ఈస్టర్

Easter

ఆయన పునరుత్థానమును కొనియాడండి

క్రీస్తు పుట్టుక యొక్క కథనాల మాదిరిగానే, ఆయన సిలువ వేయబడటం మరియు పునరుత్థానం యొక్క వృత్తాంతాలు ఎంత సుపరిచితమైనవంటే, ఈ ఊహించని సంఘటన యొక్క ప్రభావాన్ని మనం చేజార్చుకుంటాము. యేసు తన శిష్యులను హెచ్చరించినప్పటికీ, ఆయన మరణం యొక్క గాయాన్ని లేదా ఆయన పునరుత్థానం యొక్క విస్మయాన్ని ఎదుర్కోవటానికి వారు అస్సలు సిద్ధంగా లేరు. పర్యవసానం మనకు తెలుసు కాబట్టి, వారు ఏమనుకుంటున్నారో కనుక్కోవడం మనకు కష్టం.

యేసు పుట్టుక సమయంలో మనం ఉంటే బాగుండేదని మనము కోరుకుంటున్నప్పటికీ, ఆయన క్రూరమైన, అతిబాధాకరమైన మరణాన్ని ఎవరు చూడాలని కోరుకుంటారు? ఆయన అనుభవించిన శ్రమలను గురించిన వివరాలను కొద్దిమందే చదవాలనుకుంటున్నారు. మనము సుగంధ కలువ పూలతో మరియు రంగురంగుల గుడ్లతో ఈస్టర్ను అప్రీతికరమైనది కాకుండా చేసాము.

తండ్రి తన కుమారుడిని సిలువపై వ్రేలాడదీయబడటానికి ఎందుకు అనుమతించాడో మరియు యేసు దాని నుండి తప్పించుకోకుండా ఎందుకు ఉన్నాడో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన పునరుత్థానం యొక్క మహిమను మనం గ్రహించాలి. ఈ సంఘటనలలో ప్రేమ మరియు శక్తి యొక్క ఏ మిళితమును మనం చూడవచ్చు? భవిష్యత్ విశ్వాసుల కన్నీటి స్తుతులను యేసు వినినట్లుగా ఉంది:

నా పాపం – ఓ, ఈ మహిమాన్వితమైన ఆనందపు ఆలోచన
నా పాపం – కొంత భాగం కాదు, మొత్తం,
సిలువకు వ్రేలాడదీయబడింది, మరియు నేను ఇకపై దానిని భరించను,
యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా, ప్రభువును స్తుతించుడి!1

యేసు చనిపోయి మృతులలోనుండి లేచినప్పుడు నిజంగా ఏమి జరిగిందో, వేరే ప్రత్యామ్నాయం ఎందుకు లేదో, అలాగే ఈ పునరుత్థానం ఈ రోజు ఎందుకింత ముఖ్యమైనదో బాగా అర్థం చేసుకోవడానికి ఈ పేజీలోని వనరులు మీకు సహాయపడతాయి!

  1. Horatio Spafford, “It Is Well with My Soul.”

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి