మీ జీవితంలో మనిషికి మనిషికి మధ్య ఉండవలసిన కృప లేదా? మీరు దేవుడు చూపించు కృపను కౌగిలించుకొని ఉండవచ్చు, కానీ మీ బాంధవ్యాలలో దాని యొక్క ప్రాముఖ్యమైన సంబంధాన్ని పోగొట్టుకొన్నారు.
కొన్ని చొచ్చుకుపోయే ప్రశ్నలతో మిమ్మల్ని ఉద్రేకపరచడానికి నన్ను అనుమతించండి. మీరు ప్రజలను స్వేచ్ఛగా ఉండనిస్తారా, లేదా మీరు వారిని బందీగా ఉంచుతున్నారా? వారి యొక్క అపరాధభావం మరియు సిగ్గు నుండి మీరు వారికి ఉపశమనం ఇస్తున్నారా, లేదా మీరు వారి భారాన్ని మరింత పెంచుతున్నారా? మీరు ఇతరులను ప్రోత్సహిస్తున్నారా లేదా నిరుత్సాహపరుస్తున్నారా? నిర్మాణ ప్రపంచంలోనా లేదా విధ్వంసం చేసే ప్రపంచంలోనా మిమ్మల్ని మీరు పాల్గొనటాన్ని కనుగొనేది? మీరు ప్రజల లోపాలను మరియు వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారా లేదా వారి బలాలను మరియు విజయాలనా? మరో మాటలో చెప్పాలంటే, మీరు ఇతరులకు కృప చూపిస్తున్నారా? ఇప్పుడు, నన్ను మరింత లోతుగా పరిశోధన చేయనిస్తే, ప్రత్యేకంగా మీకు కనబడే ప్రేమలేని ఆ వ్యక్తి గురించిన సంగతేమిటి?
నామట్టుకైతో, దివంగత టామ్ లాండ్రీ డల్లాస్ కౌబాయ్స్‌కు శిక్షణ ఇస్తున్నప్పుడు ఆయనను చూడటం ద్వారా మనిషికి మనిషికి మధ్యనున్న కృపకు అద్భుతమైన ఉదాహరణ దొరికింది. ఆయన మరియు నేను డల్లాస్ థియోలాజికల్ సెమినరీ బోర్డులో పనిచేసిన సమయంలో, నేను తరచూ ఆయన పక్కన కూర్చునేవాడిని, ఆయన నెమ్మదిగల గౌరవప్రదమైన వ్యక్తి అని నేను గుర్తించాను. మీరు ఎంత దగ్గరైతే, మీరు ఆయన్ని అంతగా గౌరవిస్తారు. ఆయన దేవుని కృప క్రింద జీవించిన వ్యక్తి, మరియు నేను చూసిన కొద్దిమందిలాగే ఆయన తన నిజస్వభావాన్ని చూపించాడు. వుడీ హేస్ పట్ల ఆయన చూపించిన ప్రతిస్పందనలో ఇది స్పష్టంగా కనబడింది.
హేస్ ఒహాయో రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు 28 సంవత్సరాలు శిక్షణ ఇచ్చాడు మరియు జనరల్ జార్జ్ పాటన్‌ను తన నాయకత్వ నమూనాగా తీసుకున్నాడు. అతని కఠినమైన క్రమశిక్షణ అతన్ని భగభగమండే వాడనే ఖ్యాతిని సంపాదించింది. ఆయన్ని సంతోషపెట్టడం చాలా కష్టం, వైఫల్యాలను సహించేవాడు కాదు మరియు ఆటగాడిని క్రమశిక్షణ చేసేటప్పుడు కొన్నిసార్లు హద్దును దాటాడు. తన కెరీర్లో, హేస్ నమ్మశక్యం కాని విజయం-ఓటమి రికార్డును సంపాదించాడు, కాని అతను ఆటగాళ్ళు, తల్లిదండ్రులు, అభిమానులు మరియు స్పోర్ట్స్ రిపోర్టర్ల పట్ల తప్పుగా ప్రవర్తించిన సందర్భాల సుదీర్ఘ జాబితాను కూడా సృష్టించాడు. 1978 గాటర్ బౌల్ సమయంలో, ఒక ప్రత్యర్థి ఆటగాడు ఒహాయో స్టేట్ పాస్‌ను అడ్డుకున్నాడు మరియు బక్కీస్ సైడ్‌లైన్‌లోకి దూసుకొచ్చేశాడు. కోపంతో, వుడీ హేస్ బాలుడిని గట్టిగా కొట్టాడు, అతని హెల్మెట్ను దాదాపుగా పడిపోయేలా కొట్టాడు-ఇదంతా అన్ని జాతీయ టెలివిజన్లో కనబడింది.
సముచితంగా, మరుసటి రోజు ఒహాయో స్టేట్ అతనిని తొలగించింది. కానీ తరువాతి వారాల్లో, దేశం కోపంతో రగిలిపోయింది, విలేకరులు కనికరం లేకుండా పోగుపడ్డారు, మరియు పగతో ఉన్న ఎవరైనా అవమానకరమైన ఆ కోచ్ మీద తమ కోపాన్ని వెళ్ళగ్రక్కారు. తెరలు దించబడి తలుపులు మూయబడగా అతను నిశ్శబ్దం మరియు సిగ్గుతో వెనుకకు మరలాడు.
ఆ సమయంలో, కోచ్ టామ్ లాండ్రీ న్యూయార్క్‌లో ప్రతిష్టాత్మకమైన విందుకు హాజరుకావలసి ఉంది మరియు తనతో ఒక అతిథిని తీసుకువెళ్ళే స్వేచ్ఛ అతనికి ఉన్నది. సాధారణంగా, అతను తన భార్య అలిసియాను తీసుకువెళ్ళేవాడు. కానీ ఈసారి అతను వుడీ హేస్ తో కనిపించాడు. లాండ్రీ యొక్క పదునైన కృపా చర్య హేస్ ని అవమానం నుండి బయటపడవేసింది మరియు అతన్ని హింసించేవారిని నిశ్శబ్దం చేసింది. కృపయే తరచుగా అలా చేస్తుంది.
మా తదుపరి బోర్డు సమావేశంలో కోచ్ లాండ్రీని ఈ విషయాన్ని గూర్చి అడిగాను. అతను ఇలా అన్నాడు, “ప్రతిఒక్కరూ అతన్ని కొడుతున్నారు కాబట్టి, అతనికి అండగా నిలబడి, తాను ఇంకా అతన్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఎవరో ఒకరు అవసరమని నేను గ్రహించాను.” కోచ్ వుడీ హేస్ కు అది ఎలా ఉండి ఉంటుందో మీరు ఊహించగలరా? అతను తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, అవమానంగా భవించినప్పుడు . . . దేనికీ అర్హత లేనివాడనని అనుకున్నప్పుడు, లాండ్రీ వంగి, అతన్ని పైకి లేపి, హత్తుకున్నాడు.
రోమా 5:7-8 ను యూజీన్ పీటర్సన్ యొక్క భావానువాదం దీన్ని బాగా చూపిస్తుంది.
చనిపోయేంత విలువ ఉన్న వ్యక్తి కోసం ఎవరైనా చనిపోతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు అలాగే మంచి మరియు గొప్ప వ్యక్తి మనల్ని నిస్వార్థ త్యాగానికి ఎలా ప్రేరేపిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుడు తన కుమారుని బలియాగంగా అర్పించడం ద్వారా తన ప్రేమను మనయెడల వెల్లడిపరచుచున్నాడు. (MSG)
దేవునికి మనిషికి మధ్య ఉన్న కృపను గురించి మనం చాలా విన్నాము-ఆ కృప దేవుని నుండి మనం పొందుకున్నాము. కానీ నేను మళ్ళీ అడుగుతున్నాను, మనిషికి మనిషికి మధ్య ఉండవలసిన కృపను గురించిన సంగతేమైంది? మీరు దేవునినుండి పొందుకున్న దానిని మనిషి పట్ల చూపిస్తున్నారా? కృపగల చర్యలకు మిమ్మల్ని ప్రేరేపించని వ్యక్తులకు మీరు కృప చూపగలరా? శుభారంభాన్ని నన్ను సూచించనివ్వండి. వంగి వారిని హత్తుకోండి. పైకి చేరే ప్రేమ ఆరాధన అవుతుంది. ఇతరులకు ఏదైనా చేసే ప్రేమ కరుణ అవుతుంది. కానీ దిగివచ్చు ప్రేమ కృప అవుతుంది.
పైన రోమాలోని వాక్యభాగంలో షరతులు లేకపోవడాన్ని మరచిపోకండి. “ఆ దుర్మార్గులు తమ చర్యను శుభ్రపరచుకోవడంలో కనీస ఆసక్తి చూపినప్పుడు, నేను వారిని మార్గం మధ్యలో కలుస్తాను,” అని దేవుడు క్రిందకు చూసి అనలేదు. లేదు, మనము పాపం చేస్తున్నప్పుడు మరియు దానిని ప్రేమిస్తున్నప్పుడు,తన కుమారుని మర్త్య రూపంలో దేవుడు దిగివచ్చి తన దివ్యకృపను విస్తరింపజేశాడు. ఆయన మన పాపాన్ని పట్టించుకోకుండా ఉండలేదు. ఆయన మన పాపాన్ని మన్నించలేదు. అది ఉన్నప్పటికీ ఆయన మన పాపమును ఎంచక మనల్ని అంగీకరించాడు. కాబట్టి? ఇతరుల తరపున మనం అక్కడికి వెళ్దాం. వారు మీ దృష్టిలో ఎంత అనర్హులు లేదా ఎంత ప్రేమలేనివారు అయినప్పటికీ ఇతరులను హత్తుకోండి.
ప్రేమలేనివారి పాపాన్ని మీరు క్షమించమని ఎవరూ ఆశించరు, లేదా మీరు వారి స్వార్థానికి కఠినత్వానికి బలి కాకూడదు. కృపను విస్తరింపజేయడమంటే మీరు వారి ప్రవర్తనను ఆమోదిస్తున్నట్లు కాదు. మరియు ప్రజలు పాపంలో కొనసాగటానికి కృప అనుమతిస్తుందని భయపడే ఉచ్చులో పడకండి. వాస్తవానికి, కృప మందలింపు కంటే వేగంగా పాపపు హృదయంలో ఒప్పుకోలును తీసుకువస్తుంది.
ఇప్పుడే ఒకరి గురించి ఆలోచించండి-ముఖ్యంగా ప్రేమలేని వ్యక్తి గురించి-మరియు మీరు ఎలా వంగి వారిని హత్తుకోగలరో ఈ రోజు నిర్ణయించుకోండి. సృజనాత్మకంగా ఉండండి. నిర్దిష్టంగా ఉండండి. మీరు చెప్పేదానిలో లేదా మీరు చేసే పనిలో వారి పట్ల కృప చూపించడానికి ఒక మార్గాన్ని ఎంచుకోండి . . . మీరు తర్వాత కలుసుకున్నప్పుడూ ఇదే చేయండి. నైకీ ప్రకటన చెప్పినట్లుగా, అది చేయండి అంతే! ధైర్యముంటే చేయండి.
Adapted from Charles R. Swindoll, “It’s Time to Embrace Grace by Embracing the Unlovely,” Insights (August 2004): 1-2. Copyright © 2004 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.