ప్రతి రాత్రి 1:00 a.m. గంట వస్తుంది, కాని నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక 1:00 a.m. ఉంది. మీరు బాగా నిద్రపోతున్నప్పుడు, నేను గుడ్లు మిటకరిస్తూ మరీ మేల్కొని ఉన్నాను. . . పిచ్చివానిలా దేవునితో మాట్లాడుచున్నాను!
నేను ఒక చిన్న జంట-ఇంజిన్ విమానంలో అనుభవజ్ఞుడైన పైలట్‌తో ఉన్నాను, గంటకు 200 మైళ్ల వేగంతో పొగమంచు, దట్టమైన మేఘావృతం ద్వారా వేగంగా ఆ విమానం దిగుతున్నది. పైలట్ ఎంతో ఆనందముతో ఆస్వాదిస్తున్నాడు . . . కానీ, నిజంగా, నేను చాలా భయపడ్డాను! ఒకానొక సమయంలో అతను నా వైపు చూస్తూ, నవ్వుతూ, “హే, చక్, ఇది అద్భుతముగా లేదూ?” అని అన్నాడు.
నేను ప్రార్థన చేసుకుంటున్నాను గనుక నేను సమాధానం చెప్పలేదు.
మా ఒంటరి విమానం మేఘావృతమైన, తెల్లవారుజామున ఆకాశం గుండా వెళుతున్నప్పుడు, నాకు తెలిసిన ప్రతి వాక్యమును సింహావలోకనం చేసుకొని, నేను చేసిన ప్రతి తప్పును ఒప్పుకున్నాను. ప్రధాన రహదారి బాగా రద్దీగా ఉన్నప్పుడు రెండు వందల మైళ్ళ వేగంతో కారు దూసుకొస్తూ దాని ముందు అద్దం తెల్లటి దుప్పటిచేత కప్పబడి, చెవులు పగిలిపోయేంత శబ్దముతో రేడియో మొగుతుంటే ఎలా ఉంటుందో, ఆ రోజు ఆ చిన్న విమానంలో నా ప్రయాణ అనుభవాన్ని ఇలా పోల్చవచ్చు.
నా సహచరుడు విమానంలో నిజంగా ఎంత సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాడో నేను నమ్మలేకపోయాను. అతని ప్రయాణీకుడి పదివేళ్ళ గోళ్ళు సీటు కుషన్లోకి పాతుకొనిపోయాయి. మా చుట్టూ ఉన్న తెల్లటి పొగమంచు దుప్పటి గుండా దేనికోసమో-ఏదోయొకదానికోసం- చాలాసేపు తేరిచూచాను. మా విమాన రికార్డు ఆ భయగ్రస్త సోమవారం ఉదయం ఆ ప్రయాణంలో ఇద్దరు ప్రయాణీకులను సూచించి ఉండవచ్చు, కాని అందులో కనీసం ముగ్గురు ఉన్నారని నేను రూఢిగా చెప్పగలను. భయము అని పిలవబడే ఒక లొంగని జీవి మరియు నేను ఒకే సీటును పంచుకున్నాము.
భయం. ఎంత భయంకర స్వరూపం గలది! తెలియని మరియు కనిపించని వారి యొక్క రక్తము కారుతున్న మంగలకత్తి వంటి పదునైన గోళ్ళు. గుచ్చుకొను స్వరము, విచారము కలిగించు వికృతమైన, వినాశకరమైన మాటలతో అరవటం. భయం యొక్క చాలా ప్రకటనలు, “ఒకవేళ . . . ?” అని నిశ్శబ్దంగా ప్రారంభమై, “. . . పశ్చాత్తాపపడతావు!” అని బిగ్గరగా ముగుస్తుంది. దాని భయంకరమైన శ్వాస యొక్క పెనుగాలి పరిశుద్ధులను నిరాశావాదులనుగా మార్చేస్తుంది.
భయం మన మొత్తం మనస్సును తలక్రిందులను చేస్తుంది. దాని కాటు పక్షవాతం కలుగజేయు విషమును మన నరాల్లోనికి ప్రసరింపజేస్తుంది. అప్పుడు సందేహం మన దృష్టిని మందగింపజేయుటకు ఎంతో సమయం పట్టదు. మనము పడిపోతున్నప్పుడు, భయం ఒక భారీ ట్యాంక్ బరువుతో మన ముఖం మీద అడుగులు వేస్తుంది . . . మరియు మరొకసారి దూకడానికి సిద్ధమవుతున్నప్పుడు మన బలహీనమైన స్థితిని చూసి నవ్వుతుంది.
ఈ మృగాన్ని ఎప్పుడైనా కలుసుకున్నారా? ఖచ్చితంగా కలుసుకున్నారు. ఇది అన్ని ఆకారాల్లోను, అలాగే ప్రతి పరిమాణంలో వస్తుంది. ఓటమి భయం. ఎత్తంటే భయం. జనసమూహమంటే భయం. వ్యాధి మరియు మరణమంటే భయం. తిరస్కరణ అనే భయం. నిరుద్యోగమనే భయం. మీ గురించి ఇతరులు ఏమి చెప్పుకుంటున్నారో అనే భయం. తెలిసినవారిని విడిచిపెడతారేమోననే భయం. విపత్తు లేదా లోతు లేదా దూరం యొక్క భయం. ఇతరులను నమ్మాలంటే భయం. మీరు మీరుగా ఉండాలంటే భయం. కొనడానికి భయం. అమ్మడానికి భయం. ఆర్థికంగా నాశనమైపోతామేమోననే భయం. యుద్ధమంటే భయం. తెలియనిదాని గురించి భయం.
ప్రతి ఊహించదగిన మూలలో, భయం నీడలో దాగి ఉంటుంది. మీ అంతరంగ శాంతిని మరియు బాహ్య సమతుల్యతను విషపూరితం చేయడానికి ప్రణాళిక వేస్తూ ఉంటుంది. జగడాలమారి కావడం వలన, ఇది భయపెట్టే వ్యూహాలు మరియు ఆశ్చర్యకరమైన దాడులపై ఆధారపడుతుంది. ఇది మీకు హాని కలిగించే క్షణాల కోసం చూస్తుంది, ఆపై మీ హృదయాన్ని రక్షించే తాళాన్ని ఎంచుకుంటుంది. భయం దాడి చేసినప్పుడు, ఇది మీ ఆత్మీయ కండరాలను మానసికంగా ఆలోచించలేని స్థాయికి తగ్గించేస్తుంది. ఒకసారి దాని బారిన పడిన తరువాత, రోగ నిరూపణ ప్రకాశవంతంగా లేదా ఉల్లాసంగా ఉండదు.
దావీదు యొక్క ఇరవై ఏడవ కీర్తన మనం ఆతురపడే చోట భయాన్ని తీసివేస్తుంది. తన కలం యొక్క విశాలమైన లావుపాటి కలము యొక్క విసురులతో, ఇశ్రాయేలు చక్రవర్తి మన ఎముకలలో ఇనుము వేస్తున్నాడు. అతను రెండు ప్రశ్నలతో తన ఇంటి తలుపు వద్ద భయాన్ని కలిశాడు:
నేను ఎవరికి భయపడుదును?
ఎవరికి వెరతును? (కీర్తన 27:1)
దావీదు ఆ తలుపును భయం యొక్క ముఖం మీద కొట్టి ఈ విధంగా ప్రకటించాడు:
నా హృదయము భయపడదు; . . .
దీనిలో నేను ధైర్యము విడువకుందును! (27:3)
దావీదు తిరిగి కుటుంబ గది, వంటగది లేదా మాస్టర్ బెడ్ రూమ్ లోకి నడుస్తూ, అనుదిన నమ్మకం యొక్క రహస్యాలను తనకు తాను గుర్తుచేసుకుంటూ ఈలలు వేసాడు:
యెహోవాయొద్ద అడిగితిని (27:4) | ప్రార్థన |
యెహోవా ప్రసన్నతను చూచుటకును (27:4) | దర్శనం |
ఆయన ఆలయములో ధ్యానించుటకును (27:4) | దేవుని వాక్యము |
ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును / నన్ను దాచును / నన్ను ఎక్కించును (27:5) | దేవుని రక్షణ |
నేను బలులు అర్పించెదను, అలాగే నేను పాడెదను (27:6) | క్షణక్షణ ఆరాధన |
సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న . . . యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము (27:13–14) | విశ్రాంతి |
నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము (27:14) | ధైర్యము |
ఓహ్, కాక్పిట్లో ఆ రాత్రి నాకు ఈ రహస్యాలు ఎలా అవసరం పడ్డాయి! నిజం చెప్పాలంటే, నాకు అంతకుముందు మరియు ఆ తరువాత చాలా రాత్రులు, రోజులు అవసరం పడ్డాయి. బహుశా మీకు కూడా ఉండవచ్చు. బహుశా అవి మీకు ఇప్పుడే అవసరం పడవచ్చు.
నేను మరో రహస్యాన్ని పంచుకుంటాను. మనలోని చాలా భయాలకు, వాటి నిర్దిష్ట లక్ష్యంతో సంబంధం లేకుండా, కారణం ఒక్కటే: భవిష్యత్తును గూర్చిన భయం. ఈ క్రింది ఆలోచనతో మన ప్రేగులు మథించుచున్నవి: ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు?
నేను మిమ్ములను వివరించుచున్నానా? ఒకటి చెప్పనా-మనం ఒకే సీటును పంచుకొని మార్పు కోసం విశ్రాంతి తీసుకోండి. తప్పకుండా, మీరు మీ సీట్ బెల్టును పెట్టుకోవాలనుకోవచ్చు. (మనము దిగే సమయానికి ఇది కొంచెం కరకుగా ఉంటుంది.) కానీ మీరు ఊపిరి పీల్చుకోవచ్చు. భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదు.
దేవుడు అప్పుడే అక్కడ ఉన్నాడు . . . మరియు శతాబ్దాల నుండి భయపెట్టే పొగమంచు వలన ఆయన రన్వేను ఎప్పుడూ తప్పిపోలేదు.
Copyright © 2016 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.