రోమా 11:33-36; 2 పేతురు 3
ఇప్పటినుంచీ కొన్ని నిమిషాల పాటు, ఈ దృశ్యాన్ని ఊహించుకోండి:
అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. (2 పేతురు 3:10-12)
ఆకాశములు గతించిపోవడం మరియు ఖగోళ విధ్వంసం మరియు భూగ్రహము మొత్తం తుడిచిపెట్టుకుపోవడానికి రెండుసార్లు పేర్కొన్న “మిక్కటమైన వేండ్రము” గురించిన సంగతులు, ఇవన్నీ భయానకమైన అంశాలు. ఇవన్నీ ఎలా జరుగుతాయని నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఓహ్, సూపర్-అటామిక్ వార్‌హెడ్‌లు మరియు మూడవ ప్రపంచ యుద్ధం గురించి మీరు వినిన విషయాలనే నేను కూడా విన్నాను. కానీ ఎలా “ఆకాశములు గడిచిపోతాయో” లేదా పరిసర వాతావరణం మరియు స్ట్రాటో ఆవరణం ఎలా “రవులుకొని లయమైపోతాయో” అవి వివరించలేదు.
ఎందుకంటే అది “దేవుని దినానికి” దారిచూపుతుంది గనుక, తన రాకడను గూర్చి ప్రకటించడానికి ఆయన మానవ నిర్మిత, పెద్దపెద్ద బాణసంచా వాడతాడా అని నేను ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉన్నాను. కానీ ఇటీవల నా పఠనంలో, ఈ అంతిమ పేలుడును గెలవడానికి ప్రభువు ఎలా ప్రణాళిక వేస్తారనే దాని గురించిన సాధ్యమైన సూచనను నేను అనుకోకుండా గుర్తించాను.
మార్చి 9, 1979 న, సౌర వ్యవస్థలో వివిధ ప్రదేశాలలో ఉన్న తొమ్మిది ఉపగ్రహాలు ఏకకాలంలో అంతరిక్షంలో లోతైన వింత సంఘటనను నమోదు చేశాయి. వాస్తవానికి, ఇది ఇప్పటివరకు నమోదు చేయబడిన అత్యంత శక్తివంతమైన పేలుడు. రీడింగులను అధ్యయనం చేసిన ఖగోళ శాస్త్రవేత్తలు విస్మయం చెందారు.
గామా వికిరణం యొక్క పేలుడు సెకనులో పదోవంతు సమయం మాత్రమే నిలిచింది . . . కానీ ఆ క్షణంలో అది మూడు వేల సంవత్సరాలలో సూర్యుడు విడుదల చేసే శక్తిని విడుదల చేసింది. పాలపుంత గెలాక్సీలో గామా-రే పేలుడు సంభవించి ఉంటే, అది మన మొత్తం వాతావరణాన్ని ప్రకాశింపజేసి ఉండేదని ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త చెప్పారు. ఒకవేళ సూర్యుడు అకస్మాత్తుగా అదే శక్తిని విడుదల చేసినట్లయితే, మన భూమి ఆవిరైపోయి ఉండేది. తక్షణం.
మనము దీని యొక్క సాంకేతిక పరిజ్ఞానము గురించి శిక్షణ పొందని మరియు అజ్ఞానులమైనప్పటికీ, పేతురు యొక్క వ్యాఖ్య చెల్లుబాటు అవ్వడానికి ఇది దాని గురించి కొంత సమాచారం బయలుపరుస్తుందని నేను సూచిస్తున్నాను. కనీసం, నా అంచనా ప్రకారం, అణు యుద్ధాల కంటే ఇది ఎంతో ఎక్కువ అవగతమవుచున్నది.
ఇది బహుశా స్టార్ వార్స్ లాగా ఉంటుంది. ఇది శుభవార్త: ప్రీమియర్ షోలో ఉండటానికి నాకు ఎలాంటి ప్రణాళిక లేదు.
మీరు ఎలా అవగతం చేసుకుంటున్నారు?
మనము ఆయన మార్గములన్నింటినీ అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఎవరి మార్గములైతే “అగమ్యములో” ఆయన గురించి మనం తెలుసుకోవచ్చు.
Taken from Charles R. Swindoll, Day by Day with Charles Swindoll (Nashville: W Publishing Group, 2000), 305. Copyright © 2000 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide. Used by permission.