అప్పుడప్పుడు, నా ఆత్మ యొక్క సున్నితమైన చోట్లలో జ్ఞాపకాలను పునరుజ్జీవింపజేసే పాత పాటను నేను వింటాను. ప్రజలు మరియు ప్రదేశాలు నీడలోనుండి బయటికి వచ్చి నాతో కొద్ది క్షణాలు సందర్శిస్తాయి. మీకు కూడా అలా జరుగుతుందా? అలా అయితే, మాటల్లో చెప్పడం ఏది కష్టమో మీకు తెలుసు. అకస్మాత్తుగా, ప్రకటన లేకుండా, జ్ఞాపకాలు నన్ను ఊడ్చేసాయి, మరియు నేను ఎల్లప్పుడూ సంతృప్తి చెందడానికి చాలా క్లుప్తంగా ఉండే ఆనందకరమైన అనుభవం కోసం దాని జిగట గూడులో చిక్కుకున్నాను . . . విస్మరించలేనంత బలముగా ఉంది . . . వర్ణించలేనంత లోతైనది . . . పంచుకోలేనంత వ్యక్తిగతమైనది.
జ్ఞప్తికి తెచ్చుకొనుట. అంటే కాల గమనములోకి అడుగు పెట్టాలని మరియు కోలుకోలేని వాటిని తిరిగి పొందాలని మనలో అసాధారణమైన ఆత్రుత. ఆ కోరికతో కూడిన కల, మనసులో సాగిన ఆ సెంటిమెంట్ ప్రయాణం-ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణించడం వల్ల చాలా అరుదుగా చర్చిస్తాము. ఇది కొన్నిసార్లు ఇక్కడ ప్రారంభమవుతుంది:
- బీచ్‌లో ఇసుకపై చెప్పులు లేని నడక
- మీరు పెరిగిన చిన్న ప్రదేశానికి నిశ్శబ్ద సందర్శన
- ఆకులు రాలే కాలములో పొగమంచుతో అడవి గుండా రాళ్లపై నిశ్శబ్దంగా జలజలమని పారే వాగును వింటున్నప్పుడు
- కుటుంబ ఆల్బమ్‌లో చిన్ననాటి ఫోటోలను చూస్తున్నప్పుడు
- మీ ఎదిగిన “బిడ్డ” ఇంటి నుండి బయటకు వెళ్లడాన్ని చూస్తున్నప్పుడు
- సన్నిహిత, వ్యక్తిగత స్నేహితుడు లేదా బంధువు యొక్క క్రొత్త సమాధి ప్రక్కన నిలబడినప్పుడు
- వెచ్చని, సలసలమను పొయ్యి వాసన మరియు శబ్దాలు
- వయస్సు యొక్క గాయముతో, మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి సంతకం చేసిన పాత లేఖ
- నిర్మానుష్యమైన కొండపైకి ఎక్కడం – ఆపై అక్కడ నిలబడి, నిశ్చలంగా . . . మౌనంగా ఉండటం
- ఒంటరిగా ఉండటం-ఎవ్వరూ లేకుండా ఉండటం-మరియు బిగ్గరగా చదవడం
- క్రిస్మస్ ఈవ్, అర్థరాత్రి, చెట్టు లైట్లు మాత్రమే మెరుస్తున్న గదిలో
- మనోహరమైన పద్యాలు. . . అందమైన స్వరమాధుర్యములు
- వివాహాలు. . . గ్రాడ్యుయేషన్లు. . . వార్షికోత్సవాలు
- మంచు . . . చక్రాలు లేని బండ్లు . . . అట్ట బండ్లు . . . పొడవైన, లోతైన కొండమీద నుండి జారటం
- మరపురాని సందర్శన తర్వాత వీడ్కోలు పలకడం
ఓహ్, అవును . . . మీరు కూడా అది అనుభవించారు. మీరు దాచడానికి ప్రయత్నిస్తున్న ఆ చిరునవ్వునుబట్టే నేను చెప్పగలను.
అందుకే నేను క్రిస్మస్ సెలవులను చాలా ఎంజాయ్ చేస్తాను. వంటగది నుండి వాసనలు, నా ప్రియమైన భార్య సన్నిధి, మనవళ్లు మనవరాళ్ల కబుర్లు, భోజనపు బల్ల చుట్టూ నవ్వులు . . . నా ఇల్లు . . . నా దేశం . . . నా సంఘము . . . మరియు నా రక్షకుని విషయమై దేవునికి కృతజ్ఞతతో కూడిన అనిర్వచనీయమైన భావాలు . . . జ్ఞాపకాల యొక్క వల నా చుట్టూ బిగుసుకుపోవడంతో, దాని ఊహాత్మక ప్రేమ తంతువులలో నన్ను దగ్గరగా పట్టుకోవడంతో అన్నీ నామీద కలుస్తాయి.
ఆయన ఆదియందు సృష్టించిన ఈ గ్రహాన్ని సందర్శించినప్పుడు యేసు ఎలా జ్ఞాపకాల భావాలను కలిగి ఉన్నాడో నేను తరచుగా ఆలోచించేవాడిని. “ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను” (యోహాను 1:11) అనే ప్రకటన ఎంత ఉత్తేజకరమైనది! చూడండి, యేసు ఒక మనిషిగా వచ్చినప్పుడు, ఆయన సుపరిచితమైన భూభాగంలో నివసించాడు మరియు నడిచాడు. ఆయన ఈ పాత భూమికి కొత్తేమీ కాదు . . . ఆయన “తన స్వంత వాటియొద్దకు” వచ్చాడు (ఉన్నదున్నట్లుగా). ఆయన చేతిపనుల దగ్గరకు వచ్చిన తర్వాత-అబ్బా, కొన్నిసార్లు ఆయన ప్రయాణం ఎంత అద్భుతంగా ఉండి ఉంటుంది! ఆయనను కోరుకోనందున, ఆయన నిశ్శబ్దం, ఒంటరితనం మరియు సామాన్య జీవితానికి నడిపించబడ్డాడు. కొండలు మరియు అరణ్యాలు మరియు గలిలయ సముద్రం ఆయన నివాసంగా మారాయి. అక్కడ ఆయన తన తండ్రితో ఉత్తమంగా సంభాషించాడు. అక్కడే ఆయన తనను వెంబడించు చిన్న బృందానికి శిక్షణ ఇచ్చాడు. కొండలు, అడవులు, సముద్రపు అలలు ఇప్పటికీ మనల్ని జ్ఞప్తికి గురి చేయడంలో ఆశ్చర్యమేముంది?
క్రిస్మస్ సీజన్‌లో ఎప్పుడైనా అలా బండి తోలుకుంటూ వెళ్లండి-అది కేవలం ఒక గంట మాత్రమే అయినా కూడా. మీ పరిసరాల నిశ్చలతలో, జ్ఞాపకాలను బయటకు తీసుకురండి. అలా పరుగెత్తనివ్వండి . . . మీ మనస్సులోని విచారణలన్నింటినీ వదిలేయండి, అలాగే అవి మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళతాయో చూడండి. ఈ సీజన్‌లో ఇది నాకు ప్రీతిపాత్రమైన కాలక్షేపాలలో ఒకటి మరియు మీరు దీన్ని నాతో ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను.
మన జ్ఞాపకాల దారిలో మనం కలుసుకుంటే, నేను చాలా సంతోషిస్తాను-మరియు నేను ఏ ఒక్కరికీ చెప్పనని వాగ్దానం చేస్తున్నాను. జ్ఞాపకాల రహస్యాలను దాచడంలో నేను నేర్పరిని.