విలువను మనం […]
Read MoreCategory Archives: Leadership-Telugu
నాయకుడు పడిపోయినప్పుడు ఏమి చేయాలి
దేవుని పని పవిత్రమైనది. కాబట్టి పరిచర్యలో నిమగ్నమైన వ్యక్తి దేవుని ఉన్నతమైన మరియు పవిత్రమైన ప్రమాణాలను పదేపదే ధిక్కరించినప్పుడు, ఆ వ్యక్తి తొలగించబడాలి. అపొస్తలుడైన పౌలు యొక్క తీర్పు మరియు ఆజ్ఞ రాజీలేనివి. దేవుని పని పవిత్రంగా ఉండడానికి కారణం ఆయన పరిశుద్ధుడు కావడమే. పరిచర్య చేసేవారు కొన్ని వైఫల్యాలు లేకుండా ఎప్పటికీ అలా చేయలేరు, ఎందుకంటే వారు ఆయన వలె పవిత్రులు కారు. అయితే, ఆ బలహీనతలను క్షమించడానికి దేవుని దయ సరిపోతుంది. కానీ పవిత్రమైన […]
Read Moreబాధపడే ప్రజలకు నేను ఏమి చెప్పాలి
మీరు సంక్షోభంలో ఉన్న స్నేహితుడిని చేరుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా, కానీ ఏమి చెప్పాలో మీకు ఖచ్చితంగా తెలియదా? మనలో చాలా మంది ఆ వ్యక్తిని లేదా పరిస్థితిని పూర్తిగా నివారించడం లేదా హడావిడి చేసి చాలా ఎక్కువ మాట్లాడటం వంటివి చేస్తాము. దిగువ జాబితా మీరు అవసరమైన వ్యక్తులకు సమర్థవంతంగా సహాయం చేయగల కొన్ని మార్గాలను ప్రతిపాదిస్తుంది. ఎవరికీ తీర్పు తీర్చకుండా లేదా అనవసరమైన సలహాలను ఇవ్వకుండా ఈ ప్రతిస్పందనలు ఆ వ్యక్తి యొక్క భావాలను ఎలా […]
Read Moreస్వస్థపరచు సంఘము యొక్క పది ముఖ్యమైన లక్షణాలు
మీరు ఎప్పుడైనా చీకటిలో మీ ఇంటిలో నడుస్తుండగా సోఫాకి తగిలి మీ కాలి బొటనవేలు నలిగిందా? ఆ చిన్న బొటనవేలు, మీరు ఎప్పుడూ పట్టించుకోనిది, నొప్పితో కేకలు వేస్తూ ఎగిరి గంతులు వేస్తూ ఉన్నందున ఒక్కసారిగా మీరు దానిపై దృష్టి కేంద్రీకరిస్తారు–మరియు మీ శరీరం మొత్తం ఆ బాధను అనుభవిస్తుంది. అద్భుతం కదా–ఒక చిన్న అవయవము పురుషుడిని లేదా స్త్రీని కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుంది. సంఘము దాని సభ్యుల్లో ఒకరి జీవితంలో “ఎదురుదెబ్బ” తగిలినప్పుడు మన శరీరాలు […]
Read Moreతోబుట్టువుల సవాళ్లు
ప్రత్యేక అవసరాలు గల పిల్లల తోబుట్టువుల యొక్క అత్యంత సాధారణంగా నివేదించబడిన సవాళ్లు తమ సోదరుడు లేదా సోదరి వైకల్యంతో ఉన్నప్పుడు చాలా మంది తోబుట్టువులు ఇబ్బందిపడతారు. ఊహించని విధంగా సవాళ్లు ఎదురవుతాయి. సహాయం మరియు మార్గదర్శకత్వం ఎలా అందించాలో తల్లిదండ్రులకు తెలియదు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తోబుట్టువులకు సహాయం చేయడానికి మొదటి అడుగు అత్యంత సాధారణ సవాళ్లు ఎక్కడ ఎదురవుతాయో తెలుసుకోవడం. ఇక్కడ మొదటి పది ఉన్నాయి: నిర్లక్ష్యం చేయబడతారు: వికలాంగులైన తమ సోదరుడు […]
Read Moreగుహలు
మీరు ఇలాంటి ప్రకటనకు వ్యతిరేకంగా వాదించాలనుకున్నప్పటికీ, మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా అందులో ఒక ఉద్దేశం ఉన్నది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను పెంచడం, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న యౌవనస్థునికి మార్గదర్శకత్వం చేయడం లేదా వ్యక్తిగత దీర్ఘకాలిక బాధను భరించడం వంటివాటిలో చాలామంది ఏకాంత మార్గము గుండా వెళతారు, దీనిని నేను “గుహ” అని పిలుస్తాను. “గుహ” ను ఒక దృశ్యముగా భావించండి. మీరు దానిని ఎలా వర్ణిస్తారు? నేను చుట్టూ పదునైన […]
Read Moreనిర్లక్ష్యముగల వంచకుడు
యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధపర్వతముమీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. (కీర్తన 15:1-2) 1 రాజులు 11:1-6 చదవండి. మార్క్ ట్వైన్ ఇలా అన్నాడు, “ప్రతిఒక్కరూ చంద్రుడిలాగే ఉంటారు ఎందుకంటే ఎవరికీ ఎప్పటికీ చూపించని చీకటి కోణాన్ని అతను కలిగి ఉంటాడు.”1 వంచనతోకూడిన జీవితం మీ ఇంట్లో, లేదా నా ఇంట్లో లేదా ఏ ఇంట్లోనైనా జరగవచ్చు . . . వైట్ హౌస్‌లో […]
Read Moreమార్గదర్శకుని యొక్క శాశ్వతమైన విలువ
ఆరుగురి సమూహమైన మేము అక్కడ కూర్చున్నాము. మా బల్ల మధ్యలో ఒక నారింజ రంగు కొవ్వొత్తి వెలుగుతుండగా, మా ముఖాల మీద నీడలు కమ్ముకుంటున్నాయి. ఒకరు మాట్లాడుతున్నారు; ఐదుగురు వింటున్నారు. ప్రతి ప్రశ్న ఎంతో సౌమ్యతతో, ఎంతో నెమ్మదిగా నిర్వహించబడింది-ప్రతి సమాధానం లోతైన వివేకం నుండి తీయబడింది, కఠినమైన నిర్ణయాల ద్వారా రూపం ఏర్పరచబడింది, కాలముచేత బోధించబడింది. అలాగే బాధ. అలాగే తప్పులు మరియు నిందలు. పరీక్షలు, సంకటములు, హృదయవిదారకములు మరియు వైఫల్యాల ద్వారా మెరుగుపరచబడ్డాయి. అతి […]
Read Moreగొప్పతనం యొక్క చీకటి కోణం
“ప్రపంచం చూసిన మనుషుల్లో అత్యంత పరిపూర్ణమైన పాలకుడు అక్కడ ఉన్నాడు . . . [మరియు] ఇప్పుడు అతను వేరే లోకానికి చెందినవాడు.” ఇది ఎవరి గురించి చెప్పబడింది? కైసరుల గురించా? కాదు. నెపోలియన్? కాదు. అలెగ్జాండర్ ది గ్రేట్? కాదు. ఐసెన్‌హోవర్? పాటన్? మాక్‌ఆర్థర్. . . లేదా గ్రాంట్ లేదా లీ లేదా పెర్షింగ్ వంటి మునుపటి సైనిక వ్యూహకర్తా? కాదు, వీళ్లెవరూ కాదు. రాక్నే లేదా లోంబార్డి గురించా? కాదు. లేక లూథర్? […]
Read Moreఆత్మీయ నాయకత్వం
నాయకత్వం ప్రభావితం చేస్తుంది. మనం ఇతరులను ప్రభావితం చేసేంత మేరకు వారిని నడిపిస్తాం. లార్డ్ మోంట్‌గోమెరీ దీనిని సూచిస్తూ ఈ విధంగా వ్రాశాడు . . . నాయకత్వం అనేది పురుషులు మరియు స్త్రీలను ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం సమీకరించే సామర్థ్యం మరియు సంకల్పం అలాగే విశ్వాసాన్ని ప్రేరేపించే స్వభావం కలిగియుండటం. ఈ విధంగా చేసిన చాలా మంది గొప్ప వ్యక్తులను, అనగా సైనిక సిబ్బంది, అథ్లెటిక్ కోచ్‌లు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వర్తకులు లేదా […]
Read More