కృప

Grace

స్వతంత్ర మార్గంలో పయనించండి

కృప అనే పదం చిన్న, సాధారణమైన పదం. కానీ బైబిల్ ప్రకారం కృప యొక్క గంభీరత మరియు అర్థాన్ని గ్రహించాలంటే జీవితకాల అధ్యయనం మరియు అనువర్తనం పడుతుంది. సున్నితమైన గమనమును లేదా భోజనానికి ముందు చేసే చిన్న, శీఘ్ర ప్రార్థనను వివరించే పదం, పాపుల పట్ల దేవుని అపురూపమైన ప్రేమను వివరించడానికి మనం ఉపయోగించే పదముతో సమానమవటం సిగ్గుచేటు. ఏదేమైనా, రక్షణ మరియు క్షమాపణ యొక్క ఉచిత బహుమతిని మనకు ఇవ్వడానికి ఆయనను ఈ కృపయే ప్రేరేపించేది.

ఇంతకు ముందెన్నడూ అర్థం కాని మర్మమును గూర్చి వ్రాయడానికి అపొస్తలుడైన పౌలును బలవంతం చేసినది ఈ కృపయే (1 కొరింథీయులకు 2: 7-13). దేవుడు నిర్దేశించిన మన ప్రత్యేకమైన ప్రయాణాన్ని కనుగొనటానికి యెవరో ఒకరు స్వేచ్ఛను ఇస్తున్నందున వారి యిష్టపూర్వక అంగీకారములో విశ్రాంతి తీసుకోవడానికి కృప కూడా మనలను అనుమతిస్తుంది. కాబట్టి మనం స్వతంత్ర మార్గము వైపు కలిసి ప్రయాణించుచుండగా మరియు దేవుని కృప యొక్క అధిక సంపదనుబట్టి ఆశ్చర్యపడుచుండగా విశ్రాంతి తీసుకోండి!

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి