ప్రశ్న:
నేను ఈ మధ్యనే డావిన్సీ కోడ్ అనే పుస్తకాన్ని చదివాను. ఇది కల్పితమని నాకు తెలుసు, కానీ ఇది నేను ఎల్లప్పుడూ యేసు గురించి విశ్వసించిన ప్రతిదాన్ని ప్రశ్నించేలా చేసింది. యేసు శరీరధారియైన దేవుడని అలాగే మంచి బోధకుడు మాత్రమే కాడని మనకు ఎలా తెలుస్తుంది?
సమాధానం:
రెండు వేల సంవత్సరాలుగా, విమర్శకులు క్రైస్తవ మతానికి మూలస్తంభమైన యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి చూసారు. డాన్ బ్రౌన్ తన కల్పిత కథనం అంతటా నొక్కిచెప్పినట్లుగా, క్రైస్తవ మతం ఒక కుట్రను విజయవంతంగా కప్పిపుచ్చినందువల్ల స్థిరంగా లేదుగానీ, అది క్రీస్తు దైవత్వం యొక్క సత్యంపై ఆధారపడటంలో బలంగా నిలబడటం వలన స్థిరంగా ఉంది.
క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో క్రొత్త నిబంధన పుస్తకాలు పూర్తికాకముందే, క్రీస్తు యొక్క దైవత్వమును గూర్చిన సిద్ధాంత స్తంభం అప్పటికే స్థిరంగా ఉంది. క్రీ.శ. 325లో కౌన్సిల్ ఆఫ్ నైసియా సమయంలో రూపొందించబడిన నికేయ విశ్వాస ప్రమాణము, రాజకీయ అధికారాన్ని నిలుపుకోవడానికి సంఘము వేసిన ఎత్తుగడ అని డా విన్సీ కోడ్ పేర్కొంది. వాస్తవానికి, యేసు “దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును” అని ప్రకటించిన నికేయ విశ్వాస ప్రమాణము, ఆరంభం నుండి అంగీకరించబడిన దానినే ప్రకటించింది.
క్రీస్తు దైవత్వం గురించిన మన సమాచారానికి మూలం పరిశుద్ద గ్రంథమే. యేసు తన విషయమై ఏమని వాదించుకున్నారో మీరు తెలుసుకోవాలంటే, మీరు తప్పనిసరిగా లేఖనముల రికార్డును పరిశీలించాలి, ఇది – డా విన్సీ కోడ్ వలె కాకుండా – మొదటి శతాబ్దపు రికార్డుల ఆధారంగా మరియు ప్రత్యక్ష సాక్షుల వివరణ ద్వారా రుజువు చేయబడిన విశ్వసనీయమైన చారిత్రక వృత్తాంతము.
మీరు పరిశుద్ధ గ్రంథములో కనుగొనగలిగే యేసు ఎవరోయనే దాని గురించి ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. తొలి క్రైస్తవ రచయితలు:
- యోహాను 1:1; 20:28; రోమా 9:5; ఫిలిప్పీయులకు 2:6; తీతుకు 2:13; మరియు 1 యోహాను 5:20 వంటి వాక్యభాగాలలో కుమారుని యొక్క దైవత్వమును గూర్చి స్పష్టంగా నొక్కిచెప్పారు.
- యేసుకు దైవిక పేర్లను వర్తింపజేసారు (యెషయా 9:6; లూకా 2:11; యెషయా 40:3; మత్తయి 3:3; యిర్మీయా 23:5-6; లూకా 1:32-33; యోవేలు 2:32; మరియు అపొస్తలుల కార్యములు 2:21 ).
- ఆయనకు దైవిక గుణాలు ఆపాదించారు.
నిత్యము ఉన్నవాడు — యెషయా 9:6; యోహాను 1:1-2; ప్రకటన 1:8; 22:13
సర్వాంతర్యామి — మత్తయి 18:20; 28:20; యోహాను 3:13
సర్వజ్ఞానము గలవాడు — యోహాను 2:24-25; 21:17; ప్రకటన 2:23
సర్వశక్తిమంతుడు — యెషయా 9:6; ఫిలిప్పీయులకు 3:21; ప్రకటన 1:8
ఏకరీతిగా ఉన్నవాడు — హెబ్రీయులు 1:10-12; 13:8
తండ్రికి చెందిన ప్రతి లక్షణం — కొలొస్సయులకు 2:9 - ఆయన దైవిక కార్యాలు చేస్తున్నట్లు మాట్లాడారు.
సృష్టి — యోహాను 1:3, 10; కొలొస్సయులకు 1:16; హెబ్రీయులకు 1:2, 10
దైవసహాయము — లూకా 10:22; యోహాను 3:35; 17:2; ఎఫెసీయులకు 1:22; కొలొస్సయులకు 1:17; హెబ్రీయులకు 1:3
పాప క్షమాపణ — మత్తయి 9:2-7; మార్కు 2:7-10; కొలొస్సయులకు 3:13
పునరుత్థానం మరియు తీర్పు — మత్తయి 25:31, 32; యోహాను 5:19-29; అపొస్తలుల కార్యములు 10:42; 17:31; ఫిలిప్పీయులకు 3:21; 2 తిమోతికి 4:1
అన్నియు గతించిపోవుట మరియు సమస్తమును నూతనపరచబడుట — హెబ్రీయులకు 1:10-12; ఫిలిప్పీయులకు 3:21; ప్రకటన 21:5 - దైవిక ఘనతను ఆయనకు ఇచ్చారు (యోహాను 5:22-23; 14:1; 1 పేతురు 1:6-7; 2 పేతురు 1:17; ప్రకటన 5:13).
ఇది యేసు దైవస్వరూపుడని నమ్మే చిత్రపటాన్ని గీసిన లేఖనాల సంక్షిప్త అవలోకనం మాత్రమే. మరింత వివరణాత్మక సమాచారం కోసం, యేసు అనే అంశం క్రింద ఉన్న కథనాలను పరిశీలించండి.