మనం జీవించే ప్రతిరోజూ, సరియైనది చేయటానికి లేదా తప్పు చేయటానికి మనకు అవకాశం ఉంటుంది. మనము మన చిన్న పిల్లలను పాఠశాలకు పంపేటప్పుడు, మనము వారితో ఇలా చెబుతాము, “చూడమ్మ, నా బంగారుతల్లి, మీ నిర్ణయాలు తీసుకోవడానికి అమ్మ మరియు నాన్న అక్కడ మీదగ్గర ఉండరని మీరు తెలుసుకోవాలి. సరైన పనిని చేయుమని మిమ్మల్ని ప్రోత్సహించే కొంతమంది పిల్లలను మీరు పాఠశాలలో కనుగొంటారు, అలాగే అవిధేయులుగా ఉండటానికి మరియు తప్పు చేయటానికి మిమ్మల్ని నడిపించేవారిని కూడా మీరు కనుగొంటారు. సరైన ఎంపిక చేసుకోండి. మీ స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. తెలివిగా ఉండండి.”. . .
క్రీస్తు రాకమునుపు, మనకు వేరే దారి లేదు. పాపమే మనకున్న ఒకేఒక్క మార్గం. జీవితమంతా అన్యాయంతో మచ్చబడిపోయింది. కానీ ఒకసారి మనము సిలువ యొద్దకు వచ్చి మన జీవితాలను పరిపాలించే హక్కు ప్రభువైన యేసుకు ఇచ్చినప్పుడు, మనకు ఇంతకు ముందెన్నడూ లేని అవకాశం మనకు ఇవ్వబడినది. క్రీస్తు ఆదేశాలను స్వచ్ఛందంగా అనుసరించే అవకాశాన్ని కల్పిస్తూ, పాపానికి సేవ చేయవలసిన అవసరం నుండి కృప మనలను విడిపించింది. కాబట్టి మనం ఇలా చేసినంత కాలం మనం పాపం చేయము! కానీ మీరు లేదా నేను మనపై ఆయన అధికారముతో రాజీ పడిన వెంటనే, పాత యజమాని మనల్ని పాపంలోకి లాగడానికి సిద్ధంగా ఉంటాడు.
Taken from Charles R. Swindoll, Wisdom for the Way: Wise Words for Busy People (Nashville: J. Countryman, 2001), 397. Copyright © 2001, Charles R. Swindoll, Inc. All rights reserved.