ఒక సాయంత్రం నేను నా భార్య కలిసి ప్రశాంతమైన సంభాషణను ఆస్వాదిస్తున్నాము. మేము తాజాగా ఉత్తేజాన్నిచ్చే కాఫీని త్రాగుచున్నాము, ఇల్లు అసాధారణంగా నిశ్చలముగా ఉంది, మరియు ఆ సాయంత్రం ఎక్కడికీ వెళ్ళే ప్రణాళికలు లేవు. ఇది నిజంగా మళ్ళీ అవసరమైనప్పుడు మీరు మూటగట్టుకుని, తరువాత ఉపయోగం కోసం రిజర్వు చేసుకోవాలని మీరు కోరుకునే ఆ ప్రతిష్టాత్మకమైన సందర్భాలలో ఇది ఒకటి.
అనుకోకుండా, మా చర్చ క్రీస్తు రెండవ రాకడ యొక్క అంశము వైపు తిరిగింది. కొన్ని నెలల్లో లేనంత దూరం ఆ ఆలోచనను నేను వెంబడిస్తున్నట్లుగా కనిపెట్టాను. మా అటకను శుభ్రపరచడం లేదా తోటను రమ్యముగా తయారుచేయడం వంటి పనులు యిప్పుడు మేము చేస్తున్నవాటిని శ్రమకాలములో ఉండేవారు ఈ యిబ్బందులతో చింతించనివ్వడం గురించి నేను, సింథియా కొంత వ్యాఖ్యానము చేశాము! క్రీస్తు శరీరంలో కుటుంబంతో మరియు స్నేహితులతో శాశ్వతకాలము పంచుకునే ఆనందాలను గూర్చి ఆలోచిస్తూ మేము కలిసి చిరునవ్వు చిందించాము.
ఆ సాయంత్రపు శేష సమయం గడిచేకొద్దీ, నేను వాస్తవికతకు తిరిగి వస్తూనే ఉన్నాను, “ఆయన తిరిగి వస్తున్నాడు. ఇది ఎంత వ్యత్యాసం తెస్తుంది!” మనం ఏమాత్రం విలువు యివ్వకుండా చాలా తేలికగా తీసుకునేవాటిని మన దగ్గరనుండి తీసివేయబడినప్పుడు లేదా మార్చబడినప్పుడు, మీరు ఆగి దాని గురించి నిర్దిష్టంగా తెలుసుకున్నప్పుడు, ఇది చాలా అసాధారణమైనది. దాని గురించి ఆలోచించండి . . .
మనం ఏమి చూసుకొని ఉబ్బిపోతామో, దేన్ని పట్టుకుని వ్రేలాడి, యింకా కావాలనుకుంటామో ఆ వస్తువులను . . . అనగా మనం విలువనిచ్చేవాటిని కొలిచినప్పుడు ఎన్ని మరమ్మత్తులు చేయాలో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మన భౌతికవాద విగ్రహాలను పగులగొట్టడానికి మరియు మనల్ని ప్రాథమిక విషయాలకు తరలించడానికి క్రీస్తు రాకడ సమర్థవంతముగా వ్యవహరిస్తుంది. మనం శ్రద్ధ పెట్టవలసిన విషయాలపై మనం ఎంత సమయం వెచ్చిస్తామండీ . . . కానీ బాకా శబ్దమునకు అవన్నీ అకస్మాత్తుగా అస్పష్టంగా అయిపోతాయి! “పరలోకపు మనస్సు గలవారు” అని పిలవబడే చాలామంది విచిత్రమైనవారు ప్రవచనాలపై విపరీతాలకు వెళ్ళడం ద్వారా మాటల్లో చెప్పలేని కొన్ని పనులు చేసారని నేను గ్రహించాను. కానీ ఆ రోజు సాయంత్రం దేవుడు నాతో ఇది చెప్పాడు, “నా కుమారుడా, నీ పట్టును సడలించు . . . నాతో నిత్యత్వములో ఉండటమే ప్రతిదాని యొక్క ముఖ్య భాగమని గుర్తుంచుకో.”
ప్రభువు రాకడపై దృష్టి పెట్టడం సమయాన్ని వృధా చేసుకోవటమేనా? లేదు. అది బైబిలుసంబంధమైనదే. మనం చేయవలసినది ఇదేనని తీతుకు 2:13 చెబుతున్నది:
మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు.
చివరిసారిగా నీ స్వంతంగా నువ్వు క్రీస్తు రాకడను గూర్చి ఎప్పుడు ధ్యానం చేశావు? చాలామంది వలె నువ్వు ఉన్నట్లైతే, ఇప్పటికే చాలా ఆలస్యమైయ్యింది. గూఢమతవాది కంటే వాస్తవికతలో, ఆదర్శవాదం కంటే యథార్థతలో ఉండు ప్రజలు, అంత్యక్రియల వద్ద మరియు మరణానికి దగ్గరైన అనుభవాలు తరిమినప్పుడు మాత్రమే క్రీస్తు రాకడను గూర్చి ధ్యానిస్తారు. మనలో చాలా మంది ప్రస్తుతకాలమును గూర్చియే గాని రాబోవు కాలమును గూర్చి ఆలోచించువారము కాము. కాని మనము క్రీస్తు రాకడను గూర్చిన సమాచారముతో “ఒకనినొకడు ఆదరించుకోవాలి” అని లేఖనము మనకు తెలియజేయుచున్నది (1 థెస్సలొనీకయులకు 4:13-18). ఈ సత్యాలు “స్థిరమైన, కదలని, ఎప్పటికినీ ఆసక్తి కలిగియుండు” జీవనశైలికి పునాది వేస్తాయని ఇది పేర్కొంది (1 కొరింథీయులకు 15:50–58).
మన ప్రభువైన క్రీస్తు రాకడను గూర్చి నేరుగా సంబంధం కలిగిన వాగ్దానాలు మరియు ప్రోత్సాహకాలతో మన పరిశుద్ధ గ్రంథము నిండి ప్రవహించుచున్నది. నేను ఇప్పుడే సంప్రతించాను. ఇది కేవలం సూచించబడలేదు; ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఇది క్రొత్త నిబంధన సత్యం యొక్క స్పష్టమైన ఇతివృత్తం. మీరు ఏ పుస్తకాన్ని ఎంచుకున్నా, దానిని ఎదుర్కోకుండా ఎంతో దూరం చదవలేరు. క్రొత్త నిబంధనలో మాత్రమే, క్రీస్తు రాకడకు సంబంధించిన సంఘటనలు 300 కన్నా ఎక్కువ సార్లు ప్రస్తావించబడ్డాయి. ఆయన రాకడ నిశ్చయం!
విమర్శకులు దీనిని ఖండించారు. నిరాశావాదులు దీనిని చూసి నవ్వారు. పండితులు దీనిని విస్మరించారు. ఉదార వేదాంతవేత్తలు దీనిని వదలించుకోవటానికి విశదపరచారు (వారు దీనిని “పునరాలోచన” అని పిలుస్తారు), మరియు మతోన్మాదులు చాలా మంది దీనిని అరికట్టడానికి కారణమయ్యారు. “ఆయన రాకడనుగూర్చిన వాగ్దాన మేమాయెను?” అని చాలామంది నిరాశావాదులు ఇప్పటికీ కేకలు వేస్తున్నారు (2 పేతురు 3:4). మన రక్షకుడి రాకడ దాడి చేయబడుతూనే, విస్మరించబడుతూనే, తిరస్కరించబడుతూనే ఉంటుంది. కానీ నిరాశ మరియు అవిశ్వాసం మధ్య మనకు నిరీక్షణ మరియు ప్రోత్సాహాన్ని అందిస్తూ, త్వరలో నెరవేరటానికి, ఒక రాయిలాగా, అది అక్కడ నిలిచింది.
“సరే, ఉప్పొంగిపోండి. అయితే ఈ మధ్యకాలంలో నేను ఏమి చేయాలి?” ఈ ప్రశ్నను చాలామంది ఆచరణవాదులు అడగడం నేను వినగలను. మొదటిగా, మీరు ఏమి చేయకూడదో అర్థం చేసుకోవడం మంచిది. బూర శబ్దము వినటానికి మీరు తీరికగా కూర్చొని ఉండరు. మీరు ప్రతిరోజూ ఆకాశంలోకి తేరిచూస్తూ, మేఘాలు చీల్చుకోవటం కోసం వెతకరు. మీరు తెల్లని వస్త్రముతో వేగముగా వెళ్ళి దేవదూతల రూపాలు పెయింటింగ్ వేయబడి హీలియం నిండిన భారీ బెలూనుకు మిమ్మల్ని మీరు తగిలించుకోరు. ఆపండి, “ఆ కాలములకు సూచనల” కారణంగా మీరు ఖచ్చితమైన తేదీని ప్రకటించరు! దయచేసి ఆ పని చేయకండి.
మీరు మీ పనులను చక్కబెట్టుకుంటారు. మీరు ప్రతిదినమూ (అదే చివరి దినము అన్నట్లుగా) ఆయన మహిమ కొరకు జీవిస్తారు. ఆయన నామము నిమిత్తం మీరు మీ ఉద్యోగంలో మరియు మీ ఇంటిలో (ఆయన మరో పదేళ్ల వరకు రావడం లేదు అన్నట్లుగా) శ్రద్ధగా పని చేస్తారు. మీకు లభించే ప్రతి అవకాశముతో ముందుకు కదులుతారు . . . మరియు మీరు వెలుగును ప్రకాశిస్తారు . . . మరియు ఖచ్చితంగా, మీరు సమతుల్యతతో, ఉల్లాసంగా, విజయవంతంగా మరియు స్థిరంగా ఉంటారు, ప్రతిరోజూ ఆయన తిరిగి వస్తారని ఎదురుచూస్తున్నారు. అలా కాకుండా, మీకు ఏమి చెప్పాలో నాకు తెలియదు.
ఒకవేళ, మీరు ఎగరడానికి సిద్ధంగా ఉన్నారని మీకు ఖచ్చితంగా తెలియకపోతే, మీరు మీ టికెట్‌ను వేగంగా పొందుతారు. అవి అందుబాటులో ఉన్నంతవరకు అవి ఉచితం. కానీ వేచి ఉండకండి. చివరకు మీరు మీ మనస్సును మార్చుకునే సమయానికి, మొత్తం జరిగిపోవచ్చు, మీరు పైకి చూడటానికి బదులు వెనక్కి తిరిగి చూసుకునేలా విడిచిపెట్టబడతారు.
సంఘటన ముగిసిన తర్వాత టికెట్ ఉన్నా ఏమి ఉపయోగం?