లైంగిక వేధింపులు

sexual abuse

స్వస్థపరచువాని నుండి సహాయం పొందుకొనుడి

లైంగిక వేధింపులు మానవులు రూపొందించిన అత్యంత వినాశకరమైన పాపాలలో ఒకటిగా నిలిచి, లోతైన గాయములను మరియు చెప్పలేని బాధలను వదిలివేయుచున్నవి. లైంగిక వేధింపుల బాధితులు తమను వేధించిన వారి చేతుల్లో చాలా బాధను అనుభవించారు ; యేసు క్రీస్తు మరియు ఆయన సంఘము ప్రతిస్పందనగా ఎంతో సహాయం చేస్తున్నారు.

ముఖ్యముగా లైంగిక వేధింపులు అనేవి నిస్సహాయులను మరియు శక్తిలేనివారిని ఒక వ్యక్తి దోచుకోవడమే. దేవుడు యిటువంటి విషయాలను గూర్చి లేఖనములో ప్రస్తావించడంలో ఎన్నడూ ఊగిసలాడలేదు. సమాజంలో “దీనులను” దోచుకొనువారి పాపాన్ని ఆయన ఖండించారు. అలాగే అవసరతల్లో ఉన్నవారికి సహాయం చేసి, వారిని కాపాడాలని సంఘానికి పిలుపునిచ్చాడు (యెషయా 1:23; యాకోబు 1:27). ఈ ప్రపంచంలో బాధపడుతున్న బాధితులకు రక్షణ, మార్గదర్శకత్వం మరియు స్వస్థత అందించడానికి క్రీస్తు శరీరమునకు, అనగా సంఘమునకు బాధ్యత ఉంది.

ఈ వనరులు, ప్రసంగాలు మరియు వ్యాసాలు మీ స్వంత జీవితంలో లైంగిక వేధింపుల ప్రభావాలను ఎదుర్కోవటానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు అర్థం చేసుకోవడానికి, ఆదరణ పొందడానికి మరియు స్వస్థత పొందడానికి మార్గాన్ని మీకు . . . లేదా మీకు తెలిసిన వారి జీవితంలో సూచించడానికి సహాయపడతాయి.

సంబంధిత వ్యాసాలు

మరిన్ని వ్యాసాలను చూడండి