అంత్యదినములు

End Times

భవిష్యత్తు తెలుసుకోండి. సమాధానముతో జీవించండి

భూకంపాలు. కరువు. యుద్ధాలు. అన్యాయం. చాలా మంది క్రైస్తవులకు బైబిల్ “అంత్యదినములు” అని పిలిచే సమయంలో సంభవించే సంకేతాల గురించి కొంత అవగాహన ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే, మనం ఇప్పుడు అటువంటి దినాల్లోనే జీవిస్తున్నాము! క్రొత్త నిబంధన వ్రాయబడినప్పటి నుండి ప్రతి తరం యిదే విధంగా ఆలోచించింది. కొంతమంది క్రైస్తవులు ప్రకటన గ్రంథములో కనిపించే మర్మములు మరియు గురుతుల పట్ల ఆకర్షితులయ్యారు మరియు వాటి రహస్యాలను విప్పుటకు ఇష్టపడుచున్నారు. ప్రకటన గ్రంథము అందుకోసం వ్రాయబడలేదని ఇతరులు భావిస్తారు. కాబట్టి మనము మన ప్రధానమైన పిలుపు నుండి పక్కదారి పట్టకుండా ఉండటానికి దాన్ని పూర్తిగా నివారించడం మంచిదని భావించుచున్నాము.

సరైన విధానం ఏమిటి? అంత్యదినములను గురించి మనం ఏమి తెలుసుకోవాలి, అలాగే ఈ అల్లకల్లోలమైన సమయాల్లో మన విశ్వాసాన్ని కొనసాగించడానికి మనం యింకేమి చేయాలి? దిగువ ఉన్న వనరులు ఈ ముఖ్యమైన అంశంపై మీ అవగాహనను పెంచుతాయని మరియు బైబిల్ యొక్క దృఢమైన సత్యాలు తాజా “అంత్యదినముల” చిత్రం యొక్క బలహీనమైన వాస్తవాతీత గాథల నుండి మీరు వేరుగా ఉండటానికి మీకు సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి