బాధపడే ప్రజలకు నేను ఏమి చెప్పాలి

మీరు సంక్షోభంలో ఉన్న స్నేహితుడిని చేరుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా, కానీ ఏమి చెప్పాలో మీకు ఖచ్చితంగా తెలియదా? మనలో చాలా మంది ఆ వ్యక్తిని లేదా పరిస్థితిని పూర్తిగా నివారించడం లేదా హడావిడి చేసి చాలా ఎక్కువ మాట్లాడటం వంటివి చేస్తాము. దిగువ జాబితా మీరు అవసరమైన వ్యక్తులకు సమర్థవంతంగా సహాయం చేయగల కొన్ని మార్గాలను ప్రతిపాదిస్తుంది. ఎవరికీ తీర్పు తీర్చకుండా లేదా అనవసరమైన సలహాలను ఇవ్వకుండా ఈ ప్రతిస్పందనలు ఆ వ్యక్తి యొక్క భావాలను ఎలా గుర్తిస్తున్నాయో మరియు ప్రతిబింబిస్తున్నాయో గమనించండి.

సమర్థవంతమైన సంరక్షకులు ఏమి చెబుతారు

  1. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నేను ఊహించలేను. నన్ను క్షమించండి.
  2. ఈ పరిస్థితిని అంగీకరించడం చాలా కష్టంగా ఉండి ఉండాలి.
  3. నీ కోసం నేను ఉన్నాను. నీకు ఏదైనా సహాయం కావాలా?
  4. మీ పిల్లలు దీన్ని ఎలా భరిస్తున్నారు? వారికి కావాల్సింది ఏమైనా ఉందా?
  5. నేను మీతో క్రమం తప్పకుండా కనెక్ట్‌యై ఉంటాను. ఏ అవసరం వచ్చినా సహాయం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను.

సమర్థవంతమైన సంరక్షకులు ఏమి చెప్పరు

  1. దేవుడు మనం నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ ఇవ్వడు; మీరు చాలా ధైర్యంగా ఉండాలి.
  2. బహుశా అలా అయితే ఇది జరిగి ఉండేది కాదేమో . . .
  3. దేవుడు మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా?
  4. మీకు తెలుసా, ఇప్పటికే కొన్ని నెలలు గడచిపోయాయి; మీరు ఇప్పుడు దీనిని అధిగమించాలనుకోవటం లేదా?
  5. మీరు పునరుజ్జీవం పొందుకోవాలని నేను భావిస్తున్నాను. ఖాళీగా ఉండడం కంటే ఏదోయొక పనిచేసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను.

భారమైన హృదయాల కోసం మృదువైన మాటలు

బాధపడే వారితో మాట్లాడటానికి నేను సిఫార్సు చేసిన ఐదు పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. వాస్తవానికి, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ఈ రచనలలో రచయితలు చెప్పే ప్రతిదానిని ఆమోదించదు, కాబట్టి జ్ఞానం మరియు వివేచనతో వీటిని మరియు అన్ని ఇతర బైబిలేతర వనరులను సంప్రదించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

The Art of Condolence: What to Write, What to Say, What to Do at a Time of Loss by Leonard M. Zunin and Hilary Stanton Zunin

Don’t Ask for the Dead Man’s Golf Clubs: What to Do and Say (and What Not to) When a Friend Loses a Loved One by Lynn Kelly

The Etiquette of Illness: What to Say When You Can’t Find the Words by Susan P. Halpern

Healing Conversations: What to Say When You Don’t Know What to Say by Nance Guilmartin

When Words Matter Most: Thoughtful Words and Deeds to Express Just the Right Thing at Just the Right Time by Robyn Freedman Spizman

Posted in Church-Telugu, Crisis-Telugu, Encouragement & Healing-Telugu, Leadership-Telugu, Parenting-Telugu, Pastors-Telugu, Special Needs-Telugu.

Colleen Swindoll Thompson holds a bachelor of arts degree in Communication from Trinity International University as well as minors in psychology and education. Colleen serves as the director of Reframing Ministries at Insight for Living Ministries. From the personal challenges of raising a child with disabilities (her son Jonathan), Colleen offers help, hope, and a good dose of humour through speaking, writing, and counselling those affected by disability. Colleen and her husband, Toban, have five children and reside in Frisco, Texas.

కొలీన్ స్విన్డాల్ థాంప్సన్ ట్రినిటీ ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయం నుండి కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీతో పాటు మనోవిజ్ఞానశాస్త్రము మరియు ఎడ్యుకేషన్లో అనుబంధ జ్ఞానం కలిగి ఉన్నారు. కొలీన్ ఇన్సైట్ ఫర్ లివింగ్ వద్ద రిఫ్రామింగ్ మినిస్ట్రీస్ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. దివ్యాంగుడైన పిల్లవాడిని (ఆమె మూడవ బిడ్డ, యోనాతాను) పెంచే వ్యక్తిగత సవాళ్ళ దగ్గర నుండి, కొలీన్ సహాయం, నిరీక్షణ మరియు వైకల్యంతో బాధపడుతున్నవారికి మాటలతో, వ్రాతలతో మరియు సలహా ఇవ్వడంతో మంచి హాస్యాన్ని అందిస్తుంది. కొలీన్ మరియు ఆమె భర్త, టోబన్ కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారు టెక్సాస్ లోని ఫ్రిస్కోలో నివసిస్తున్నారు.