చింత

గందరగోళాన్ని ప్రశాంతత్వంగా మార్చండి

మీరు పనిలో ఒత్తిడితో కూడిన రోజును గడిపినప్పుడు, సాధారణంగా మీ మనస్సును తేలికగా ఉంచడానికి నడకో లేక కొంత ఉపశమనాన్ని యిచ్చే సంగీతమో సరిపోతుంది. కానీ భవిష్యత్తు గురించి కొనసాగుతున్న ఆందోళన లేదా ఒత్తిడితో కూడిన వ్యాకులము అంత తేలికగా కొట్టివేయబడదు. కొన్ని సందర్భాల్లో, మనస్సులో నాటుకుపోయిన ఆందోళన మరియు భయం యొక్క భావాలు సంవత్సరాలుగా సమర్థంగా ఎదుర్కొన్న పద్ధతులు మరియు లోతుగా పొందుపరిచిన పూర్వీకుల నమూనాలను ప్రతిబింబిస్తాయి.

సోమర్స్ రోచె ఒకసారి ఇలా అన్నాడు, “ఆందోళన అనేది మనస్సు నుండి మెల్ల మెల్లగా పడే భయం యొక్క సన్నని ప్రవాహం. ప్రోత్సహించినట్లయితే, ఇది ఇతర ఆలోచనలన్నిటినీ ఇంకిపోజేసే విధముగా ద్వారమును తెంచుతుంది.” అందుకే అలాంటి అలవాట్లను రాత్రికి రాత్రే జయించలేము. మనము దేవుని వాక్యానికి మనస్ఫూర్తిగా సమర్పించుకున్నప్పుడు దేవుని ఆత్మ మన మనస్సులను మారుస్తాడు.

కొరీ టెన్ బూమ్ చాలా తెలివిగా చెప్పినట్లుగా, “రేపు విచారములు ఏమియు లేకుండా చింత చేయదు. ఇది ఈ రోజు బలాన్ని నిరర్థకం చేస్తుంది.” ఈ వనరులు మీ ప్రస్తుత దృక్పథానికి బలాన్ని తిరిగి ఇస్తాయని మరియు మీ చింతగల ఆలోచనలను నమ్మకంగా జీవించుటకు మార్చుటలో దేవుని సహాయం కోరినప్పుడు మీకు నిజమైన నిరీక్షణను అందిస్తాయని మా ఆశ.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి