మీ మనస్సు, శరీరం మరియు హృదయాన్ని కాపాడుకోండి
ఒక స్త్రీ తాను ప్రియమైనదానిగా ఉండాలనే కోరిక కలిగి ఉంటుంది. ఆమె తన శరీరాన్ని అతనికి అర్పించడం ద్వారా అతని ప్రేమను గెలుచుకొని, ఆ ప్రేమను కాపాడుకోగలుగుతుందని ఆమె విశ్వసిస్తే, ఆ కోరిక కొన్నిసార్లు మగవాని మోహాలకు ఆమెను సులభంగా ఎర వేస్తుంది. కల్పిత ప్రేమకథలు కొనుగోలు చేసిన వారిలో 91 శాతం మంది మహిళలే ఎందుకు ఉన్నారో వివరించడానికి కూడా ఈ కోరిక సహాయపడుతుంది. ఈ శైలిలోని పుస్తకాలు సాధారణంగా మానసికంగా సంతృప్తికరమైన, ఆశావాద ముగింపు కలిగి ఉండాలి-ఇదే దీని సూత్రము, అందుకే కల్పిత ప్రేమకథల పుస్తకాలకు సాహిత్య మార్కెట్లో అత్యధిక వాటా ఉన్నది మరియు ఇ-బుక్ మార్కెట్లో కూడా ఈ శైలి రెండవ అతిపెద్దదిగా ఉన్నది.1
కాబట్టి ఒక క్రైస్తవ స్త్రీ తన మనస్సు, శరీరం మరియు హృదయాన్ని మరకబడిన కఠినమైన లోకంలో పరిశుద్ధముగాను మంచిగాను ఉంచుకొని, ఈ ఆకర్షణను ఎలా అడ్డుకుంటుంది? ఎలిసబెత్ ఇలియట్ తన మహాకావ్య పుస్తకం పాషన్ అండ్ ప్యూరిటీ యొక్క ముందుమాటలో ఇలా వ్రాసింది: “ఒక క్రైస్తవుని ప్రేమ జీవితం కీలకమైన యుద్ధభూమి. మరెక్కడా లేకపోతే, అక్కడే, ప్రభువు ఎవరనేది నిర్ణయించబడుతుంది: ప్రపంచం, స్వయం మరియు దెయ్యం, లేదా ప్రభువైన క్రీస్తు.”2
మీ వద్ద సరైన ఆయుధాలు మరియు కవచాలతో ఆ యుద్ధంలో విజయం సాధించడంలో మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. ఈ పేజీలోని వనరులు మీకు అంతిమ సంతృప్తి మరియు విలువ యిచ్చే ఏకైక వనరు వైపు చూపుతాయి: యేసు, మీ ఆత్మ యొక్క ప్రేమికుడు!
- Romance Writers of America, “Romance Literature Statistics,” Romance Writers of America, http://www.rwa.org/cs/the_romance_literature_statistics/industry_statistics (accessed March 24, 2011).
- Elisabeth Elliot, Passion and Purity: Learning to Bring Your Love Life Under Christ’s Control (Grand Rapids: Fleming H. Revell Company, 1984), 12.
సంబంధిత వ్యాసాలు
- దురాశ గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుందిBiblical Counselling Ministry
- దుర్భరమైన నిజం: మీ భర్త యొక్క ఇంటర్నెట్ సెక్స్ అలవాట్ల వలన మీరు భావోద్వేగ ప్రభావంతో వ్యవహరించడంBiblical Counselling Ministry
- నైతిక పరిశుద్ధతPastor Chuck Swindoll
- మూడు సెకన్ల విరామంColleen Swindoll-Thompson