ప్రకటన 13 లోని మృగం గురించి వివరించడానికి ఉపయోగించిన అసాధారణ-వింతైన గుర్తులు అంత్యక్రీస్తు యొక్క భయంకరమైన స్వభావాన్ని వివరించడానికి రప్పించబడ్డ భీతిగొల్పు లక్షణాలు మాత్రమే కాదు. ఈ అంత్యకాలముల నియంత యొక్క వాస్తవికతను తెలియజేయడానికి దానియేలు గ్రంథములోని నిర్దిష్ట చిత్రాల నుండి మృగము యొక్క దర్శనము తీసుకోబడింది.
దానియేలు 7 లో, దానియేలు సముద్రంలో నుండి ఒకదాని తర్వాత మరొకటి నాలుగు జీవులు పైకి రావటం చూచాడు-మొదటిది సింహమును పోలినది, రెండవది ఎలుగుబంటిని పోలినది, మూడవది నాలుగు తలల చిరుతపులిని పోలినది, మరియు నాల్గవది “ఘోరమును భయంకరమునగు…మహాబల మహాత్మ్యములుగలది” దానికి పది కొమ్ములు ఉండెను (దానియేలు 7:3-8). దానియేలు యొక్క ఈ నాలుగు జంతువులను ఇశ్రాయేలును వ్యతిరేకించిన పురాతన సామ్రాజ్యాలని జె. డ్వైట్ పెంటెకోస్ట్ సరిగ్గా వ్యాఖ్యానించారు: బబులోను, మాదీయుల-పారసీకుల రాజ్యము, గ్రీసు, మరియు రోమా.1 దానియేలు 7 లోని తలలను, కొమ్ములను కూడితే, అవి ప్రకటన 13 లోని మృగం యొక్క ఏడు తలలు మరియు పది కొమ్ములతో సమానమయ్యాయి.
మృగము దేనికి సంకేతమో జాన్ వాల్‌వోర్డ్ వివరించారు: “ప్రకటన 13:2 లో మూడు మునుపటి సామ్రాజ్యాల సంకేతములను ఈ మృగము సేకరించుకోవడం కనబడుచున్నది–గ్రీకు దేశము (చిరుతపులి, దాని. 7:6), మాదీయుల-పారసీకుల దేశము (ఒక ఎలుగుబంటి, దాని. 7:5), మరియు బబులోను (ఒక సింహం, దాని. 7:4).”2 భవిష్యత్తులోని శ్రమలకు కారకుడగు అంత్యక్రీస్తు దేవుణ్ణి మరియు ఆయన ప్రజలను వ్యతిరేకించే ప్రపంచ సామ్రాజ్యాలన్నిటినీ ఇముడ్చుకొని ఉంటాడని ఈ సంకేతము సూచించుచున్నది. అతడు నేరుగా సాతాను చేత అధికారం పొందుతాడు, అంతిమ నియంతగా వ్యవహరిస్తాడు మరియు అంతిమ దుష్ట సామ్రాజ్యాన్ని నడిపిస్తాడు.
అయితే ఈ మృగం, అంత్యక్రీస్తు ఎవరు? చరిత్ర అంతటా ప్రజలు ముద్ర వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నించారు: ఒక వ్యక్తిని ప్రకటన 13 యొక్క మృగంలాగా లేదా అబద్ధ ప్రవక్తలాగా అనుబంధించడం ద్వారా. ఒక వ్యాఖ్యాత సముచితంగా పేర్కొన్నాడు, “శతాబ్దాలుగా మృగం యొక్క సంఖ్యను నిజంగా వందలాదిమంది విభిన్నమైన మనుష్యులతో పొందిక చేశారు.”3 లాటిన్, గ్రీకు మరియు హీబ్రూలో అక్షరాలు సంఖ్యలను సూచిస్తాయి, కాబట్టి కాలిక్యులేటర్ మరియు కొంత సృజనాత్మకత ఉన్న ఎవరైనా “666” లేబుల్‌ని అనేక ప్రముఖ వ్యక్తులకు అతికించవచ్చు. ఈ క్రింది పురుషులు ముఖ్యంగా అంత్యకాలపు దుర్మార్గులుగా ప్రతిపాదించబడ్డారు:
- టైటస్ ఫ్లావియస్ వెస్పేసియన్
- నీరో కైసరు
- మహ్మద్
- కాన్స్టాంటైన్
- పోప్‌లు
- మార్టిన్ లూథర్
- నెపోలియన్ బోనపార్టే
- అబ్రహాం లింకన్
- అడాల్ఫ్ హిట్లర్
- బెనిటో ముస్సోలిని
- జాన్ ఎఫ్. కెన్నెడీ
- రోనాల్డ్ రీగన్
- మిఖాయిల్ గోర్బాచెవ్
- సద్దాం హుస్సేన్
- ఒసామా బిన్ లాడెన్
As it turns out, none of these men completely fulfilled the job description of Revelation 13. The truth is, we cannot know who the Antichrist will be until he is already in—and out of—control (2 Thessalonians 2:6-8).
- J. Dwight Pentecost, “Daniel,” in The Bible Knowledge Commentary: Old Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1985), 1350-55.
- John F. Walvoord, “Revelation,” in The Bible Knowledge Commentary: New Testament, ed. John F. Walvoord and Roy B. Zuck (Wheaton, Ill.: Victor Books, 1983), 960.
- Grant R. Osborne, Revelation, Baker Exegetical Commentary on the New Testament, ed. Mois?s Silva (Grand Rapids: Baker Academic, 2002), 519.
Adapted from Insight for Living, Revelation—Unveiling the End, Act 2: The Earthly Drama (Plano, Tex.: IFL Publishing House, 2006), 134, 146.