మీరు ఎప్పుడైనా చీకటిలో మీ ఇంటిలో నడుస్తుండగా సోఫాకి తగిలి మీ కాలి బొటనవేలు నలిగిందా? ఆ చిన్న బొటనవేలు, మీరు ఎప్పుడూ పట్టించుకోనిది, నొప్పితో కేకలు వేస్తూ ఎగిరి గంతులు వేస్తూ ఉన్నందున ఒక్కసారిగా మీరు దానిపై దృష్టి కేంద్రీకరిస్తారు–మరియు మీ శరీరం మొత్తం ఆ బాధను అనుభవిస్తుంది. అద్భుతం కదా–ఒక చిన్న అవయవము పురుషుడిని లేదా స్త్రీని కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుంది.
సంఘము దాని సభ్యుల్లో ఒకరి జీవితంలో “ఎదురుదెబ్బ” తగిలినప్పుడు మన శరీరాలు స్పందించినట్లుగా ఎందుకు స్పందించరో అని నేను ఆశ్చర్యపోతున్నాను? సంఘాన్ని వర్ణించడంలో బైబిల్ శరీరం యొక్క రూపకాన్ని ఉపయోగించింది (కొలొస్సయులకు 1:18), మరియు పౌలు మనకు “సంతోషించు వారితో సంతోషించుడి; ఏడ్చువారితో ఏడువుడి” (రోమా 12:15-16) అని ఆజ్ఞాపించాడు. మన భౌతిక శరీరాలకు నొప్పి కలిగినప్పుడు మరియు విరిగిపోయినప్పుడు, మొత్తం శరీరం-ప్రతి అవయవం-స్వస్థత కోసం కేకలు వేస్తాయి. ఇది క్రీస్తు శరీరమైయున్న సంఘము విషయంలో నిజం కావాలి.
మీ స్థానిక సమూహం ఎలా పని చేస్తోంది-ఇది సభ్యుల బాధను అనుభవిస్తూ వారికి స్వస్థతనివ్వటానికి ప్రయత్నిస్తుందా? మీరు మీ సంఘ శరీరాన్ని సున్నితత్వం మరియు స్వస్థపరిచే ప్రదేశంగా మార్చాలనుకుంటే, విజయవంతమైన సంరక్షించే సహాయక వ్యవస్థ కొరకు ఈ క్రింది 10 లక్షణాలు అవసరం. ఇందులో పాలుపొందేవారు తప్పనిసరిగా ఇవి కలిగి ఉండాలి:
- సేవ చేయాలనే సంకల్పం
- ముఖ్యమైన వాటిపై దృష్టి
- విలువను తెలియజేయడానికి నిబద్ధత (మీది, ఇతరులది, దేవునిది)
- ఆరోగ్యకరమైన సరిహద్దులు
- భావోద్వేగ సామర్థ్యం
- ఇతర వ్యక్తుల అవసరాలపై అవగాహన
- ఆధ్యాత్మిక అంతర్దృష్టి
- ఇతరుల అంగీకారం/గౌరవం
- స్థిరత్వం
- వినయం
మీరు మీ స్థానిక సంఘంలో సేవను కొనసాగించేటప్పుడు ఈ 10 లక్షణాలకు సంబంధించి మీ సంఘ శరీరం యొక్క ఆరోగ్యం గురించి మీరు లేదా మీ పాస్టర్లు మరియు సంఘ నాయకులు చర్చించాలని నేను సూచించాలనుకుంటున్నాను. మీ సున్నితత్వం మరియు కరుణ అనేవి మొత్తంగా క్రీస్తు శరీరానికి ఒక ఆశీర్వాదంగా ఉండునుగాక.