తీర్పు దినము

“జీవగ్రంథము” అనేది పాత నిబంధనలో లోతైన మూలాలు కలిగిన క్రొత్త నిబంధన భావన (నిర్గమకాండము 32:32-33; దానియేలు 12:12; మలాకీ 3:16). పాత నిబంధన కాలంలోని విశ్వాసులు పాత నిబంధనను ఘనపరచినందున, విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డారు. యేసు క్రొత్త నిబంధన ఆరంభించినప్పుడు, “మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి,” అని ఆయన తన శిష్యులతో చెప్పెను (లూకా 10:20). యేసు యొక్క ఇతర నమ్మకమైన పరిచారకులతో పాటు వారి పేరులు జీవగ్రంథములో వ్రాయబడినవని గుర్తుచేస్తూ పౌలు విశ్వాసులను ప్రోత్సహించాడు (ఫిలిప్పీయులకు 4:3), అలాగే “పరలోకమందు వ్రాయబడియున్న” వారిని సంఘము కలిగియున్నదని హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్త ప్రకటించాడు (హెబ్రీయులకు 12:23).

ఒక వ్యక్తి పేరు జీవగ్రంథములో నమోదు కావాలంటే, అతడు లేదా ఆమె తన స్వనీతి సరిపోతుందనే భావనను విసర్జించాలి. అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లుగా, “[ఒక వ్యక్తి] యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము; ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా” (గలతీయులకు 2:16). విశ్వాసులు-జీవగ్రంథములో ఎవరి పేర్లైతే వ్రాయబడినవో- వారి క్రియలమూలముగా ఎన్నడూ తీర్పు తీర్చబడరు మరియు ధవళమైన మహా సింహాసనము యొక్క తీర్పులోనికి రారు.

ప్రతి వ్యక్తి యొక్క మంచి మరియు చెడు క్రియలను వేరే గ్రంథములు నమోదు చేస్తాయని ప్రకటన 20:12 చెబుతుంది.

అంత్యకాలములో, ప్రతి వ్యక్తి జీవగ్రంథములోని విషయముచేతగాని లేదా తమ క్రియలను నమోదు చేస్తున్న గ్రంథముల సముదాయముచేత తీర్పు తీర్చబడతారు. జీవగ్రంథాన్ని తిరస్కరించడానికి మరియు ఇతర గ్రంథములలో నమోదు చేయబడిన క్రియలచొప్పున తాము తీర్పు తీర్చబడటానికి ఎవరికైనా యెంచుకునే అధికారం ఉన్నది. ఎటువంటి పాపములు లేకుండా, తమ మంచి క్రియలు మాత్రమే ఆ గ్రంథములో నమోదు చేయబడితే, ఆ వ్యక్తి పరలోకానికి అర్హుడు. అయితే, సంపూర్ణ నైతిక పరిపూర్ణతయే దేవుని ప్రామాణికము. ఒకవేళ ఒక్క పాపమైనా అక్కడ నమోదు చేయబడితే, అది ఎంత చిన్నదైనా సరే ఆయన కనుగొంటే, అగ్ని గంధకములుగల గుండములో నిత్య బాధయే శిక్షావిధి. దేవుని కుమారుడు తప్ప మరెవరూ పాపము లేకుండా జీవించలేదు (2 కొరింథీయులకు 5:21). మరియు మనమందరమూ భ్రష్ట స్వభావములతో నశించిన లోకములో జీవిస్తున్న మానవులము గనుక, ఎవ్వరూ ఎప్పటికీ పాపములేనివారుగా జీవించలేరు (రోమా 3:23).

అంత్యకాలానికి ఏ గ్రంథములో వ్రాసి ఉంచినది ఉపయోగించబడుతుందో ఎంచుకోవడానికి ఈ రోజు మనకు అవకాశం ఉంది. అయితే, మనం చనిపోతే మాత్రం పరిస్థితి చేయి దాటిపోయినట్లే. ప్రజలందరూ దేవుని ముందు నిలబడినప్పుడు-బహుమతులు పొందటానికి విశ్వాసులు, శిక్షను స్వీకరించడానికి ధవళమైన మహా సింహాసనమునొద్ద అవిశ్వాసులు-భూమిపై ఉన్నప్పుడు మనం ఎంచుకున్నదాని యొక్క పరిణామాలను ఆయన కొలుస్తాడు.

మనం నిత్యజీవమును ఎలా పొందుకుంటాము? ఒకటే మాట- క్రీస్తు.

మరి మనం ఎప్పుడు దాన్ని కోరుకోవాలి? మరలా, ఒకటే మాట- ఇప్పుడే.

ధవళమైన మహా సింహాసనం యొక్క తీర్పును వివరించడంలో యోహాను యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా కృపచేత దేవుని ఉచిత వరమైన రక్షణను తిరస్కరించడం ద్వారా కలిగే శాశ్వతమైన పరిణామాలను భీతిని పుట్టించే సరళతతోను యథార్థతతోను వెల్లడించాడు. ఈ నిర్ణయం వాయిదా వేయకూడదు, ఎందుకంటే రేపు సూర్యోదయానికి ముందే ఎవరి జీవితమైనా ముగిసిపోవచ్చు. తాను మరణించే సమయంలో, ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం ఎప్పటికీ ముద్రవేయబడుతుంది.

తెలివిగా ఎంచుకోండి.

 

మరణం తరువాత ఒక వ్యక్తికి ఏమి జరుగుతుంది?

“మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.” (హెబ్రీయులకు 9:27)

 

 

మరణించినప్పుడు శారీరక పునరుత్థానం తీర్పు శాశ్వత గమ్యము
క్రైస్తవుడు ఆత్మ-క్రీస్తు సన్నిధి
శరీరము-సమాధి
సంఘము ఎత్తబడినప్పుడు పునరుత్థాము జరుగును పరలోకములోని క్రీస్తు న్యాయపీఠము పరలోకరాజ్యము
పాత నిబంధన విశ్వాసి ఆత్మ-పరదైసు;
అబ్రాహాము రొమ్ము
శరీరము-సమాధి
క్రీస్తు రెండవ రాకడలో పునరుత్థానము జరుగును భూమిమీద తీర్పు పరలోకరాజ్యము
శ్రమకాలములోని విశ్వాసి ఆత్మ-క్రీస్తు సన్నిధి
శరీరము-సమాధి
క్రీస్తు రెండవ రాకడలో పునరుత్థానము జరుగును భూమిమీద తీర్పు పరలోకరాజ్యము
అవిశ్వాసి ఆత్మ-పాతాళము; నరకము
శరీరము-సమాధి
వెయ్యేండ్లు ముగిసిన తర్వాత పునరుత్థానము జరుగును ధవళమైన మహా సింహాసనము యెదుట తీర్పు నరకము; గెహెన్నా; అగ్ని గంథకముల గుండము

Adapted from Revelation—Unveiling the End, Act 3: The Final Curtain Bible Companion (Plano, Tex.: IFL Publishing House, 2007). Used by permission.

Posted in End Times-Telugu, Jesus-Telugu, Theology-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.