1970 ల్లోని ఒక ఆదివారాన్ని నేను మరచిపోలేను. నా స్నేహితుడు మరియు రేడియో నిపుణుడు అల్ సాండర్స్ నా వద్దకు వచ్చి, “చక్, ఇది రేడియోలో రావాలి” అని చెప్పినప్పుడు, కాలిఫోర్నియాలోని ఫుల్లెర్టన్‌లో అప్పుడే నేను బోధించటం పూర్తి చేశాను. “రేడియోలో ఏది రావాలి?” అని నేను స్పందించాను.
పుల్పిట్ మీదనుండి తప్ప మరెక్కడనూ వినిపించబడటం నా మనసులో ఎన్నడునూ ప్రవేశించలేదు! అల్ నా వైపు చూస్తూ, “నువ్వు ఏదైతే బోధిస్తున్నావో, అది శబ్దతరంగాల్లో రావాలి” అని అన్నాడు. “అల్, నాకు అందుకు సమయం లేదు,” అని నేను నవ్వాను. అతను తల ఊపుతూ, “ఓహ్, లేదు, లేదు! మిగతా అన్నింటిని గురించి మేము జాగ్రత్త తీసుకుంటాము.” “సరే, అల్, నువ్వు రేడియో మనిషివి. నేను బోధకుడిని. నేను పుల్పిట్ కోసం తయారు చేయబడ్డాను. ప్రసారం కోసం ఏదైనా తయారు చేసి అందించవచ్చని నువ్వు అనుకుంటే, ఖచ్చితంగా చేద్దాం. ఒకసారి ప్రయత్నించు,” అని నేను చెప్పాను.
జూలై 1979, ఇన్సైట్ ఫర్ లివింగ్ జన్మించింది. నేడు, ఇది ప్రపంచవ్యాప్తంగా 2 వేలకు పైగా స్టేషన్లలో మరియు ఎనిమిది భాషలలో వినవచ్చు! “చక్, ఇది మీ ప్రణాళికనా?” అని ప్రజలు తరచూ అడుగుతారు. లేదు! సింథియా మరియు నేను ఎన్నడూ బృహత్తర ప్రణాళిక కలిగి లేము, కాని మేము ప్రభువు యొక్క ప్రణాళికను అనుసరించాము.
1979 నుండి చాలా విషయాలు మారిపోయాయి. కొన్ని విషయాలు మారలేదు. దేవుని వాక్య అధ్యయనం మరియు అనువర్తనాన్ని బోధించడంలో మేము ఇంకా నిబద్ధత కలిగియున్నాము. ఆయన వారి కోసం సృష్టించిన పాత్రలలో సేవ చేయడానికి దేవునిచేత పిలువబడిన వ్యక్తులతో కూడా మేము ఇంకా భాగస్వామ్యం కలిగియున్నాము.
గుర్తుందా, నేను అల్‌తో, “నువ్వు రేడియో మనిషివి. నేను బోధకుడిని” అని అన్నాను. సరైన వ్యక్తుల దగ్గరకు నడిపించబడటానికి దేవుని అనుమతి కోరి . . . ఆపై వారిని నడిపించడానికి ఆయనను విశ్వసించడమనేది మేము ఎదగడంలో అవసరమైన భాగమైయ్యింది. దేవుని కృపను విస్తరింపజేయటానికి మరియు మొత్తం 195 దేశాలలో ఆయన వాక్యాన్ని బోధించడానికి మా వ్యూహమనేది-విజన్ 195 యొక్క ముఖ్యమైన భాగమైపోయింది.
విజన్ 195 యొక్క మేధస్సు ఏమిటంటే అది దేవుని ఆలోచన. గొప్ప ఆజ్ఞ ఆయన బృహత్తర ప్రణాళిక . . . మనలో ప్రతి ఒక్కరూ ఆయన మన కోసం సృష్టించిన పాత్రను సంపూర్ణం చేయుట ద్వారా-మనం కలిసి చేయగలుగుతాము. అందువల్ల, ఇన్సైట్ లో, మేము వారి స్వంత దేశాల్లోనే వారి ప్రజలకు, వారి భాషలలో మరియు సంస్కృతులలో సేవ చేయడానికి పాస్టర్లకు శిక్షణ ఇస్తున్నాము. అందుకోసమే మేము మీతో భాగస్వామ్యం అవుతున్నాము.
లెబనాన్లోని IFLM అరబిక్ భాషా పరిచర్యకు నాయకత్వం వహిస్తున్న ఆ పాస్టర్లలో ఒకరైన చార్లీ కోస్టా గురించి మీకు చెప్పడానికి మేము ఈ ఇన్సైట్ల మొత్తం ఎడిషన్‌ను అంకితం చేసాము. మీరు ఆయన గురించి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.
ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా నన్ను ప్రారంభించనివ్వండి: ఎందుకు అరబిక్?
ఎందుకు కాకూడదు? దేవుడు యేసును ఎక్కడికి పంపాడు? ఆయన ఎక్కడ పెరిగాడు? అరబిక్‌ను పోలిన భాష మాట్లాడుతూ, ఆయన మధ్యప్రాచ్యంలో నివసించాడు. దాదాపు 2,000 సంవత్సరాల తరువాత, వెలుగు నడిచిన చోట చీకటి ఏలుచున్నది.
ఉగ్రవాదం భయపెట్టేదే, కాని ఆపదలు లేకుండా ముందుకు కొనసాగుటకు దేవుడు మనల్ని పిలువలేదు. శాంతియుత ముస్లింలు కూడా విలువైనవారు కాదని, అరబిక్ మాట్లాడేవారు ఎవరూ వినరని, ఉగ్రవాదులు ఎప్పటికీ మారరని సాతాను చాలా మంది క్రైస్తవులను ఒప్పించాడు. ఇది ఒక అబద్ధం! ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కలలు కనే 6,875 భాషలలో ప్రతి ఒక్కదానిలో తన సత్యాన్ని ప్రకటించమని క్రీస్తు మనలను పిలిచాడు. . . అందుకుగాను మనకు అవసరమైనది ఆయన మనకు ఇచ్చాడు: తన వాక్యము మరియు తన ఆత్మ.
దేవుని వాక్యము ఎక్కడైనా సరే అడ్డగింపనశక్యమైనది. ఇది ప్రతి భాషలో మరియు ప్రతి సంస్కృతిలో సజీవమై బలముగలదైయున్నది! ఇది ప్రతి వ్యక్తి కోరుకునే స్వాతంత్ర్యమును అందిస్తుంది! ఇది హృదయాలను రూపాంతరమొందిస్తుంది! మీరు శాంతి కొరకు, దేవుని చిత్తం భూమిమీద జరుగుట కొరకు ప్రార్థిస్తే, అరబిక్ మాట్లాడేవారికి ఆయన వాక్యాన్ని అందించడానికి మీరు తప్పక మద్దతు ఇవ్వాలి.
అందుకే, 1990 ల చివరలో దేవుడు అరబిక్ భాషా పరిచర్యకు తలుపులు తెరవడం ప్రారంభించినప్పుడు, సింథియా మరియు నేను “అవును!” అని అన్నాం. మేము చార్లీని కలిసినప్పుడు, అతనే దానిని నడిపించే దేవుని వ్యక్తి అని మాకు తెలుసు. ఈ రోజు, మా అరబిక్-భాషా పాస్టరుగా, వనరులను అనువదస్తూ, అరబిక్‌లో ఇన్సైట్ ఫర్ లివింగ్ ను వినిపింపజేస్తూ, మా అరబిక్ భాషా వెబ్‌సైట్‌ను నడుపుతూ, చార్లీ బేరూత్ లో నివసిస్తున్నారు. అతని పరిచర్య మధ్యప్రాచ్యాన్ని ఆవరించింది మరియు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 420 మిలియన్ల అరబిక్ మాట్లాడే ప్రజలకు విస్తరించింది.
గత నెల, చార్లీ కోస్టా మా యు.ఎస్. బోర్డు సభ్యులలో ఒకరైన రోజర్ కెంప్ మరియు నాతో మాట్లాడటానికి మా అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సంభాషణ మార్చి 20 న ప్రసారం చేయబడింది. ఈ రోజు, మేము మీ కోసం వ్రాతపూర్వకంగా అనుకూలపరచాము.
*********
చార్లీ: చక్, మీతో నా సంబంధం చాలా ముందుగానే ప్రారంభమైంది, ఎందుకంటే నా తండ్రి మీ బోధను ఆసక్తిగా వినేవారు. తరువాత, ప్రభువు నాకు ఈ పరిచర్యలో సేవ చేయడానికి అవకాశాన్ని తెరిచాడు, అది నా బోధను మాత్రమే కాకుండా, నా జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. నా బల్ల మీద, నేను చెక్కబడిన ఒక దేవదారు చెక్క ముక్కను కలిగి ఉన్నాను: “ఇది కృపగల ప్రదేశం.” “అది ఎక్కడ నుండి వచ్చింది?” అని ప్రజలు అడుగుతారు. “నేను దాన్ని చక్ నుండి నేర్చుకున్నాను,” అని అన్నాను. నేను కృపగల వ్యక్తిగా మరియు కృప యొక్క మార్గంగా ఉండాలనుకుంటున్నాను.
చక్: మీ సంస్కృతిలో మీరు అరుదుగా కృప చూపిస్తారనేది నిజం కాదా?
చార్లీ: అరబ్ సంస్కృతి కఠినమైనది, కర్కశమైనది, మంచిపనులు చేయాలని చెబుతుంది. నా కార్యాలయంలోకి అడుగుపెట్టి, వారి పాపాలను ఒప్పుకోవడం ప్రారంభించినప్పుడు వారికి తెలిసిన ఏకైక ప్రపంచం ఇదే. “సరే” అని నేను సమాధానం చెప్పినప్పుడు వారు దీనిని నమ్మలేరు: “మీరు చెప్పేది ఇంతేనా?” “అవును,” అని నేను సమాధానం ఇస్తాను. “కృప వల్ల, మీరు చేసినది రక్తం ద్వారా కప్పబడుతుంది. మీరు ఇప్పటికే క్రీస్తులో అంగీకరించబడ్డారు! దేవుని కృప వల్ల మీరు పునరుజ్జీవింపబడవచ్చు, పునరుద్ధరించబడవచ్చు మరియు క్రీస్తుతో సంపూర్ణ సహవాసంలో ఉండవచ్చు.”
చక్: అటువంటి స్వాతంత్ర్యంలో జీవించాలని, దాని గురించి తెలుసుకోవాలని, విశ్వాసముంచాలని ఎవరు అనుకోరు?
చార్లీ: వారి మనస్సులు కృపచేత వికసించాయి! “మీరు నన్ను తీర్పు తీర్చటంలేదు కదా?” అని వారు అడుగుతారు. “ఇది దేవుని కృప వలన కాకపోతే,” “నేను మీ సీట్లో ఉండేవాడిని” అని నేను సమాధానం ఇచ్చాను.
చక్: క్రైస్తవులు తరచూ దీనిని మరచిపోతారు. మీరు ప్రజలను వదిలేస్తున్నారని, వారు భావిస్తున్నారు. అది నిజమైతే, దేవుడు మనందరినీ వదిలేశాడు! సిలువ యొద్ద యేసు, “సమాప్తమైనది!” అని అన్నాడు. (యోహాను 19:30).
చార్లీ: ఇది ప్రజలను ప్రభావితం చేస్తుంది, అంగీకరించబడినట్లు మరియు బేషరతుగా ప్రేమింపబడుచున్నట్లు అనిపిస్తుంది. . . నేను ఎదుర్కొనే అతి పెద్ద అపోహ ఇది: “ముస్లిం ప్రజలు సువార్త వినడానికి ఇష్టపడరు.” కానీ చాలామంది, అవకాశం మరియు స్వేచ్ఛ కలిగియుంటే, క్రీస్తును వెదకుతారు. కొందరు నీకొదేము మాదిరిగా రహస్యంగా వెదకుతారు. వారు యేసు గురించి వింటారు మరియు ప్రమాదం ఉన్నప్పటికీ మరింత తెలుసుకోవాలనుకుంటారు. ఇటీవల, మేము ఆరుగురికి బాప్తిస్మం ఇచ్చాము, వారిలో ఐదుగురు ముస్లిం మతం నుండి మారినవాళ్ళు. తరువాత, వారిలో ఇద్దరిని మాటువేసి కొట్టారు.
ముస్లిం ప్రజలు తాము ఉన్నట్టుగానే ప్రేమించబడటం, అంగీకరించబడటం కొరకు, సత్యం కొరకు ఆకలితో ఉన్నారు. సువార్తను వ్యాప్తి చేయడంలో సంఘము విఫలమైనందున ఉగ్రవాదం ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉగ్రవాదం అనేది మానవ హృదయం యొక్క భ్రష్టత్వానికి ఉదాహరణగా ఉన్నది-మనం సందేశాన్ని తీసుకువెళ్ళడంలో విఫలమయ్యామనటానికి ఇదొక సాక్ష్యం. ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ దీనిని చాలా తీవ్రంగా పరిగణించింది!
మేము అనువదించిన మరియు ప్రసారం చేసిన అత్యంత ప్రభావవంతమైన సిరీస్‌లో ఒకటి గెట్టింగ్ త్రూ ది టఫ్ స్టఫ్. ప్రజలు అనుకున్నారు, అది నేనే! నేను దాని గుండా వెళుతున్నాను! మేము ఈ ధారావాహికను ప్రసారం చేసినప్పుడు, నాకు ఒక పెద్దమనిషి నుండి ఒక లేఖ వచ్చింది, అందమైన అరబిక్‌లో వ్రాయబడింది, బాగా వ్రాసాడు,నేను అనుకున్నట్లే, అతను పాలస్తీనా శరణార్థ శిబిరాల నుండి అరబిక్ భాషా ఉపాధ్యాయుడు. నేను అతనిని పిలిచాను, మరియు మేము కలవడానికి ఏర్పాట్లు చేసుకున్నాము. నేను వచ్చినప్పుడు, అతను తన ప్రశ్నలన్నిటితో ఒక కాగితాన్ని బయటకు తీశాడు. అతను దృఢ నిశ్చయంతో ఉన్నాడు!
మేము అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మూడు గంటలు గడిపాము. అప్పుడు నేను, “నేను మీకు చాలా విలువైనదాన్ని ఇవ్వాలనుకుంటున్నాను” అని చెప్పి, క్రొత్త నిబంధనను బయటకి తీశాను. నేను, “మీరు దీన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. మీకు కావాల్సిన సమాధానాలన్నీ ఇందులో ఉన్నాయి.” అప్పుడు నేను అరబిక్ భాషలోని మీ పుస్తకాలను కొన్నింటిని అతనికి ఇచ్చాను.
చక్: అతని వద్ద లేఖనాల ప్రతి లేదా?
చార్లీ: లేదు. అతను బాగా చదువుకున్నాడు, చాలా అనర్గళంగా మాట్లాడాడు. కానీ ఆయన ఎప్పుడూ వాక్యాన్ని చదవలేదు. అతను కోరిన సమాధానాలు అతని దగ్గర లేవు. నేను ఒకే మాదిరి కథ యొక్క ప్రతిరూపాన్ని పదే పదే చూస్తున్నాను! నేను ప్రయాసపడి భారం మోసికొనుచున్న ఎవరో ఒక వ్యక్తిని కలుస్తాను, నేను సువార్తను పంచుకుంటాను, ఆపై నేను అదే మాట వింటాను: ఉపశమనం యొక్క భారీ నిట్టూర్పు. “ఈ విషయాన్ని ఎప్పుడూ ఎవ్వరూ నాకు ఎందుకు చెప్పలేదు!” అని వారు అడుగుతారు.
*********
ఈ విషయాన్ని ఎప్పుడూ ఎవ్వరూ నాకు ఎందుకు చెప్పలేదు!
అరబిక్ మాట్లాడేవారు ఏ ఒక్కరూ ఆ ప్రశ్నను మరలా అడగకుండా ఉండేందుకు నావలె మీరూ సిద్ధంగా ఉన్నారా?
ఊహించుకోండి: అరబిక్ మాట్లాడే ప్రతివ్యక్తికి దేవుని కృప గురించి తెలియడం. ఇదేదో సుదూరమైన కల కాదు! అరబిక్ మాట్లాడేవారికి వెలుగు ఉదయించుచున్నది. దేవుడు గొప్ప ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు. ఇది ఆయన బృహత్తర ప్రణాళిక, మరియు ఆయన మిమ్మల్ని మరియు నన్ను దీనిలో భాగం కావాలని ఆహ్వానిస్తున్నాడు!