జీవితం యొక్క ముఖ్యమైన సంఘర్షణల నడుమ వేదాంతపరమైన అంశం ఉన్నది. దానిని ప్రశ్న రూపంలో ఉంచుదాం: “దేవుడు బాధ్యత వహిస్తున్నాడా లేదా?”
పరలోకమునుండి ఏదోయొక అద్భుతమైన శక్తి ద్వారా, మన ప్రస్తుత స్థితిలో ఈ భూమిమీద నుండి పరలోకపు మహిమలోనికి వెళ్ళడానికి అనుమతి పొందగలిగితే, భయాందోళనలను తెలియజేసే ఒక్క చిన్న సాక్ష్యాన్ని కూడా మనము కనుగొనలేము. మీరు దేవుని పెదవుల నుండి “అయ్యో” అని గానీ, లేదా “అక్కడ మనం దాని గురించి ఏమి చేయబోతున్నామో నాకు ఆశ్చర్యంగా ఉంది?” అని గానీ ఎన్నడూ వినరు. అలాగే జీవముగల దేవుని ముఖంలో మనం ఎప్పుడూ ఆందోళనను గమనించము. సంభ్రమాన్ని కలిగించే ఆయన సింహాసనం చుట్టూ పరిస్థితులు ఎంత ప్రశాంతంగా ఉంటాయో చూసి మనము ఆశ్చర్యపోతాము.
మహిమ యొక్క ఈ వైపున అడుగునుండి జీవితం యొక్క అస్పష్టమైన విభిన్నకోణాలను చూస్తాము. ఇది పూర్తిగా చిక్కులు మరియు మెలికలు తిరిగిన దారులు మరియు అంతం ఎలా ఉంటుందో తెలియని అనిశ్చితతో అర్థం మరియు అందం లోపించి ఉంటుంది. కానీ దేవుని కోణం నుండి, జీవితమును పైనుండి చూస్తే, అంతయు నియంత్రణలో ఉన్నది.